Jio Offering 20GB Extra Data : రిలయన్స్ జియో తమ యూజర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కొన్ని పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై 6జీబీ, 18జీబీ, 20జీబీ, 78జీబీ వరకు అదనపు డేటాను పూర్తి ఉచితంగా అందిస్తోంది. పైగా వీటన్నింటిలోనూ అపరిమిత 5జీ డేటాను ఫ్రీగా ఇస్తోంది. సూపర్ కదా! మరెందుకు ఆలస్యం ఆ ప్లాన్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
Rs.398 Plan : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 2జీబీ డేటా లభిస్తాయి. పైగా ఈ ప్లాన్‌తో 6 జీబీ డేటా అదనంగా వస్తుంది. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు ఉచితంగా జియో టీవీ, జియోక్లౌడ్ యాప్‌లతో పాటు సోనీలివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్‌నెక్ట్స్, చౌపల్, డాక్యుబే, ఎపిక్ ఆన్ లాంటి ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Rs.749 Plan : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు 20 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్; రోజుకు 100 SMSలు, 2జీబీ డేటా దొరుకుతుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు.
Rs.1198 Plan : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 2జీబీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు 18 జీబీ అదనపు డేటా లభిస్తుంది. జియో టీవీ, జియో క్లౌడ్ యాప్‌లతో పాటు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, డిస్కవరీ+ సహా మొత్తం 14 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ పూర్తి ఉచితంగా అందిస్తారు.
Rs.4498 Plan : ఇది ఒక వార్షిక ప్లాన్ (వ్యాలిడిటీ 365 రోజులు). అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 2జీబీ డేటా వస్తాయి. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు 78 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్ యాప్‌లతో పాటు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, డిస్కవరీ+ సహా మొత్తం 14 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది.
రూ.6 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-5 మోడల్స్ ఇవే! - Best Cars Under 6 Lakh