Jio Booster Plan Price : కొద్ది రోజుల క్రితం టెలికాం ఛార్జీలను పెంచిన రిలయన్స్ జియో, కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్ డేటా ప్లాన్లు రీఛార్జి చేసిన యూజర్ల కోసం వీటిని అందుబాటులోకి తెచ్చింది. వారు ఈ ప్లాన్లతో రీఛార్జి చేసుకుంటే 4జీ డేటాతో పాటు అన్లిమిటెడ్ డేటా సేవలను కూడా పొందొచ్చు. ఈ కొత్త ప్లాన్లు తీసుకురాకముందు 5జీ నెట్వర్క్ పరిధిలో ఉన్న 5జీ మొబైల్ యూజర్లందరికీ దాదాపు అన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ డేటాను జియో అందించేది. ప్లాన్ల సవరణ తర్వాత 2జీబీ ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వారికే అనే షరతు విధించింది. అంటే రోజుకు 1.5జీబీ డేటా లేదా అంతకంటే తక్కువ ఉన్న ప్లాన్లలో ఇక మీదట 5జీ అన్ లిమిటెడ్ డేటాను పొందలేరన్నమాట.
బూస్టర్ ప్లాన్స్ ఇవే
'ట్రూ అన్ లిమిటెడ్ అప్ గ్రేడ్' పేరిట జియో 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.51, రూ.101, రూ.151 ధరల్లో ఈ మూడు ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. రూ.51తో రీఛార్జి చేసుకుంటే 3జీబీ 4జీ మొబైల్ డేటా లభిస్తుంది. అపరిమిత 5జీ డేటాను ఆనందించొచ్చు. రూ.101 ప్లాన్‌పై 6జీబీ 4జీ డేటా, అన్ లిమిటెట్ 5జీ డేటాను పొందొచ్చు. రూ.151 ప్లాన్‌పై 9జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీనే వీటికి వర్తిస్తుంది.
రూ.51, రూ.101, రూ.151 ఈ మూడు బూస్టర్ ప్లాన్లను సాధారణ రీఛార్జి ప్యాక్‌తో కలిపి చేసుకుని అన్లిమిటెడ్ డేటాను ఆస్వాదించొచ్చు. రూ.61తో చేసుకునే జియో 5జీ అప్‌గ్రేడ్ యాడ్-ఆన్ ప్లాన్‌ను తీసివేసింది. ఈ ప్లాన్‌కు బదులుగానే రూ.101తో బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
పెరిగిన టారిఫ్ ఛార్జీలు
అంతకుముందు రూ.239 ప్లాన్‌కు రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు, 5జీ నెట్వర్క్ పరిధిలో ఉన్న 5జీ మొబైల్ యూజర్లందరికీ అన్ లిమిటెడ్ డేటా లభించేది. ఇటీవలే మారిన జియో టారిఫ్ ఛార్జీలతో ఇదే ప్లాన్ రూ.60 పెరిగింది. అంటే రూ.299కు చేరింది. రోజుకు 2 జీబీ డేటాతో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ రూ.349కు చేరింది. ప్రస్తుతం అన్లిమిడెట్ డేటా కూడా లభించట్లేదు. దాని కోసం పత్యేకంగా బూస్టర్ ప్లాన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల వరకు 5జీ ఆన్లిమిటెడ్ డేటాను ఉచితంగా పొందిన యూజర్లు ప్రస్తుతం దానికి సైతం రీఛార్జి చేయాల్సి ఉంటుంది. జియోతో పాటు టారిఫ్ ఛార్జీలను పెంచిన ఎయిర్ టెల్ 5జీ అన్ లిమిటెడ్ డేటాపై ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.