ETV Bharat / business

దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్​, జియో బ్రెయిన్ - ఏఐ ఫోన్ కాల్స్ కూడా! - Jio AI Cloud Storage

Jio AI Cloud Storage : రిలయన్స్ జియో తమ యూజర్లకు ఈ ఏడాది దీపావళి నుంచి ఏఐ క్లౌడ్‌ స్టోరేజీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వెల్​కమ్​ ఆఫర్ కింద 100జీబీ ఉచిత స్టోరేజీని అందించనుంది. ప్రతి ఒక్కరికీ ఏఐ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వాయిస్ కమాండ్స్​తో సెట్​అప్​​ బాక్స్​ను కంట్రోల్ చేసేలా జియోటీవీ ఓఎస్​ను తీసుకురానుంది.

Jio AI Cloud Storage
Jio AI Cloud Storage (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 6:35 PM IST

Jio AI Cloud Storage : జియో యూజర్లకు రిలయన్స్ గుడ్​న్యూస్ చెప్పింది. ఈ దీపావళీ నుంచి ఏఐ క్లౌడ్‌ స్టోరేజీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద జియో యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరేజ్​ను అందించనుంది. వాటితోపాటు ఏఐ ప్లాట్‌ఫామ్‌ 'జియో బ్రెయిన్‌'ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. తక్కువ ధరకే ఏఐ మోడల్‌ సర్వీసులను అందించనుంది. రానున్న ప్రతి నెలా మిలియన్ బ్రాడ్​బ్యాండ్ కనెక్షన్స్​ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎమ్​లో ముకేశ్ అంబానీ తెలిపారు.

వెల్​కమ్​ ఆఫర్​ కింద 100జీబీ క్లౌడ్​ స్టోరేజ్ ఫ్రీ
'జియో వినియోగదారులు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి డిజిటెల్ కంటెంట్​ను​, డేటాను భద్రంగా దాచుకునేందుకు వీలుగా జియో క్లౌడ్​ స్టోరేజ్​ను తీసుకురానున్నాం. వెల్కమ్​​ ఆఫర్​ కింద 100జీబీ క్లౌడ్​ స్టోరేజీని ఉచితంగా అందించనున్నాం. అది కూడా ఈ ఏడాది దీపావళి నుంచి ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాం. క్లౌడ్​ స్టోరేజ్, డేటా ఆధారిత ఏఐ సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని మేము భావిస్తున్నాము' అని ముకేశ్ అంబానీ అన్నారు.

జియో బ్రెయిన్‌
తమ యూజర్ల కోసం ఏఐ ప్లాట్‌ఫామ్‌ 'జియో బ్రెయిన్‌'ను మరింత విస్తరిస్తున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు. తక్కువ ధరకే ఏఐ మోడల్‌ సర్వీసులను అందిస్తామని తెలిపారు. 'కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా, మెరుగైన సేవలు అందించేందుకు 'జియో బ్రెయిన్‌'ను జియో ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఇతర రిలయన్స్‌ కంపెనీల్లోనూ వినియోగించనున్నాం. విద్య, ఆసుపత్రి, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో ఈ సేవలను అందించనున్నాం. యూజర్లకు కచ్చితమైన సమాచారంతో పాటు, వేగవంతమైన సేవలను అందించడమే మా లక్ష్యం' అని అంబానీ వివరించారు.

ప్రతి నెలా మిలియన్ హోమ్ బ్రాడ్​బ్యాండ్
రానున్న రోజుల్లో ప్రతి 30 రోజులకు ఒక మిలియన్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నన్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం 100 రోజులకు ఒక మినియన్ ఎయిర్​ఫైబర్ కస్టమర్లు వస్తున్నట్లు వెల్లడించారు. జియో ఎయిర్​ఫైబర్ 100 మిలియన్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లను రికార్డు వేగంతో చేరుకోగలదనే నమ్మకం తమకు ఉందన్నారు.

వాయిస్​ కమాండ్స్​తో సెటప్​​ బాక్స్ కంట్రోల్
కొత్తగా ప్రారంభించిన జియోటీవీ ఓఎస్‌లో భాగంగా సెటప్​​ బాక్స్‌ రిమోట్‌లోనే 'హెలో జియో'ను తీసుకొస్తున్నారు. వాయిస్ కమాండ్స్ ద్వారా సెటప్​​ బాక్స్​ను కంట్రోల్ చేయొచ్చు. ఇందుకోసం రిమోట్‌లోనే ఓ మైక్‌ బటన్‌ ఇచ్చారు. దీంతో వాల్యూమ్‌ తగ్గించడం, పెంచడం వంటివి చేయొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌ వంటి యాప్స్‌ను కూడా యాక్సెస్‌ చేయొచ్చని జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు.

ఏఐ ఫోన్​కాల్స్
'జియో ఫోన్‌కాల్ ఏఐ' సర్వీసులనూ ప్రారంభిస్తున్నట్లు ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ నంబర్‌ కేటాయించారు. దీని ద్వారా మీ కాల్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. ఆ కాల్‌ రికార్డులు జియో క్లౌడ్‌లో ఆటోమేటిక్‌గా స్టోర్‌ అవుతాయి. కాల్‌ రికార్డ్​ కావాలంటే, వేరే భాషలోకి మార్చుకోవచ్చు. జియో క్లౌడ్‌ నుంచి ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు.

అదానీ బౌన్స్ బ్యాక్​​ - దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరణ - ఒక్క ఏడాదిలోనే 95% పెరిగిన సంపద! - Adani Replaces Ambani

రిలయన్స్ గుడ్ న్యూస్- షేర్ హోల్డర్లకు 1:1 బోనస్​- జియో యూజర్లకు 100 జీబీ ఫ్రీ క్లౌడ్​ స్టోరేజ్​! - Reliance Bonus Issue On Sep 5

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.