ETV Bharat / business

ఫ్రీగా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కావాలా? ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండి! - Jan Dhan Zero Balance Account

Jan Dhan Account Benefits In Telugu : మీరు ఉచితంగా ప్రమాద బీమా, జీవిత బీమా పొందాలని అనుకుంటున్నారా? వీటితో పాటు ఓవర్​డ్రాఫ్ట్​ సౌకర్యం కూడా ఉండాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్​ ధన్ యోజన పథకంలో చేరితే జీవిత బీమా, ప్రమాద బీమా, ఓవర్​ డ్రాఫ్ట్​ సౌకర్యం సహా బోలెడు ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Jan Dhan Account Insurance
Jan Dhan Account Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 12:42 PM IST

Jan Dhan Account Benefits : ఒకప్పుడు బ్యాంకులో అకౌంట్ తెరవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి. బ్యాంకు అధికారులు రకరకాల డాక్యుమెంట్లు తీసుకురావాలని, డిపాజిట్ కట్టాలని అడిగేవాళ్లు. దీంతో చాలా మందికి బ్యాంక్ ఖాతాలు ఉండేవి కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'జన్​ ధన్ యోజన' పథకాన్ని తీసుకువచ్చారు.

జన్‎ధన్ యోజన బెనిఫిట్స్​
నరేంద్ర మోదీ 2019 ఆగష్టు 28న ప్రధానమంత్రి జన్‎ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద పౌరులందరూ ఎలాంటి డిపాజిట్ లేకుండా బ్యాంక్ ఖాతాలు తెరిచే అవకాశం లభించింది. కేవలం దరఖాస్తు ఫారం నింపి, కొన్ని డాక్యుమెంట్లు జతచేసి ఇస్తే, బ్యాంక్​లు మీ పేరు మీద ఈ జన్​ ధన్ ఖాతాలను తెరుస్తాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 51.50 కోట్ల మందికి ప్రధానమంత్రి జన్ ‎ధన్ యోజన కింద లబ్ధి చేకూరుతోంది. అయితే వీటిలో 50 శాతం అకౌంట్లు మహిళలవే కావడం విశేషం. జన్‎ధన్ యోజన కింద తెరిచిన అకౌంట్లు కేవలం బ్యాంక్ ఖాతాలుగా మాత్రమే కాకుండా, అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జన్‎ధన్ అకౌంట్ వల్ల కలిగే ప్రయోజనాలు :

  • అకౌంట్​లో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.
  • అకౌంట్​లో పొదుపు చేసిన సొమ్ముపై వడ్డీ వస్తుంది.
  • రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది
  • రూ.30 వేల వరకు జీవిత బీమా లభిస్తుంది.
  • ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు వచ్చే సొమ్ము నేరుగా ఈ జన్-ధన్ అకౌంట్లోకి వచ్చి పడుతుంది.
  • ఖాతా తెరిచి 6 నెలల తరువాత ఓవర్ డ్రాఫ్ట్​ పొందవచ్చు.
  • గతంలో రూ.5000ల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చేవారు. తరువాత దానిని రూ.10 వేలకు పెంచారు.
  • మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సహా, అన్ని సేవలను ఉచితంగా పొందవచ్చు.

జన్ ధన్ అకౌంట్లు ఎవరు, ఎక్కడ తెరవవచ్చు?
జన్ ధన్ ఖాతాను ఏ బ్యాంకు బ్రాంచులోనైనా తెరవవచ్చు. లేదా బిజినెస్ కరెస్పాడెంట్ అవుట్‌లెట్స్​ దగ్గర కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. వయోజనులతోపాటు, మైనర్లు కూడా ఈ ఖాతాను తెరవచ్చు. అంతేకాదు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జాయింట్ అకౌంట్​ను కూడా ఓపెన్ చేయవచ్చు. చెక్ బుక్ కావాలంటే మాత్రం మినిమం బ్యాలెన్స్​ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.

ఫిక్స్​డ్​ డిపాజిట్లపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

కొత్త ఇల్లు కొనుగోలు చేశారా?- అయితే మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.