ETV Bharat / business

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ 10 తప్పులు అస్సలు చేయకండి!

ITR Filing Tips : మీరు మొదటిసారిగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఐటీఆర్​ ఫైల్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. ఒకవేళ తెలిసీ, తెలియక తప్పులు చేస్తే, భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

itr filing guide in telugu
ITR Filing Tips in telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 12:31 PM IST

ITR Filing Tips : ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్​) దాఖలు చేయడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఐటీ చట్టాలపై సరైన అవగాహన ఉండదు. దీనితో తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలితంగా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ ఆర్టికల్​లో ఐటీఐర్ దాఖలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

1. వ్యక్తిగత సమాచారంలో తప్పులు ఉండకూడదు!
ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీ వ్యక్తిగత వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలి. మీ పూర్తి పేరు, పాన్ కార్డ్​ నంబర్​, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ లాంటి వివరాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. లేదంటే ప్రాసెసింగ్ ఆలస్యం అవుతుంది. లేదా ఆదాయ పన్ను రిటర్న్​ల్లో సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే వ్యక్తిగత సమచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం ఉత్తమం.

2. ఫారమ్ 26AS, ఫారమ్ AIS మధ్య సమన్వయం ఉండాలి!
ఐటీఆర్​ ఫైలింగ్​లో పారదర్శకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం వార్షిక సమాచార ప్రకటన (AIS)ను ప్రవేశపెట్టింది. కనుక పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వివరాలను ఫారమ్ ఏఐఎస్​, ఫారమ్​ 26ఏఎస్​​ల్లో ఒకేలా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే వాటిలో తగు సవరణలు కూడా చేసుకోవాలి.

3. మీ అన్ని ఆదాయ వనరుల గురించి తెలియజేయాలి!
చాలా మంది ఐటీఆర్​లు దాఖలు చేస్తారు కానీ, వారి ఆదాయ వనరుల గురించి తెలియజేయరు. దీని వల్ల వారికే నష్టం ఏర్పడుతుంది. అందువల్ల జీతం, అద్దె ఆదాయం, వడ్డీ ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ద్వారా వచ్చే ఆదాయం ఇలా అన్ని మార్గాల ద్వారా వస్తున్న ఆదాయ వివరాలను ఐటీఆర్​లో పేర్కొనాలి. ఇలా చేయకపోతే, మీపై పెనాల్టీలు వేయవచ్చు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. కనుక మీకు ఏయే మార్గాల్లో ఆదాయం వస్తుందో, పూర్తిగా ఐటీఆర్​లో తెలిపాలి.

4. డిడక్షన్​లను క్లెయిమ్ చేయడం మర్చిపోకూడదు!
మెడికల్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ లోన్​ వడ్డీ, దాతృత్వ విరాళాలు లాంటి వాటికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. కానీ చాలా మంది ఇది తెలియక, పన్ను మినహాయింపు (డిడక్షన్​)లను క్లెయిమ్ చేయరు. దీని వల్ల వారు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. కనుక మీకు న్యాయబద్ధంగా రావాల్సిన పన్ను మినహాయింపులను కూడా ఐటీఆర్​లో ఫైల్ చేయాలి. ముఖ్యంగా మీరు పాత పన్ను​ విధానాన్నే అనుసరిస్తూ ఉంటే, ట్యాక్స్ డిడక్షన్​లను కచ్చితంగా క్లెయిమ్ చేసుకోవాలి.

5. తప్పనిసరిగా ఐటీఆర్​ వెరిఫికేషన్ చేసుకోవాలి!
చాలా మంది ఐటీఆర్​ను దాఖలు చేస్తుంటారు. కానీ దానిని వెరిఫికేషన్​ ప్రాసెస్​ను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు చాలా సింపుల్​గా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఐటీఆర్​ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. లేదా ఐటీఆర్​-V ఫారంపై సంతకం చేసి, దాని కాపీని సెంట్రలైజ్డ్​ ప్రాసెసింగ్ సెంటర్​ (సీపీసీ)కు పంపించాలి. అది కూడా ఐటీఆర్​ ఫైల్ చేసిన 120 రోజుల్లోనే పంపించాల్సి ఉంటుంది. ఇలా చేయకుంటే, మీ ఐటీఆర్​ అనేది చెల్లకుండా పోతుంది. అందుకే సకాలంలో ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.

6. బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి!
ఐటీఆర్ దాఖలు చేసిన తరువాత మీకు రీఫండ్ వస్తుంది. కనుక మీ బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలి. ఒక వేళ మీ బ్యాంక్ ఖాతా వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే, రీఫండ్ రావడం ఆలస్యం కావచ్చు. లేదా కొన్ని సార్లు రీఫండ్ రాకపోవచ్చు. కనుక మీ బ్యాంక్ ఖాతా వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. అప్పుడే రీఫండ్ విషయంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడవు.

7. విదేశాల్లోని ఆస్తుల వివరాలు కూడా చెప్పాలి!
రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు తమ ఆస్తుల, అప్పుల వివరాలను కూడా ఐటీఆర్​లో నివేదించాలి. అలాగే సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా తమకు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు తెలియజేయాలి. మీరు ఒక కంపెనీలో డైరెక్టర్​షిప్​ కలిగి ఉంటే, లేదా షేర్లు కలిగి ఉంటే వాటిని కూడా ఐటీఆర్​లో ఫైల్​ చేయాలి. ఒకవేళ మీరు ఈ విషయాలను ఐటీఆర్​లో పేర్కొనకపోతే ఆదాయ పన్ను చట్టం, నల్లధనం చట్టం ప్రకారం, మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

8. 'టీడీఎస్​, టీసీఎస్'లను​ క్లెయిమ్ చేసుకోవాల్సిందే!
మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు, మూలం వద్ద మినహాయించిన పన్నులు (టీడీఎస్), మూలం వద్ద వసూలు చేసిన పన్నులు (టీసీఎస్​) లను కచ్చితంగా క్లెయిమ్ చేసుకోవాలి. లేకుంటే మీకు రీఫండ్​ రాకపోగా, మీరే అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు టీడీఎస్​, టీసీఎస్​లను తప్పనిసరిగా క్లెయిమ్ చేసుకోవాలి.

9. ఆన్​టైన్​లో ఐటీఆర్ ఫైల్ చేయాలి!
ఆదాయ పన్ను రిటర్నులను గడువు తేదీలోపు చెల్లించాలి. ఇలా చేయకుంటే జరిమానాలు, అదనపు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ 2024 ఆర్థిక సంవత్సరంలో జులై 31లోపు ఐటీఆర్​ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి లేటు ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఈ గడువులోగా ఐటీఆర్​ ఫైల్ చేయకపోతే 2024 డిసెంబర్ 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

10. అన్ని ఆర్థిక రికార్డులు భద్రపరుచుకోవాలి!
చాలా మంది తమ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులను సరిగ్గా మెయింటైన్ చేయరు. ఇది సరైన విధానం కాదు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు, అందులోని విషయాలను ధ్రువీకరించడానికి సరైన రికార్డులను ఆదాయ పన్ను శాఖవారికి చూపించాల్సి ఉంటుంది. అందువల్ల మీ బ్యాంక్ స్టేట్​మెంట్లు, రసీదులు, ఇన్​వాయిస్​లు, ఇతరత్రా కీలకమైన పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఇన్​కం టాక్స్ డిపార్ట్​మెంట్​వారు అసెస్​మెంట్ చేసేటప్పుడు, సరైన ఆధారాలు చూపించడానికి వీలవుతుంది. ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే, మీ ఐటీఆర్ ఫైలింగ్ సజావుగా జరుగుతుంది. మీకు సకాలంలో రీఫండ్ కూడా వస్తుంది.

కొత్తగా బ్యాంక్ లాకర్ తీసుకోవాలా? ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోండి!

స్టార్టప్ కోసం లోన్ కావాలా? ఈ ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ స్కీమ్స్​ గురించి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.