ETV Bharat / business

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి - లాస్ట్ డేట్ ఇదే! - Documents Required To File ITR

Documents Required To File ITR : వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్) సమర్పించడానికి జూలై 31 వరకు గడువు ఉంది. వ్యక్తులకు లభించే ఆదాయం రకాన్ని బట్టి ఐటీఆర్‌ను ఫైల్ చేసే పద్ధతిలో తేడా ఉంటుంది. ఇందుకోసం ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇక కామన్‌గా ప్రతీ పన్ను చెల్లింపుదారుడు తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Income Tax Documents
Documents Required To File ITR (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 3:00 PM IST

Documents Required To File ITR : వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్) సమర్పించడానికి జూలై 31 వరకు గడువు ఉంది. అయితే గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తుందా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఉద్యోగం ద్వారా వచ్చే సాలరీ రికార్డులు, వ్యాపారం ద్వారా సమకూరే ఆదాయం వివరాలతో కూడిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, మునుపటి పన్ను రిటర్న్‌లు వంటి డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వివిధ పెట్టుబడుల ద్వారా సమకూరిన ఆదాయాల వివరాలను సైతం సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం రకాన్ని బట్టి ఐటీఆర్‌ను ఫైల్ చేసే పద్ధతిలో తేడా ఉంటుంది. ఐటీఆర్ దాఖలు కోసం ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన డాక్యుమెంట్లను ఇవ్వాలి. ఇక కామన్‌గా ప్రతీ పన్ను చెల్లింపుదారుడు తప్పనిసరిగా సమర్పించాల్సిన కొన్ని పత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాన్ కార్డ్
ఐటీఆర్‌‌ను ఫైల్ చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(టీడీఎస్)లో మినహాయింపులు పొందేందుకు పాన్‌ను సమర్పించాలి. ఆదాయపు పన్ను రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతాకు తప్పకుండా పాన్ కార్డు లింక్ అయి ఉండాలి. ఫామ్ 26ఏఎస్, ఫామ్ 16, ఫామ్ 12బీబీలను సమర్పించేటప్పుడు కూడా పాన్‌ను జతపర్చాలి. పన్ను చెల్లింపుదారులు పాన్‌కు బదులుగా ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి కూడా ఐటీఆర్‌ను ఫైల్ చేయొచ్చు.

2. ఆధార్ కార్డ్
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం, వ్యక్తులు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు అతని/ఆమె ఆధార్ కార్డ్ వివరాలను కూడా అందించాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకుంటే, దాని కోసం అప్లై చేయగా వచ్చిన ఐడీ నంబరును ఐటీ రిటర్న్‌లలో ప్రస్తావించాలి. పాన్‌ను ఆధార్‌తో తప్పకుండా లింక్ చేయాలి. దీనివల్ల ఆన్‌లైన్‌లో ఐటీఆర్ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ను చాలా ఈజీగా, మన ఫోనుకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి పూర్తి చేయొచ్చు.

3. ఫామ్ 16
ఫామ్ 16 అనేది ఉద్యోగుల తరఫున ఆదాయపు పన్ను శాఖకు కంపెనీ ఏటా సమర్పించే డాక్యుమెంట్. ఇందులో ఉద్యోగి జీతం సమాచారం, జీతం నుంచి కోతపెట్టిన టీడీఎస్ వివరాలు పొందుపర్చి ఉంటాయి. ఫామ్ 16లో రెండు భాగాలు ఉంటాయి. ఇందులోని పార్ట్- ఏలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగి జీతం నుంచి కంపెనీ తగ్గించిన ట్యాక్సు వివరాలు ఉంటాయి. కంపెనీకి చెందిన పాన్ నంబరు, ట్యాన్ నంబరు వివరాలు ఉంటాయి. ఇక పార్ట్ -బీలో ఉద్యోగి గ్రాస్ సాలరీలోని బ్రేకప్ వివరాలు, వివిధ అలవెన్సుల నుంచి అందిస్తున్న మినహాయింపుల సమాచారం, ఉద్యోగికి అందిస్తున్న అదనపు ప్రయోజనాల వివరాలు ఉంటాయి. ఒకవేళ మీరు కంపెనీ నుంచి ఫామ్ 16 తీసుకోకున్నా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.

4. ఫామ్ 26ఏఎస్
ఫామ్ 26ఏఎస్‌లో మీ ఆదాయం/సాలరీలో నుంచి కట్ అయిన పన్నుల వివరాలు ఉంటాయి. ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు చెల్లించిన పన్నుల ఇన్ఫో, ట్యాక్స్ రీఫండ్‌ల చిట్టా ఫామ్ 26ఏఎస్‌లో ఉంటుంది. వివిధ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీ తరఫున అందిన పన్నుల వివరాలన్నీ ఈ ఫామ్‌లో ఉంటాయి. ఆదాయపు పన్ను శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో ఈ ఫామ్‌‌ను పొందొచ్చు.

5. సెక్షన్ 80సీ పెట్టుబడి పత్రాలు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (యులిప్స్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాలసీల కింద పెట్టిన పెట్టుబడులకు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. మీకు పన్ను మినహాయింపు లభించాలంటే, ఈ పెట్టుబడులకు సంబంధించిన అన్ని రసీదులను ఐటీ శాఖకు సమర్పించాలి. ముందుజాగ్రత్త చర్యగా కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను భద్రపర్చుకోవాలి.

6. ఇతర పత్రాలు
ఐటీఆర్ ఫైలింగ్ చేసే క్రమంలో మీరు జతపర్చాల్సిన ఇతర డాక్యుమెంట్లు ఏమిటంటే, ప్రావిడెంట్ ఫండ్‌(పీఎఫ్) కోసం మీరు చెల్లిస్తున్న అమౌంట్ సమాచారం, మీ పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపు, వివిధ లావాదేవీల సందర్భంగా చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల వివరాలను ఐటీఆర్‌తో పాటు ఇవ్వొచ్చు. తద్వారా మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక హోం లోన్​పై ప్రిన్సిపల్ రీపేమెంట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్/మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి, సెక్షన్ 80C కింద క్లెయిమ్ చేయగల గరిష్ఠ మొత్తం రూ.1.5 లక్షలు ఉన్నప్పుడు కూడా సంబంధిత పత్రాలను సమర్పించి పన్నును ఆదా చేసుకోవచ్చు.

7. బ్యాంకు ఖాతాల వివరాలు
మీకు సంబంధించిన అన్ని బ్యాంకు అకౌంట్ల వివరాలను ఐటీఆర్‌లో ప్రస్తావించాలి. బ్యాంక్ పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను అందించాలి. అయితే ట్యాక్స్ రీఫండ్ కోసం వాటిలో ఏదైనా ఒక బ్యాంకు ఖాతాను ప్రైమరీ అకౌంట్‌గా పేర్కొనాలి. ఐటీ శాఖ ఆదాయ సమాచారాన్ని, లావాదేవీలను ధ్రువీకరించడానికి బ్యాంక్ సమాచారం చాలా కీలకం.

8. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)
పన్ను చెల్లింపుదారులకు ఫామ్ 26ఏఎస్‌లోని సమాచారాన్ని సవివరంగా అందించేదే వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్). ఏఐఎస్ సమాచారాన్ని చెక్ చేసుకొని, ఐటీ శాఖకు ఫీడ్ బ్యాక్‌ను అందించే వెసులుబాటు కూడా ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్), స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (ఎస్‌ఎఫ్‌టీ) వంటి విభాగాలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుడి ప్రతిపాదనలు, ఐటీ శాఖ మదింపు చేసి ఖరారు చేసిన పన్ను గణాంకాల వివరాలను వేర్వేరుగా అర్థమయ్యేలా ఏఐఎస్‌లో పొందుపరిచి అందిస్తారు.

9. పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం
పన్నుచెల్లింపుదారులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కేటగిరీ వారీగా అందించేదే పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (టీఐఎస్). ఇందులో జీతం, వడ్డీ, డివిడెండ్ వంటి విభిన్న కేటగిరీల సమాచారాన్ని విడివిడిగా అర్థవంతంగా పొందుపరుస్తారు. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ట్యాక్స్ పేయర్ తన ఐటీఆర్‌ను ఈజీగా ఫైల్ చేయగలుగుతాడు.

10. గృహ రుణ వివరాలు
ఎవరైనా హోం లోన్ తీసుకొని ఉంటే, దానికి సంబంధించిన ఈఎంఐను ప్రతినెలా చెల్లిస్తుంటారు. ఈ చెల్లింపులో అసలు ఎంత కట్ అయింది? వడ్డీ ఎంత కట్ అయింది? అనే సమాచారం స్పష్టంగా ఉంటుంది. అందుకే ఐటీఆర్‌ను ఫైల్ చేసేటప్పుడు హోం లోన్ పేమెంట్ స్టేట్‌మెంట్‌‌ను సమర్పించి పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. బ్యాంకుల నుంచి హోం లోన్ కావాలని భావించేవారు కూడా మునుపటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌లను తప్పనిసరిగా ఐటీఆర్‌తో జతపర్చాలి.

11. స్టాక్స్, ఆస్తులు
చాలా మంది వద్ద షేర్లు, సెక్యూరిటీలు, ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించినప్పుడు కొందరికి మూలధన లాభాలు వస్తాయి. ఇంకొందరికి మూలధన నష్టాలు వస్తాయి. ఈ సమాచారాన్ని ధ్రువపరిచేందుకు తప్పనిసరిగా బ్రోకర్ నుంచి స్టేట్‌మెంట్‌లు తీసుకోవాలి. ప్రాపర్టీ సేల్ డీడ్‌ల వంటి డాక్యుమెంట్లను పొందాలి. వాటిని ఐటీఆర్‌లో జతపర్చాలి.

12. డివిడెండ్ ఆదాయం
షేర్లు, మూచువల్ ఫండ్స్ చాలా మంది వద్ద ఉంటాయి. వాటిపై ఏదైనా డివిడెండ్ ఆదాయం లభించి ఉంటే తప్పకుండా సంబంధిత డాక్యుమెంట్లను ఐటీఆర్‌తో జతపర్చాలి. దీనికి సంబంధించి బ్రోకర్లు ఇచ్చే రసీదులు, డీమ్యాట్ అకౌంట్ స్టేట్‌మెంట్లను ఐటీఆర్‌ ఫైలింగ్‌లో జతపర్చాలి.

లార్జ్​ క్యాప్ Vs మిడ్​ క్యాప్ Vs స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Different Mutual Funds

ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్​ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.