Is January 22 A Bank Holiday : జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభోగంగా జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు జనవరి 22న ఆఫ్-డే లీవ్ ప్రకటించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రైవేట్ బ్యాంకులు ఆ రోజు మొత్తం పనిచేయమని ప్రకటించాయి. మరి ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకుల పరిస్థితి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గవర్నమెంట్ బ్యాంక్స్ - వర్కింగ్ టైమ్స్
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దీనిలో భక్తులు అందరూ పాల్గొనే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. అందుకే ఆ రోజున అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పరిశ్రమలకు ఒక పూట సెలవు ఇచ్చింది. అంటే ఇవి అన్నీ మధ్యాహ్నం 2.30 గంటల వరకు పనిచేయవు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా జనవరి 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు పనిచేయవు. ఈ విషయాన్ని బ్యాంకు కస్టమర్లు గమనించాలి. అత్యవసరంగా బ్యాంకు పనులు ఉన్నవారు, అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.
ప్రైవేట్ బ్యాంక్స్ పరిస్థితి ఏమిటి?
- జనవరి 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రభుత్వ బ్యాంకులతో పాటు, ప్రైవేట్ బ్యాంకులు కూడా సెలవు ప్రకటించాయి.
- ఉత్తరాఖండ్‌లోని పలు ప్రైవేట్ బ్యాంకులు కూడా జనవరి 22న తమ బ్రాంచ్‌లు పనిచేయవని స్పష్టం చేశాయి.
- మోయిను ఇరట్పా సందర్భంగా మణిపాల్‌లోని బ్యాంకులు జనవరి 22న సెలవు ప్రకటించాయి.
జనవరి 22న సెలవు ప్రకటించిన రాష్ట్రాలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలు జనవరి 22న సెలవు ప్రకటించాయి. అవి ఏమిటంటే?
- గుజరాత్, త్రిపుర, ఒడిశా, అసోం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ఒక పూట సెలవు ప్రకటించాయి. అంటే అవి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పనిచేయవు.
- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, హరియాణా, ఛండీగఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు జనవరి 22న ఫుల్ హాలీడేగా ప్రకటించాయి.
- కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో జనవరి 22ను పబ్లిక్ హాలీడేగా ప్రకటించారు.
- దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ సంస్థలకు ఒక పూట (మధ్యాహ్నం 2.30 గంటల వరకు) సెలవు ఇచ్చారు.
- కనుక ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకులు జనవరి 22న పూర్తిగా లేదా ఒక పూట పనిచేయవు. ఈ విషయాన్ని బ్యాంక్ కస్టమర్లు గమనించాలి.
రూ.2,000 నోట్లు ఎక్స్ఛేంజ్ చేయవచ్చా?
'ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల్లో జనవరి 22న రూ.2,000 నోట్ల మార్పిడి సదుపాయం ఉండదు. మళ్లీ జనవరి 23నే ఈ సేవలు ప్రారంభమవుతాయి' అని ఆర్బీఐ స్పష్టం చేసింది.
స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న సెలవు ప్రకటించింది. అందువల్ల సోమవారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. ఈ కారణం చేతనే శనివారం నాడు ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిర్వహించారు.
LIC 'జీవన్ ధార 2' పాలసీ లాంఛ్ - ఈ ప్లాన్‌తో జీవితాంతం ఇన్‌కం గ్యారెంటీ!
స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించాలా? ఈ టాప్-7 మూవీస్ తప్పక చూడండి!