ETV Bharat / business

వెండి కొనాలా? సిల్వర్ ఈటీఎఫ్​ల్లో ఇన్వెస్ట్ చేయాలా? ఏది బెటర్ ఆప్షన్​! - How To Invest In Silver - HOW TO INVEST IN SILVER

Is Buying Silver A Good Investment : బంగారం, వెండిలతో భారతీయులకు విడదీయలేని బంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీ పెరుగుతున్నాయి. పసిడితో సమానంగా వెండి కూడా పెరుగుతోంది. మరి వెండిలో పెట్టుబడి పెడితే లాభమేనా?

how to invest in silver ETF
Silver investment pros and cons
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 3:37 PM IST

Is Buying Silver A Good Investment : బంగారంతో వెండి పోటీపడుతోంది. కిలో వెండి ధర రూ.1 లక్షకు చేరువవుతుందనే వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వెండి ధరలు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. 2023లో వెండి 7.19 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇది రూ.86,300 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. కొన్ని బ్రోకరేజీ సంస్థలు కిలో వెండి ధర మధ్యస్థ కాలంలో రూ.1 లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. 2017లో కిలో వెండి సగటు ధర రూ.37,825గా ఉంటే 2023లో ఇది రూ.78,600లకు చేరింది. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతోపాటు ఇతర ఆర్థిక కారణాల వల్ల బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఊహాజనిత కొనుగోళ్లు, పారిశ్రామిక అవసరాలు పెరుగుతుండటంతోనూ వెండి ధర పెరుగుతోంది. చారిత్రాత్మకంగానూ పసిడితోపాటు వెండి ధరలు కూడా సహజంగా పెరుగుతున్నాయి. అందుకే దీర్ఘకాలిక దృష్టితో వెండిలో మదుపు చేయడం మంచిదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

How To Invest In Silver : వెండిని పలు రూపాయాల్లో కొనుగోలు చేయవచ్చు. నేరుగా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కడ్డీలు, నాణేల రూపంలో తీసుకోవచ్చు. వెండితో రూపొందించిన పలు వస్తువులు, ఆభరణాలు కూడా ఉంటాయి. వీటిలో ఏది మీకు అనుకూలమో నిర్ణయించుకోవాలి. అయితే ఓ విషయం గుర్తుంచుకోవాలి. కడ్డీలు, నాణేల రూపంలో తీసుకున్నప్పుడు ఖర్చులు తక్కువగా ఉంటాయి. వస్తువులు, ఆభరణాల రూపంలో తీసుకున్నప్పుడు తయారీ రుసుములు, తరుగు లాంటివి కూడా ఉంటాయి.

Silver ETF : ఒక వేళ మీరు డిజిటల్ రూపంలోనే పొదుపు చేయాలనుకుంటే, వెండి ఈటీఎఫ్​ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. డీమ్యాట్ అకౌంట్​ ద్వారా మీరు వెండిని కొనుగోలు చేయవచ్చు. ఇవి షేర్ల మాదిరిగానే పనిచేస్తాయి. వెండి ఈటీఎఫ్​లు మదుపరులకు అనుకూలమైన, సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఉంటాయి. అయితే వెండి ధరలు మారుతున్నప్పుడు, యూనిట్ ధరల్లోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.

వెండి ధరను దగ్గరగా అనుసరించడానికి కొన్ని ఈటీఎఫ్​లు నేరుగా సిల్వర్​ను కొనుగోలు చేసి పెట్టుకుంటాయి. కొన్ని ఈటీఎఫ్​లు వెండి గనులను నిర్వహించే సంస్థల షేర్లలోనూ మదుపు చేస్తాయి. వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగానే చూడాలంటున్నారు నిపుణులు. స్వల్పకాలంలో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. ముఖ్యంగా చైనా, అమెరికా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఏర్పడినప్పుడు, వీటి ధరలపై ప్రభావం పడుతుంది. నేడు గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ వాహనాల్లో వెండి వినియోగం బాగా పెరుగుతోంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు బాగా అనుకూలమైన విషయమని చెప్పవచ్చు.

Silver ETF Pros And Cons : పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే మదుపరులు వెండి చారిత్రక పనితీరును, అనుకూలతను దృష్టిలో ఉంచుకోవాలి. ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా దీన్ని గుర్తించాలి. స్వల్పకాలిక లాభాల కోసం ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ మదుపు చేయకూడదు. వెండి ధరలు స్వల్పకాలంలో చాలా అస్థిరంగా ఉంటాయి. బంగారంతో పోలిస్తే ఇందులో కొంచెం నష్టభయం ఉంటుంది. కాబట్టి ఇతర పెట్టుబడుల విషయంలో తీసుకునే జాగ్రత్తలు దీనికి కూడా వర్తిస్తాయి. వెండిలో పెట్టుబడి పెట్టే ముందు వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితి లాంటివి పరిగణనలోనికి తీసుకోవాలి.

బంగారం, వెండిలో పెట్టుబడులు మీ పోర్ట్​ఫోలియోకు స్థిరత్వం, సమతుల్యతను అందించేందుకు దోహదం చేస్తాయి. వీటిలో పెద్ద మొత్తంలో మదుపు చేయడం సరికాదు. మీరు పెట్టుబడులకు కేటాయించిన మొత్తంలో 10 శాతం వరకు మాత్రమే పసిడి, వెండి లోహాలకు కేటాయించడం మంచిది.

క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి డబ్బులు లేవా? రివార్డ్ పాయింట్స్​తో చెల్లించండిలా! - Use Reward Points To Pay CreditBill

మల్టిపుల్ పాన్ కార్డులు ఉన్నాయా? వెంటనే సరెండర్ చేయండి - లేకుంటే ఇక అంతే! - Multiple Pan Card Issues

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.