ETV Bharat / business

ఇంటెల్‌ ఉద్యోగులకు షాక్​ - 18,000 జాబ్స్​ కట్​ - కారణం ఏమిటంటే? - Intel To Lay Off 18000 Employees - INTEL TO LAY OFF 18000 EMPLOYEES

Intel To Lay Off 18,000 Employees : అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణలో భాగంగానే ఇంటెల్ సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

Intel To Lay Off 18,000 Employees
Intel Lay Off (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 10:55 AM IST

Intel To Lay Off 18,000 Employees : అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 18 వేల మందిని తొలగించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది దాదాపు 15 శాతానికి సమానం.

ఉద్యోగుల తొలగింపుల వల్ల ఇంటెల్​ కంపెనీకి ఏటా 20 బిలియన్‌ డాలర్ల వ్యయాలు ఆదా అవుతాయని ఓ అంచనా. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 1.6 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. ‘‘రెండో త్రైమాసిక ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఉత్పత్తులు, తయారీ ప్రక్రియలో అనేక మైలురాళ్లను సాధించినప్పటికీ, ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు’’ అని కంపెనీ సీఈఓ పాట్‌ గెల్సింగర్ ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లతో కూడుకొన్న పరిస్థితులను ఎదుర్కోనున్నట్లు ఆయన తెలిపారు.

కారణం అదే!
కృత్రిమ మేధ (AI) ఆధారిత చిప్‌ల ఉత్పత్తిలో సవాళ్లు ఎదురవుతుండడం, తమ తయారీ కేంద్రాలకు ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోవడం వల్ల రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయని ఇంటెల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి డేవిడ్‌ జిన్సర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లాభాలను మెరుగుపర్చుకోవటంతో పాటు, బ్యాలెన్స్‌ షీట్‌ను బలోపేతం చేసుకుంటామని ఆయన ప్రకటించారు.

గత ఏడాది చివరి నాటికి ఇంటెల్‌లో మొత్తంగా 1,24,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్‌లో ఓ కీలక ఫ్యాక్టరీ విస్తరణను నిలిపివేస్తున్నట్లు ఇంటెల్​ కంపెనీ జూన్‌లో ప్రకటించింది. అయితే వ్యాపార, మార్కెట్‌ పరిస్థితులు, బాధ్యతాయుత మూలధన నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఎన్వీడియా, ఏఎండీ, క్వాల్‌కామ్‌ వంటి సంస్థల నుంచి ఇంటెల్‌ తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. కృత్రిమ మేధ ఆధారిత చిప్‌ల తయారీలో ఆయా సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ రేసులో ఇంటెల్‌ కాస్త వెనకబడినట్లుగా టెక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు సంస్థలు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగించడం పరిపాటి అయిపోయింది.

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

బైక్ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్​-10 మోడల్స్​ ఇవే! ధర ఎంతో తెలుసా? - Top 10 Upcoming Bikes

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.