How To Use Credit And Debit Card In GPay : దేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరుగుతున్నాయి. ప్రతిదానికీ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న షాపులు మొదలు, పెద్ద స్థాయిలో నిర్వహించే వ్యాపారాల వరకూ, యూపీఐ పేమెంట్స్‌ను అనుమతిస్తున్నాయి. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ యాప్‌ల్లో 'గూగుల్ పే' ఒకటిగా ఉంది. కూరగాయలు కొనడం నుంచి రైలు, విమాన టికెట్ బుకింగ్‌ల వరకు ఈ యాప్‌నే చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే గూగుల్ పేతో యూపీఐ పేమెంట్స్ చేయడమే కాదు. దానికి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కూడా లింక్ చేసుకోవచ్చు. వాటి ద్వారా ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లోనూ పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
గూగుల్ పే యాప్‌నకు క్రెడిట్, డెబిట్ కార్డులు లింక్ చేయడం ఎలా?
How To Add Credit And Debit Cards In GPay :
- ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ ఫోన్లోకి Google Pay యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేయాలి.
నోట్ : చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్‌గా గూగుల్ పే ఉంటుంది. ఐఫోన్ యూజర్లు అయితే ప్లేస్టోర్ నుంచి Gpayను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- మీ జీ-మెయిల్ అకౌంట్‌తో గూగుల్ పే యాప్‌లోకి సైన్-ఇన్ కావాలి.
- మీ ఫోన్లో లాగ్-ఇన్ అయిన ఈ-మెయిల్ అకౌంట్, గూగుల్ పేలో సైన్-ఇన్ అయిన ఈ-మెయిల్ అకౌంట్ ఒకటే అయ్యుండాలి.
- ఆ తర్వాత మీ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేయాలి.
- Payment Methods ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీకు కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి.
- యాడ్ బ్యాంక్ అకౌంట్,
- సెట్-అప్ యూపీఐ లైట్
- యాడ్ క్రెడిట్ లైన్
- యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ
- అదర్ వేస్ టు పే
- ఈ Other ways to pay సెక్షన్లోకి వెళ్లి, మీ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను యాడ్ చేసుకోవచ్చు.
- ఇందుకోసం Add Cardపై క్లిక్ చేయాలి.
నోట్ : గూగుల్ పే కేవలం 'వీసా, మాస్టర్‌కార్డ్' ఎనేబుల్డ్ క్రెడిట్, డెబిట్ కార్డులను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మాస్ట్రో క్రెడిట్, డెబిట్ కార్డులకు గూగుల్ పే సపోర్ట్ చేయదు. కనుక వాటిని లింక్ చేసుకోలేరు.
- Add Cardపై క్లిక్ చేయగానే, గూగుల్ పే యాప్ కెమెరా ఓపెన్ అవుతుంది. అది మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను స్కాన్ చేస్తుంది.
- తరువాత అది మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది.
- ఒక వేళ మీకు ఈ విధానం ఇష్టం లేకపోతే, మాన్యువల్‌గా కూడా మీ కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
- ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు - గూగుల్ మీ కార్డ్ వివరాలను ధ్రువీకరిస్తుంది. అంతే సింపుల్!
నోట్ : సాధారణంగా గూగుల్ పే హోమ్ స్క్రీన్‌లో డిఫాల్ట్‌గా యూపీఐ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. కానీ మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను కూడా యాడ్ చేశారనుకోండి. అప్పుడు అవి కూడా హోమ్ స్క్రీన్‌లో కనిపిస్తాయి.
- గూగుల్ పేలో యాడ్ చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులతో మీరు షాపుల్లో NFC (నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్) ద్వారా పేమెంట్స్ చేయవచ్చు.
- మీరు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పేమెంట్స్ చేయవచ్చు.
- మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్లులు కూడా కట్టవచ్చు.
- కానీ మీ గూగుల్ పే కాంటాక్ట్స్‌కు (ఇతర వ్యక్తులకు) మాత్రం క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి డబ్బులు పంపించలేరు.