How To Transfer Car Insurance Policy To family Member : మన దేశంలో వాహనాలకు ఇన్సూరెన్స్ చేయడం తప్పనిసరి. వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు, దొంగతనం జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది. అయితే కొంతమంది తమ పేరు మీద ఉన్న కారు ఇన్సూరెన్స్‌ను కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చాలని భావిస్తుంటారు. అసలు ఇది సాధ్యమా? దీనితో ముడిపడి ఉన్న అంశాలు ఏంటి? అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాహన బీమా అనేది పూర్తిగా కారు యజమానికి లేదా నడిపే వ్యక్తులకు సంబంధించినది. వాస్తవానికి కార్ ఇన్సూరెన్స్‌ను మరొకరి పేరు మీదకు బదిలీ చేయడానికి వీలవుతుంది. అయితే ఇది బీమా కంపెనీ మీద, మీరు ఉంటున్న ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ ట్రాన్స్ఫర్ విషయంలో చాలా నిబంధనలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలసీ నిబంధనలు, షరతులు : ఇన్సూరెన్స్ జారీ సమయంలో బీమా కంపెనీలు చాలా షరతులు, నిబంధనలను విధిస్తాయి. అందులో పాలసీ బదిలీకి అనుమతించవచ్చు లేదా అనుమతించకపోవచ్చు. ఆయా బీమా కంపెనీలను బట్టి ఇది మారుతూ ఉంటుంది.
కార్ ఓనర్ షిప్ : కార్ ఇన్సూరెన్స్ అనేది కార్ ఓనర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యుడికి కానుకగా ఇవ్వడం, లేదంటే కుటుంబ సభ్యుడికి బదిలీ చేసే సమయంలో సదరు డాక్యుమెంట్ల ప్రకారం, కార్ ఓనర్‌షిప్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
డ్రైవర్ సమాచారం : కార్ ఇన్సూరెన్స్ అనేది కారును నడిపేవారి డ్రైవింగ్ చరిత్ర, వ్యక్తిగత సమాచారం మీద ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు కార్ ఇన్సూరెన్స్‌ను బదిలీ చేసినప్పుడు డ్రైవింగ్ చరిత్ర, వ్యక్తిగత సమాచారం వల్ల ప్రీమియం రేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి.
కవరేజ్ : ఏ పాలసీనైనా మీ అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ అలవాట్లు, ప్రాధాన్యాల ఆధారంగా అదనపు కవరేజ్ ఉండేలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్లు : పాలసీ బదిలీ కోసం చట్టపరమైన డాక్యుమెంట్లు అవసరం. కాబట్టి కొత్త పాలసీదారు అన్ని రకాల ప్రమాణ పత్రాలను కలిగి ఉండాలి.
కారు ఇన్సూరెన్స్‌ని బదిలీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు : కార్ ఇన్సూరెన్స్‌ను కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చడం వల్ల ముందుగా ఖర్చు ఆదా అవుతుందని గుర్తించాలి. అలాగే ఈ ప్రక్రియ సరళంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పాలసీ అనేది కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
కార్ ఇన్సూరెన్స్ బదిలీలో ఉన్న లోపాలు ఇవే!
ప్రీమియంలో మార్పులు : కార్ ఇన్సూరెన్స్‌ను కుటుంబ సభ్యుడి పేరు మీదకు బదిలీ చేస్తున్న సమయంలో ప్రీమియంలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్, కార్, ప్రాంతం ఇలా చాలా అంశాలు ప్రీమియంలో మార్పులకు కారణమవుతాయి.
కవరేజ్ : కార్ ఇన్సూరెన్స్ తీసుకున్న సమయంలో ఉండే కవరేజ్, కుటుంబ సభ్యుల పేరు మీద బదిలీ చేసినప్పుడు ఉండే కవరేజ్ ఒకేలా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారు కవరేజ్ తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు పాలసీ ప్రొవైడర్ కొన్నిసార్లు అనుమతిని నిరాకరించే పరిస్థితి ఉండవచ్చు. అలాగే కార్ ఇన్సూరెన్స్‌ను కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చేటప్పుడు కొన్నిసార్లు చట్టపరమైన అడ్డంకులు వచ్చే అవకాశాలున్నాయి.
2024-25లో లాంఛ్ కానున్న టాప్-8 కాంపాక్ట్ SUV కార్స్ ఇవే!
కారు లోన్‌పై టాపప్ కావాలా? అయితే ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!