ETV Bharat / business

మీ బైక్ ఎక్కువ పెట్రోల్ తాగేస్తోందా? ఈ రైడింగ్​ టిప్స్​తో మైలేజ్ పెరగడం గ్యారెంటీ! - HOW TO SAVE PETROL WHEN RIDING BIKE

మీ బైక్​ మైలేజ్ పెరగాలా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!

Fuel Saving Tips For Bike Riders
Fuel Saving Tips For Bike Riders (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 12:19 PM IST

Fuel Saving Tips For Bike Riders : కొత్త బైక్ కొన్నప్పుడు అది మంచి మైలేజ్ ఇస్తుంది. కానీ బైక్ పాతబడుతున్న కొద్దీ దాని ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ తగ్గిపోతుంది. దీనితో బైక్ పెట్రోల్ విపరీతంగా తాగేస్తుంది. దీని వల్ల మీ జేబుకు చిల్లుపడుతుంది. అందుకే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు కచ్చితంగా పాటించాలి. అప్పుడే మీ బైక్ మైలేజ్ పడిపోకుండా ఉంటుంది.

పెట్రోల్ సేవ్ చేయడానికి పాటించాల్సిన చిట్కాలు!

  • బైక్​ను ఎప్పుడూ స్టడీ స్పీడ్​లో నడపాలి. దీని వల్ల కచ్చితంగా పెట్రోల్ ఆదా అవుతుంది. అలా కాకుండా బైక్​ స్పీడ్​ను పెంచుతూ, తగ్గిస్తూ ఉంటే, ఇంజిన్​పై దాని ప్రభావం పడుతుంది. దీనితో పెట్రోల్ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది.
  • బండి నడిపేటప్పుడు టైర్ ప్రెజర్ సరిగ్గా ఉందో, లేదో కచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే బండి డ్రైవ్​ చైన్​ టెన్షన్​ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. సరిపడా టైర్​ ప్రెజర్​ లేనప్పుడు చాలా వేగంగా, జిగ్​జాగ్​గా బైక్ డ్రైవ్ చేస్తే, పెట్రోల్ చాలా త్వరగా అయిపోతుంది.
  • కంపెనీ ఆథరైజ్డ్​ సర్వీస్​ గ్యారేజ్​ లేదా వర్క్​షాప్​ వద్ద మాత్రమే మీ ఇంజిన్​ను ట్యూన్ చేయించండి. అలాగే అక్కడే మీ బైక్​ను క్రమం తప్పకుండా సర్వీస్​ చేయించండి. దీని వల్ల మీ బైక్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ బాగుంటుంది.
  • ఎల్లప్పుడూ ఉద్గార స్థాయిలు తక్కువగా (లో ఎమిషన్​ లెవెల్స్) ఉండేలా చూసుకోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మీ టూ-వీలర్​ మంచి మైలేజ్​ ఇస్తుంది. పెట్రోల్ ఖర్చులు బాగా ఆదా అవుతాయి.

ఈ తప్పులు చేయవద్దు!

  • బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు క్లచ్ లివర్ అలానే నొక్కి ఉంచకూడదు.
  • లో గేర్ వేసి, ఎక్కువ సేపు బండి(ఇంజిన్​)ని నడపకూడదు.
  • మీ బండిని వీలైనంత వరకు ఎండలో పార్క్ చేయకూడదు. ఒకవేళ మీరు ఎండలో బైక్ ఉంచితే, సూర్యరశ్మి ప్రభావం వల్ల పెట్రోల్ చాలా వరకు ఆవిరైపోయే ఛాన్స్ ఉంటుంది.
  • బైక్ నడుపుతున్నప్పుడు బ్రేక్ పెడల్​పై కాలు వేసి, నొక్కి ఉంచకూడదు. అత్యవసరమైనప్పుడు మాత్రమే బ్రేక్ పెడల్​ను నొక్కాలి. లేకుంటే పెట్రోల్ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది.
  • ట్రాఫిక్​లో ఆగాల్సివచ్చినప్పుడు ఇంజిన్ ఆర్​పీఎంను అనవసరంగా పెంచకూడదు. మీరు కనుక 30 సెకెన్ల కంటే, ఎక్కువ సేపు బండిని ఆపాల్సి వస్తే, కచ్చితంగా మీ ఇంజిన్​ను 'ఆఫ్' చేయడమే మంచిది.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్​ ఫిల్టర్​ అసెంబ్లీ ఇన్​లెట్​ను కవర్ చేయకూడదు.
  • ఇంజిన్​లోకి చక్కగా గాలి వెళ్లినప్పుడే, అది హీట్ ఎక్కకుండా ఉంటుంది. అలాకాకుండా ఇంజిన్​ను మీరు దేనితో అయినా కవర్ చేశారనుకోండి. ఇంజిన్​కు సరిగ్గా గాలి తగలదు. దీనితో ఇంజిన్ వేడెక్కుతుంది. ఫలితంగా అది ఎక్కువ పెట్రోల్​ను తాగేస్తుంది.

Tips To Maintain Low Emission Levels : ఒకవేళ బైక్​ను సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, ఎగ్జాస్ట్ వాయువులు విపరీతంగా విడుదల అవుతాయి. దీని వల్ల పర్యావరణానికే కాదు, బండి నడిపేవారికి కూడా నష్టమే. అందుకే 'లో ఎమిషన్​ లెవల్స్' మెయింటైన్ చేయాలంటే, ఈ కింద చెప్పిన టిప్స్ కచ్చితంగా పాటించాలి.

  • స్పార్క్​ ప్లగ్​ను చక్కగా శుభ్రం చేయాలి. ఎలక్ట్రోడ్​ల మధ్య తగినంత గ్యాప్​ ఉండేలా చూసుకోవాలి.
  • ఎయిర్​ ఫిల్టర్లను శుభ్రంగా తుడుస్తుండాలి.
  • కంపెనీకి చెందిన అఫీషియల్​ వర్క్​షాప్​లో మాత్రమే కార్బురేటర్​ను ట్యూన్ చేయించుకోవాలి.
  • ఇంజిన్ ఆయిల్​ను ఓవర్​ఫిల్ చేయకూడదు. అలాగే ఇంజిన్ ఆయిల్​ టైమ్ ప్రకారం మారుస్తూ ఉండాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీ ఇంధనాన్ని వాడకూడదు.
  • ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మీ బైక్​ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంధనం ఆదా అవుతుంది. మైలేజ్ పెరుగుతుంది.

రూ.1.5 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్​ ఇచ్చే బైక్​ కొనాలా? టాప్​-10 మోడల్స్​ ఇవే!

రూ.10 లక్షల్లోపు మంచి SUV కార్​ కొనాలా? త్వరలో లాంఛ్​ కానున్న బెస్ట్​-4 మోడల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.