How To Save A Car Engine : ప్రస్తుత రోజుల్లో తమ రేంజ్‌తో సంబంధం లేకుండా కార్లను కొనేస్తున్నారు ప్రజలు. బ్యాంకులు సైతం వీటి కొనుగోలుకు భారీగా రుణాలిస్తుండటం వల్ల ఈ వాహనాలను కొనే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. అయితే లక్షల రూపాయలు వెచ్చించి కొన్న కార్లను సరిగ్గా వాడటం తెలియకపోతే వాటి ఇంజిన్ పాడయిపోయే ప్రమాదముంది. అంతే కాకుండా మైలేజ్ కూడా తగ్గుతుంది. అందుకే యజమానులు వాహనాల మెయింటెనెన్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. దానిని సరైన సమయానికి సర్వీసింగ్ చేయించడం లాంటి ఇతరత్రా జాగ్రత్తలు పాటించాలి. మరి కారు యజమానులు చేయకూడని పది విషయాలివే.
ఆయిల్ సమయానికి మార్చండి
ఇంజిన్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా సమయానికి మార్చండి. ఇంజిన్ పాడవకుండా ఉండటంలో ప్రధాన పాత్ర వహించేది ఇదే. మీరు కారు నడపకున్నా కొంత కాలం ముగిసిన తర్వాత ఆయిల్ చెడిపోతుంది. కాబట్టి సమయానికి మార్చాలి. ఒకవేళ ఆయిల్ సరైన మోతాదులో లేకపోతే కారు ఇంజిన్ వేడెక్కే అవకాశముంది.
చెక్ ఇంజిన్ లైట్
మీ కారు ఇంజిన్ లైట్ బ్లింక్ అవుతుంటే నెగ్లెట్ చేయొద్దు. వెంటనే తప్పనిసరిగా మెకానిక్ వద్దకు తీసుకెళ్ళండి
అతివేగంగా నడపకండి
మీరు తరచుగా కారును స్పీడ్‌గా నడుపుతున్నారా? అయితే వెంటనే ఆ స్పీడును తగ్గించుకోండి. ఎందుకంటే వేగంగా వెళ్లే క్రమంలో కారు క్లచ్‌ను గట్టిగా తొక్కుతారు. ఆ సమయంలో అది ఇంజిన్‌పై ప్రభావం పడే అవకాశముంది.
ఓవర్ లోడ్ చేయకండి
ప్రతి కారుకు వెయిట్ లిమిట్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం కారు సామర్థ్యానికి మించి ప్రయాణం చేస్తే కేవలం ఇంజిన్ పైనే కాకుండా కారు ఇతరత్రా భాగాలపై ప్రభావం పడే అవకాశముంది.
చిన్న చిన్న ట్రిప్స్ వెళ్లండి
మీరు మీ పర్సనల్ కారులో ఏదైనా లాంగ్ టూర్‌కు వెళ్లడం కంటే, చిన్న చిన్న ప్రయాణాలు చేయడమే మేలు. ఎందుకంటే తక్కువ దూరం ప్రయాణించినప్పుడు కారు ఇంజన్ వేడెక్కదు.
ఇంజిన్ లగ్గింగ్ చేయకండి
ఒకవేళ మీరు టాప్ గేర్‌లో ఉండి ఆ స్పీడ్‌లో కారును నడపకపోతే ఆ ప్రభావం ఇంజిన్‌పై పడే అవకాశముంది. కాబట్టి స్పీడ్‌కు అనుగుణంగానే గేరు మార్చాలి.
రివ్ లిమిటెర్ను ఎక్కువగా వాడకండి
సాధారణంగా రివ్ లిమిటర్లు ఇంజన్‌పై ఒత్తిడి కలగకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. అయితే తరచుగా దానిని బీట్ చేయటం మంచిది కాదు.
కారు శబ్ధాలను గమనించండి
ప్రస్తుతమున్న కారు మోడల్స్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సెన్సార్లు సంకేతాలిస్తున్నాయి. అయితే అవి గుర్తించలేని కొన్ని సమస్యలు ఉంటాయి. అవి మనం కారు నుంచి వచ్చే వాసనల ద్వారానో లేదా శబ్ధాల ద్వారానో గుర్తించవచ్చు. అలాంటి ఏవైనా గుర్తించినప్పుడు వెంటనే మెకానిక్‌ను సంప్రదించాలి.