ETV Bharat / business

క్రెడిట్‌ కార్డ్‌ 'రివార్డ్​ పాయింట్స్​' పెంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్​ పాటించండి! - how to earn most Reward Points

How To Maximize Credit Card Points : మీరు డైలీ క్రెడిట్​ కార్డు ఉపయోగిస్తూ ఉంటారా? రివార్డు పాయింట్లు కాస్త ఎక్కువగా వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ క్రెడిట్ కార్డుపై మరిన్ని ఎక్కువ రివార్డ్ పాయింట్లను సంపాదించేందుకు ఉపయోగపడే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Tips to Earn Most Reward Points on Credit Card
How to maximize credit card points
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 1:21 PM IST

How To Maximize Credit Card Points : నేడు క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. స్పెషల్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు లాంటి బెనిఫిట్స్ లభిస్తుండడం వల్ల చాలా మంది ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. చాలా మంది కిరాణా వస్తువుల కొనుగోలు నుంచి విమానం టికెట్ల బుకింగ్​ వరకు అన్నింటికీ క్రెడిట్ కార్డుల ద్వారానే పేమెంట్స్ చేస్తూ, రివార్డ్ పాయింట్లు సంపాదిస్తుంటారు. వీటిని రీడీమ్ చేసుకుని మరిన్ని ప్రయోజనాలు పొందుతుంటారు. మరి మీరు కూడా ఇలాంటి బెనిఫిట్స్​ పొందాలని అనుకుంటున్నారా?

అపోహలు వీడండి!
క్రెడిట్ కార్డుల వినియోగాన్ని అనుసరించి రివార్డు పాయింట్లు లభిస్తుంటాయి. అయితే చాలా మంది ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తే, ఎక్కువ రివార్డు పాయింట్లు, గిఫ్ట్ వోచర్లు వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. క్యాష్​బ్యాక్​లు, రివార్డ్ పాయింట్లు వస్తున్నాయి కదా అని, శక్తికి మించి ఖర్చు చేస్తే మొదటికే మోసం వస్తుంది. పైగా అప్పుల ఊబిలో కూరుకపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా, వీలైనంత తక్కువగా ఖర్చు చేయాలి. వాస్తవానికి అవసరాలకు అనుగుణంగా క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేస్తూ, అధికంగా రివార్డ్ పాయింట్స్​ సంపాదించేందుకు కొన్ని టిప్స్ ఉపయోగించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన కార్డును ఎంచుకోవాలి!
నేడు చాలా బ్యాంకులు అన్ని ఆదాయ వర్గాల వారికి సులభంగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే మీరు మాత్రం ఏదిపడితే అది కాకుండా, మీ ఖర్చులకు, జీవనశైలికి అనుగుణంగా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను మాత్రమే ఎంచుకోవాలి.

ఉదాహరణకు తరచుగా ప్రయాణాలు చేసేవారు ట్రావెల్ రివార్డ్‌లు అందించే కార్డ్‌ను ఎంచుకోవాలి. పెట్రోల్, డీజిల్ లాంటి ఫ్యూయెల్స్​ కోసం అధికంగా ఖర్చు చేసే వారైతే, ఆ తరహా కార్డులను తీసుకోవాలి. దీని వల్ల మీ అవసరాలు తీరుతాయి. పైగా అధికంగా రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి.

ముందే నిబంధనలు తెలుసుకోవాలి!
ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. వేర్వేరు క్రెడిట్​ కార్డులు ద్వారా లభించే రివార్డు పాయింట్లు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల క్రెడిట్ కార్డు తీసుకునే ముందు కచ్చితంగా రివార్డ్‌ పాయింట్లు గురించిన నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. ఏ కార్డు వల్ల ఎక్కువ లాభం ఉంటుందో, దానినే ఎంచుకోవాలి.

ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్‌ బ్యాంక్‌ కో- బ్రాండెడ్‌ కార్డు మీ దగ్గర ఉంది అనుకుందాం. అప్పుడు సదరు ప్లాట్‌ఫామ్‌లో చేసే ఖర్చులపైనే మీకు ఎక్కువ రివార్డు పాయింట్లు లభిస్తాయి. అమెజాన్‌-ఐసీఐసీఐ కార్డును ఉపయోగించి అమెజాన్‌లో కొనుగోళ్లు చేస్తే మీరు ఎక్కువ పాయింట్లు సంపాదించవచ్చు. అలాకాకుండా వేరే ప్లాట్​ఫామ్​ల్లో సదరు క్రెడిట్ కార్డులను వాడితే రివార్డ్ పాయింట్లు లభించవు.

మైల్​స్టోన్స్ రీచ్ అయితే!
పలు సంస్థలు కొత్తగా క్రెడిట్‌ కార్డ్‌ తీసుకొనేవారిని ప్రోత్సహించడానికి వెల్​కమ్ ఆఫర్​లను ఇస్తుంటాయి. వీటిని పొందాలంటే నిర్ణీత కాలవ్యవధిలో నిర్దిష్ట మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు అధికంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఒకవేళ మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే, ఈ మైల్​స్టోన్స్ దాటే విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

అతి చేయవద్దు!
చాలా మంది క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎడాపెడా ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మీ అవసరాలకు అనుగుణంగా, ముందే నిర్దేశించుకున్న బడ్జెట్ మేరకే ఖర్చు చేయండి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. అలా కాకుండా పరిమితికి మంచి ఖర్చు చేసి, వ్యవధిలోపు బిల్లు చెల్లించకపోతే, మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోతారు. పైగా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. దీనితో భవిష్యత్​లో మీకు బ్యాంకు రుణాలు లభించడం కష్టమైపోతుంది. అందుకే రివార్డు పాయింట్ల కోసం అనవసర ఖర్చులు చేయకండి.

కార్​ లోన్​ కావాలా? 2024లో బ్యాంకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఉద్యోగం మారుతున్నారా? మీ PF​ ఖాతాను సింపుల్​గా ట్రాన్స్​ఫర్​ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.