ETV Bharat / business

UPI సమస్యలపై ఫిర్యాదు చేయాలా? ఈ సింపుల్​ ప్రాసెస్​ ఫాలో అవ్వండి! - How To File A UPI Complaint

How To File A UPI Complaint : నేడు యూపీఐ పేమెంట్స్ చాలా సర్వసాధారణం అయిపోయాయి. అయితే అప్పుడప్పుడు యూపీఐ పేమెంట్స్ విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలి? అనేది ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

NPCI UPI complaint
How to Register a UPI Complaint: Steps to Follow (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 4:46 PM IST

How To File A UPI Complaint : యూనిఫైడ్​ పేమెంట్స్ ఇంటర్​ఫేస్​ (UPI) అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు చాలా సులువైపోయాయి. అందుకే దీనికి భారతదేశంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మనం ఎలాంటి బ్యాంక్​ వివరాలు నమోదు చేయకుండానే, యూపీఐ ద్వారా డబ్బులు పంపించడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం సహా వివిధ రకాల ఆర్థిక లావాదేవీలు చేయగలుగుతున్నాం. అయితే అప్పుడప్పుడు యూపీఐ లావాదేవీల్లోనూ కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. ప్రధానంగా బ్యాంక్ సర్వర్లు స్లో అవ్వడం, సాంకేతిక సమస్యలు రావడం, మనకు తెలియకుండానే అనధికారిక లావాదేవీలు జరగడం లాంటివి అవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమి చేయాలి? ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఎన్ని రకాల యూపీఐ సమస్యలు ఉన్నాయో చూద్దాం.

Types of UPI Issues : యూపీఐ సమస్యలు గురించి ఫిర్యాదు చేయాలంటే, ముందుగా అసలు ఎన్ని రకాల యూపీఐ ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం.

  • యూపీఐ PIN సమస్యలు : కొన్ని సార్లు యూపీఐ పిన్​ బ్లాక్ అయిపోతుంది. లేదా పిన్ ఎంటర్ చేసినా ఎర్రర్ అనే మెసేజ్ వస్తుంది. దీని వల్ల మనం పేమెంట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
  • ప్రాసెసింగ్ సమస్యలు : కొన్నిసార్లు యూపీఐ పేమెంట్ చేసిన తరువాత, మన బ్యాంక్​ అకౌంట్​లో డబ్బులు కట్​ అయిపోతాయి. కానీ అవతలివారికి ఆ డబ్బులు క్రెడిట్​ అవ్వవు. ఇంకొన్ని సార్లు పొరపాటున రాంగ్ అకౌంట్​లోకి డబ్బులు వెళ్లిపోతుంటాయి. లేదా ట్రాన్సాక్షన్స్​ మధ్యలో ఆగిపోతాయి. ఒక్కోసారి పరిమితికి మించిన లావాదేవీ అని, ట్రాన్సాక్షన్ టైమింగ్ అవుట్ అని, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి.
  • అకౌంట్ సమస్యలు : యూపీఐ యాప్​ల్లో కొన్ని సార్లు మన బ్యాంక్ ఖాతా వివరాలు కనిపించవు. కొన్ని సందర్భాల్లో మన బ్యాంక్ అకౌంట్​ను యూపీఐతో​ లింక్ చేయడానికి వీలుపడదు. మరికొన్ని సార్లు మన ఖాతాను మార్చడానికి, లేదా తీసివేయడానికి, రద్దు చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
  • ఇతర సమస్యలు : కొన్నిసార్లు యూపీఐ యాప్​లోకి లాగిన్ అవుదామన్నా కుదరదు. లాగిన్ ఫెయిల్యూర్ అని కనిపిస్తూ ఉంటుంది.​ అలాగే రిజిస్ట్రేషన్ సమస్యలు, ఓటీపీ ఎర్రర్స్ లాంటివి వస్తుంటాయి. కనుక ఇలాంటి సమస్యలన్నింటిపైనా మనం ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్​ గురించి ఫిర్యాదు చేయడం ఎలా?
Filing A Complaint For A Wrong UPI Transaction : యూపీఐ సమస్యల గురించి 'నేషనల్​ పేమెంట్స్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా' (NPCI)కు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే?

  • ముందుగా మీరు NPCI అధికారిక వెబ్​సైట్​ https://www.npci.org.in/ ఓపెన్ చేయాలి.
  • What we do అనే ట్యాబ్​పై క్లిక్ చేయాలి.
  • తరువాత UPI సెక్షన్​లోకి వెళ్లి, Dispute Redressal Mechanismపై క్లిక్​ చేయాలి.
  • తరువాత Complaint సెక్షన్​లోకి వెళ్లి Transaction ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • తరువాత Nature of the transactionపై క్లిక్ చేసి, మీరు ఎదుర్కొంటున్న యూపీఐ సమస్యను సెలక్ట్ చేయాలి.
  • మీరు రాంగ్ అకౌంట్​కు డబ్బులు పంపినట్లు అయితే, Incorrectly transferred to another account ను సెలక్ట్ చేసుకోవాలి.
  • తరువాత మీ సమస్య గురించి క్లుప్తంగా రాయాలి.
  • తరువాత మీ ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్​, ట్రాన్సాక్షన్ డేట్​, ఈ-మెయిల్ ఐడీలను నమోదు చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్​ నంబర్​ కూడా ఇవ్వాలి.
  • మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్​మెంట్​కు సంబంధించిన ఫొటోకాపీని కూడా అప్లోడ్ చేయాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, ఫిర్యాదును సబ్మిట్ చేయాలి.

ఫెయిల్డ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్​ గురించి ఎలా ఫిర్యాదు చేయాలి?
Filing A Complaint For A Failed UPI Transaction :

  • తరువాత మీరు Nature of the transactionపై క్లిక్ చేసి, మీరు ఎదుర్కొంటున్న యూపీఐ సమస్యను సెలక్ట్ చేయాలి.
  • తరువాత Transaction failed but amount debitedను సెలక్ట్ చేసుకుని, మీ సమస్య గురించి క్లుప్తంగా రాయాలి.

  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, ఫిర్యాదును సబ్మిట్ చేయాలి. అంతే సింపుల్​!

ఇలా మీరు ఫిర్యాదు చేసిన తరువాత, NPCI మీ సమస్యను పరిశీలించి, పరిష్కరిస్తుంది. ఈ విధంగా మీకు వచ్చే యూపీఐ సమస్యలను చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు.

చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్​-5 టూ-వీలర్స్ ఇవే! - Bike For Business Purpose

క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్ - కొత్త రూల్స్ వచ్చేశాయ్​ - మరి మీ బ్యాంక్​ BBPSలో చేరిందా? - RBI New Credit Card Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.