How To Drive car Strong Winds Rains : సాధార పరిస్థితుల్లో కారు డ్రైవింగ్ అందరూ చేస్తారు. కానీ.. ప్రత్యేక పరిస్థితుల్లో అందరికీ సాధ్యం కాదు.. సులభం కూడా కాదు. మనం ఎక్కడికైనా ప్రయాణిస్తున్ప్పుడు.. అనుకోని సందర్భాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంటుంది. ఈదురు గాలులు బలంగా వీస్తుంటాయి. లేదంటే భారీ వర్షాలు కురుస్తుంటాయి. వీటి తీవ్రత ఎంతగా ఉంటే.. డ్రైవింగ్ చేయడం అంత సవాలుగా మారుతుంది. మరి.. ఇలాంటి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? కారును సురక్షితంగా ఎలా డ్రైవ్ చేయాలి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈదురుగాలులు, భారీ వర్షాలు ఉన్నప్పుడు కారును ఇలా సేఫ్‌గా డ్రైవ్ చేయండి :
- మీరు ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు.. అక్కడ వాతావరణం ఎలా ఉందో ముందుగానే చెక్ చేసుకోండి. ఆన్ లైన్లో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఈజీగా తెలుసుకోవచ్చు. దీనివల్ల అక్కడికి వెళ్లినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
- ఒకవేళ ఉన్నట్టుండి గాలుల్లో చిక్కుకుంటే అలర్ట్ కావాలి. బలంగా ఈదురు గాలులు వీస్తున్నప్పుడు కారును స్పీడ్‌గా డ్రైవ్ చేయకూడదు. దీనివల్ల కారు నియంత్రణలో ఉండదు. కాబట్టి.. స్లోగా డ్రైవ్ చేయండి.
- గాలులు బలంగా వీస్తున్నప్పుడు స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవాలి.. లేదంటే బండి అదుపుతప్పే ఛాన్స్ ఉంటుంది.
- భారీ వర్షం, ఈదురు గాలులు స్థాయికి మించి ఉన్నప్పుడు.. కారును కాసేపు పక్కన నిలుపుకోవడం మంచిది.
- అయితే.. కారును ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు, టెలిఫోన్ లైన్లు, విద్యుత్ లైన్లు ఉన్న చోట పార్క్ చేయకూడదు.
- అలాగే ఇలాంటి సమయంలో డ్రైవ్ చేయాల్సి వస్తే నిదానంగా వెళ్లండి. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ఓవర్‌టేక్ చేయకండి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- వర్షం కురుస్తున్నప్పుడు భారీ వాహనాలు, బస్సులు, లారీల పక్కన కారును పోనివ్వకండి.
మీ కారు నుంచి పొగ ఎక్కువగా వస్తోందా? - ఇలా చెక్ పెట్టండి!
- వర్షం కురుస్తున్నప్పుడు వీలైనంత వరకూ రహదారి మధ్యలో ప్రయాణించండి. అంచుల వద్ద డ్రైవ్ చేయడం వల్ల అక్కడ వర్షానికి మట్టి కరిగిపోయి ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి.. కారు వైపర్‌లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తరచూ చెక్ చేసుకోండి.
- ఇలాంటి సందర్బాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లో కూడా మొబైల్‌ఫోన్‌లో మాట్లాడటం, పాటలు వినడం చేయకూడదు. దీనివల్ల దృష్టి తప్పుతుంది.
- భారీ వర్షం పడుతున్నప్పుడు.. సడన్‌గా బ్రేక్ వేయకండి. దీనివల్ల వెహికిల్ స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
- హైవేపై కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ముందు వెహికిల్‌కు 20-30 అడుగుల దూరంలో ఉండండి.
అలర్ట్ : ఎండలు మండుతున్నాయ్ - మీ సీఎన్జీ కారును ఇలా కాపాడుకోండి! - CNG CAR SUMMER PRECAUTIONS