ETV Bharat / business

మీ ఇన్సూరెన్స్​​ పాలసీని 'e-Policy'గా మార్చాలా? ఈ సింపుల్​ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - E Insurance Policy - E INSURANCE POLICY

How To Convert Existing Insurance Policy To E-Policy : మీరు చాలా కాలం క్రితమే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా? ఇప్పుడు దానిని ఈ-పాలసీగా మార్చాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. సాధారణ డాక్యుమెంట్ రూపంలో ఉన్న బీమా పాలసీని ఈ-పాలసీగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

e-insurance policy
e-insurance account
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 4:41 PM IST

How To Convert Existing Insurance Policy To E-Policy : ఇన్సూరెన్స్ అనేది మన భవిష్యత్​కు ఆర్థిక భద్రతను ఇస్తుంది. అందుకే చాలా మంది కచ్చితంగా ఆరోగ్య, జీవిత బీమాలు తీసుకుంటూ ఉంటారు. మన దేశంలో ఇన్సూరెన్స్​ కంపెనీలు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ( IRDAI) నియంత్రణలో ఉంటాయి. అందుకే పాలసీదారులు ఎప్పటికప్పుడు IRDAI మార్గదర్శకాలను గమనించాల్సి ఉంటుంది. ఐఆర్​డీఏఐ ఇటీవలే, కొత్తగా పాలసీలు తీసుకునేవారికి బీమా కంపెనీలు కచ్చితంగా 'ఈ-పాలసీ'ని జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చాలా కాలం క్రితమే తీసుకున్న బీమా పాలసీలను ఈ-పాలసీలుగా మార్చుకోవాలా? ఒక వేళ ఈ-పాలసీగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ-పాలసీ అంటే ఏమిటి?
ఇటీవలి కాలం వరకు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నప్పుడు బీమా పత్రాలను చేతికి అందించేవారు. కానీ ఇప్పుడు బీమా పాలసీలు తీసుకుంటే వాటిని డిజిటల్ డాక్యుమెంట్ రూపంలోనే ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్​డీఏఐ నిర్దేశించింది. అందువల్ల ఇకపై ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటల్ డాక్యుమెంట్ రూపంలోనే ఇస్తారు. దీనినే ఈ-పాలసీ అంటారు. ఈ నిబంధన ఈ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. అయితే పాలసీదారులు తమ ఈ-పాలసీలను భద్రపరుచుకోవడానికి, వాటిని మేనేజ్ చేయడానికి ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్​ను (eIA)ను తెరవాల్సి ఉంటుంది.

ఈ-పాలసీ వల్ల కలిగే లాభాలు!

  • పాలసీదారులు తమ ఈ- పాలసీని ఎక్కడి నుంచైనా చాలా సులువుగా యాక్సెస్ చేయగలుగుతారు.
  • పాలసీ డిజిటల్ ఫార్మాట్‌లో ఉండటం వల్ల బీమా కంపెనీ పాలసీదారులతో సులభంగా కమ్యూనికేట్ కాగలుగుతుంది.
  • క్లెయిమ్‌లు మరింత సులభంగా పరిష్కరమవుతాయి.

తప్పనిసరి కాదు - కానీ
IRDAI కొత్త నిబంధనల ప్రకారం, గతంలో జారీ చేసిన పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడం తప్పనిసరి కాదు. అయితే బీమా చేసిన వ్యక్తి తన ఇన్సూరెన్స్​ను ఈ- పాలసీగా మార్చాలనుకుంటే, అందుకు బీమా కంపెనీ కచ్చితంగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ (eIA) ఓపెన్ చేయడం ఎలా?
eIAను ఓపెన్ చేయడానికి, పాలసీని ఈ-ఫారమ్‌గా మార్చడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. బీమా చేసిన వ్యక్తి తనకు ఇష్టం వచ్చిన రిపోజిటరీ నుంచి ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్​ ఫారమ్‌ను డౌన్​లోడ్​ చేసుకోవాలి. దానిని పూరించిన తర్వాత కేవైసీ పత్రాలను సమర్పించాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇంటి చిరునామా ఉన్న గుర్తింపు కార్డును సమర్పించాలి. ఈ విధంగా మీరు ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్​ను ఓపెన్ చేయాలి.

ఈ- ఇన్సూరెన్స్ పాలసీగా మార్చడం ఎలా?
పాలసీదారుడు మొదట కన్వర్షన్ ఫారమ్‌ను నింపాలి. అందులో పాలసీదారుడి పేరు, పాలసీ నంబర్, ఈ-ఇన్సూరెన్స్ ఖాతా నంబర్, బీమా కంపెనీ పేరును నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫారమ్​ను, ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్​లను బీమా కంపెనీకి సమర్పించాలి. మీ సాధారణ బీమా పాలసీ 'ఈ-పాలసీ'గా కన్వర్ట్ అయిన వెంటనే, SMS లేదా ఈ-మెయిల్ ద్వారా మీకు కన్ఫర్మేషన్ వస్తుంది.

PPF అకౌంట్​ మెచ్యూర్​ అయ్యిందా? ఈ టిప్స్​ పాటిస్తే - మీ ఆదాయం 'డబుల్'​​ కావడం గ్యారెంటీ! - PPF Corpus Management Tips

వరల్డ్ నం-1 మొబైల్ ఆపరేటర్​గా 'రిలయన్స్ జియో' - రెండో స్థానానికి పడిపోయిన చైనా మొబైల్​! - Reliance Jio

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.