ETV Bharat / business

సరైన ఇన్సూరెన్స్ ఏజెంట్​ను ఎంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!

How To Choose The Right Insurance Agent : నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బీమా పాలసీలను తీసుకుంటున్నారు. అయితే చాలా మంది సరైన ఏజెంట్​ను ఎన్నుకోవడం ఎలానో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా, మంచి పాలసీలను సూచించే బీమా ఏజెంట్లను ఎలా ఎంచుకోవాలి? అనే విషయాన్ని ఈ ఆర్టికల్​ ద్వారా తెలుసుకుందాం.

How to Choose the Best Insurance Agent
How to Choose the Right Insurance Agent
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 11:32 AM IST

How To Choose The Right Insurance Agent : ఆర్ధిక సమస్యలు వచ్చినప్పుడు డబ్బుల కోసం పరుగులు పెట్టడం కంటే ముందుగానే డబ్బు దాచుకోవటం మంచిది. ఇందుకు కోసం చాలా మంది బీమా చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మనకి సహాయం చేసే వ్యక్తే ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌/ అడ్వైజర్‌. సులువుగా చెప్పాలంటే బీమా ఏజెంట్‌. కొంత మంది ఏజెంట్లు రకరకాల కంపెనీల పాలసీలు విక్రయించినా, చాలా మంది ఒక కంపెనీ పాలసీలనే సేల్ చేస్తుంటారు. వీరు సాధారణంగా ఇంటి వద్ద నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తారు. కొందరైతే జీవిత బీమా పాలసీలతో పాటు వెహికల్ ఇన్సూరెన్స్‌, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్ ఇన్సూరెన్స్‌ లాంటివి కూడా విక్రయిస్తారు. ఏదేమైనా, సరైన వ్యక్తి దగ్గర పాలసీ తీసుకున్నప్పుడు మాత్రమే, పాలసీదారులు సులువుగా దానిని క్లెయిమ్ చేసుకోగలుగుతారు. అందుకే జీవితంలో బీమా ఎంత అవసరమో, సరైన బీమా ఏజెంట్‌ను ఎంచుకోవడం కూడా అంతే అవసరం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

బీమా ఏజెంట్‌ ఎలా ఉండాలంటే?
మీరు బీమా ఏజెంట్‌ను ఎన్నుకొనేటప్పుడు, ముందుగా అతని ప్రాథమిక అర్హతలు గురించి తెలుసుకోవాలి. అతను చురుకుగా పనిచేస్తున్నాడా? లేదా? పరిశీలించాలి. ఎందుకంటే, మంచి అర్హతలు, చురుకుదనం ఉన్న ఏజెంట్ మాత్రమే మీ కుటుంబ బాధ్యతలు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకుని, మీకు అనుగుణమైన, మీ అవసరాలు తీర్చే పాలసీలను సూచించగలుగుతాడు.

క్లయింట్ల అవసరాలతో సంబంధం లేకుండా, కేవలం కమీషన్‌ సంపాదించడం మాత్రమే పనిగా పెట్టుకున్న వ్యక్తులు ఈ వ్యాపారంలో ఎక్కువ కాలం కొనసాగలేరు. వాస్తవానికి ఇలాంటి వారు పాలసీదారుని పట్ల బాధ్యతగా వ్యవహరించలేరు కూడా.

ఒక మంచి బీమా ఏజెంట్‌ పాలసీదారుడి అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పాలసీల గురించి చర్చించేటప్పుడు నిజాయతీగా వ్యవహరించాలి. మీకు తగిన పాలసీని గుర్తించి, దానికి సంబంధించిన వివరాలు, ప్రయోజనాలు, లోపాలను స్పష్టంగా, సరళంగా వివరించాలి. మీ అనుమానాలను తీర్చాలి. అలాగే మీకు సూచించిన పాలసీ అనేది అతనికి వచ్చే కమీషన్ బట్టి కాకుండా మీ అవసరాన్ని బట్టి ఉండాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే, పాలసీ కొనుగోలు చేయమని మీపై ఒత్తిడి చేయకూడదు.

బీమా ఏజెంట్​ పాలసీ పని తీరు, ప్రీమియం ఖర్చులు, ప్రాసెస్ అప్‌డేట్స్‌, పాలసీ పునరుద్ధరణ, క్లెయిమ్ ప్రాసెస్​ లాంటి వివరాలను కస్టమర్లకు చాలా స్పష్టంగా తెలియజేయాలి. ముఖ్యంగా బీమా పట్టాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలి. ఒకవేళ మీకు ఎలాంటి సమస్య వచ్చినా సదరు ఏజెంటు పూర్తి బాధ్యత తీసుకోవాలి. అవసరం, అనుమానం వచ్చినప్పుడల్లా ప్రీమియం చెల్లింపుల వివరాలను సమీక్షించడానికి మీకు అందుబాటులో ఉండాలి. క్లయింట్‌కు మెరుగైన సర్వీస్‌ను అందించడమే లక్ష్యంగా ఏజెంట్ పనిచేయాలి.

సరైన ఏజెంట్‌ను ఎలా కనుగొనాలి?
ఒకవేళ మీరు ఓ పర్టిక్యులర్​ కంపెనీలోనే బీమా పాలసీ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటే, వెంటనే ఆ ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించవచ్చు. వాళ్లు తమ అధికారిక ఏజెంట్‌ను మీ వద్దకు పంపిస్తారు.

ఒక వేళ మీకు ఎక్కడ బీమా పాలసీ తీసుకోవాలనే విషయంలో క్లారిటీ లేకపోతే, ఇంతకు ముందు పాలసీ తీసుకున్నవారి సలహాలు తీసుకోవచ్చు. లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో చర్చించి సరైన, అనుభవమున్న ఏజెంట్​ను ఎన్నుకోవచ్చు. లేదా మీ పర్సనల్ ఫైనాన్సియల్ అడ్వైజర్​ను సంప్రదించాలి. అప్పుడు వారు సరైన ఏజెంట్​ను సూచిస్తారు. ఎందుకంటే వృత్తిపరమైన సలహాదారులు, మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, మీకు తగిన ఏజెంట్‌ను సిఫార్సు చేస్తారు.

సరైన ఏజెంట్‌ అని ఎలా గుర్తించాలి?
బీమా ఏజెంట్లకు కచ్చితంగా లైసెన్స్‌ ఉండాలి. ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి బీమా ఏజెంట్‌ లేదా సర్టిఫైడ్​ పాయింట్​ ఆఫ్​ సేల్స్​ పర్సన్(POSP)కు జీవిత బీమా లేదా సాధారణ బీమా పాలసీలను విక్రయించడానికి లైసెన్స్‌ ఉండాలి. కనుక ఇలాంటి లైసెన్స్ ఉన్నవారిని మాత్రమే ఎన్నుకోవాలి.

అలాగే ఏజెంట్‌ విద్యార్హతలు, శిక్షణ, వృత్తిపరమైన అర్హతల వివరాలను తెలుసుకోవాలి. కొంత మంది బీమా ఏజెంట్లు మెరుగైన అర్హతలను పొందేందుకు అదనపు కోర్సులు చేస్తారు. అదనపు శిక్షణ తీసుకుంటారు. ఇది వారికి వృత్తి, నైతిక వ్యాపార పద్ధతుల పట్ల ఉన్న నిబద్ధతను సూచిస్తుంది. అలాగే ఏజెంట్‌ లైసెన్స్‌ ఎప్పుడు జారీ అయ్యింది? ఎంత అనుభవం ఉంది? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

నోట్​ : కొంత మంది ఏజెంట్లు బీమా పాలసీని విక్రయించేటప్పుడు, మిమ్మల్ని ఆకట్టుకునేందుకు, లేనిపోని విషయాలు చెబుతారు. సదరు పాలసీ వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలు కలుగుతాయని అతిగా చెబుతుంటారు. అయితే ఇలాంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏజెంట్ చెప్పే బెనిఫిట్స్ అన్నీ రాతపూర్వకంగా పాలసీ డాక్యుమెంట్‌లో ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి.

రోజువారీ ఖర్చులకు డబ్బులు కావాలా? 'హాస్పిటల్​ డైలీ క్యాష్' పాలసీపై ఓ లుక్కేయండి!

తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటున్నారా? సైబర్ నేరగాళ్లు కావచ్చు - జర జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.