How To Check Credit Score Without PAN Card : పర్సనల్ లోన్ నుంచి కార్ లోన్ వరకు ప్రతీ రుణానికి కచ్చితంగా మంచి సిబిల్ స్కోర్ ఉండాల్సిందే. సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు, రుణసంస్థలు లోన్లు ఇస్తుంటాయి. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో సిబిల్ స్కోర్ తెలియజేస్తుంది. తీసుకున్న లోన్లు సమయానికి చెల్లిస్తున్నారా? లేదా ఏమైనా బకాయిలు ఉన్నాయా? ఇలా అన్ని విషయాలు సిబిల్ స్కోర్ ద్వారా తెలిసిపోతాయి.
సిబిల్ స్కోరును సాధారణంగా 300 నుంచి 900 వరకు లెక్కిస్తారు. సిబిల్ స్కోరు ఎంత ఎక్కువ ఉంటే ఆర్థిక పరిస్థితి అంత బాగున్నట్లు భావిస్తాయి బ్యాంకులు. సిబిల్ స్కోర్ 700కిపైగా ఉంటే రుణాలు ఈజీగా పొందొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకోవాలి. సాధారణంగా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే కచ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందే. అయితే పాన్ కార్డ్ లేకుండా కూడా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- మొదటగా సిబిల్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- వ్యక్తిగత సిబిల్ స్కోర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- తరువాత Get Your Free CIBIL scoreపై క్లిక్ చేయాలి.
- మీ ఈ-మెయిల్ ఐడీ ద్వారా అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలి.
- తర్వాత మీ పేరు ఎంటర్ చేయాలి.
- పాన్ కార్డ్ నంబరు స్థానంలో పాస్‌పోర్ట్/ ఓటర్ ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్/ రేషన్ కార్డ్ నంబర్లను ఎంటర్ చేయాలి.
- మీ పుట్టిన తేదీ, పిన్ కోడ్‌లను ఎంటర్ చేసి రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
- తర్వాత మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి, కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ అకౌంట్‌ను మీరు వినియోగిస్తున్న సిస్టమ్‌తో యాడ్ చేయాలని అనుకుంటున్నారా? అని అడుగుతుంది.
- మీ ప్రాధాన్యతలను బట్టి YES లేదా No ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీనితో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ఆ తర్వాత Go To Dashboard ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది. ఈ విధంగా పాన్ కార్డ్ లేకుపోయినా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు.
ఓలా బంపర్ ఆఫర్ - ఈవీల ధరలు భారీగా తగ్గింపు - ఇకపై రూ.69,999కే S1X స్కూటర్! - Ola EV Scooter Offers