How To Block Lost Credit Card : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు అనేది అందరి చేతిలో కామన్ అయిపోయింది. డబ్బులు చేతిలో లేనప్పుడు మనల్ని అవసరాల నుంచి గట్టేక్కించేవి ఈ కార్డులే . అయితే అనుకోకుండా ఎప్పుడైనా మన క్రెడిట్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా దానిని వెంటనే బ్లాక్ చేయకుంటే చాలా ప్రమాదం. వైఫై యాక్సిస్ ఉన్న క్రెడిట్ కార్డులకు అయితే ఈ రిస్క్ మరింత ఎక్కువ. అయితే క్రెడిట్ కార్డు పోయినప్పుడు సులభంగా మెుబైల్లోనే కార్డును బ్లాక్ చేసే మార్గాలు తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే ఈ స్టోరీ చదవండి.
1. కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి : మీ కార్డు పోయిందని గమనించిన వెంటనే మీరు చేయాల్సిన మొదటి పని మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేయటం. సాధారణంగా బ్యాంకు టోల్ ఫ్రీ నెంబర్ కార్డు వెనుక భాగంలో ఉంటుంది. ఒకవేళ అలా లేని పక్షంలో టోల్ ఫ్రీ నెంబర్ కోసం గూగుల్‌లో వెతకండి. అయితే ఆ సమయంలో తప్పనిసరిగా మీ అకౌంట్ నెంబర్, ఇటీవల కాలంలో జరిపిన లావాదేవీల వివరాలు మీ దగ్గర పెట్టుకొండి. ఎందుకంటే కస్టమర్ ప్రతినిధి ఈ వివరాలు అడుగుతారు.
2. నెట్ బ్యాంకింగ్
- నెట్ బ్యాంకింగ్ ఉపయోగించే వారు అకౌంట్లో లాగిన్ అవ్వాలి
- అందులో కార్డు లేదా సర్వీస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి
- లాస్ట్ కార్డు (lost card) అనే ఆప్షన్‌కు వెళ్లి బ్లాక్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి
3. ఎస్ఎమ్ఎస్ల ద్వారా :
ఎస్ఎమ్ఎస్ల ద్వారా బ్లాక్ చేసే ఆప్షన్‌ను కొన్ని బ్యాంకులు మాత్రమే కల్పిస్తాయి. ఒకవేళ మీ బ్యాంక్‌కు ఆ ఆప్షన్ ఉంటే మీ రిజిస్టర్ మెుబైల్ నెంబర్ నుంచి బ్లాక్ అని టైప్ చేసి మీ బ్యాంకు ప్రొవైడ్ చేసిన నెంబర్‌కు మెసేజ్ చేయ్యండి.
4. మీ బ్యాంకు శాఖను సందర్శించండి :
పైన తెలిపిన మార్గాల ద్వారా మీరు కార్డు బ్లాకు చేయ్యలేకపోతే వెంటనే మీ దగ్గర్లోని బ్యాంకు శాఖను సంప్రదించండి. అక్కడ మీ కార్డు పోయినట్లు సమాచారం ఇవ్వాలి. అక్కడ సిబ్బంది వెంటనే మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేస్తారు.
ఇవేనండి మీ క్రెడిట్ కార్డు పోయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ మార్గాలను పాటించి ఒకవేళ మీ కార్డు పోయినా ఎటువంటి ఆర్థిక నష్టం జరగకుండా హ్యాపీగా ఉండండి.
క్రెడిట్‌కార్డ్ 'మినిమం పేమెంట్' ఆప్షన్ - లాభనష్టాలు ఇవే!
క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్!