ETV Bharat / business

బాగా ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? ఈ 'సక్సెస్ ఫార్ములా' మీ కోసమే! - How To Become Rich - HOW TO BECOME RICH

How To Become Rich : మీరు జీవితంలో అత్యంత ధనవంతులుగా ఎదగాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. తమ జీవితంలో, వ్యాపారంలో అత్యంత విజయవంతమైన వారెన్ బఫెట్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్​ల గురించి ప్రముఖ రచయిత క్రిస్టోఫర్ గ్రోవ్ రచించిన ‘‘ది ఫిలాసఫీ ఆఫ్ సక్సెస్’’ పుస్తకం చదవండి చాలు. జీవితంలో ఎలా పైకి ఎదగాలో మీకే తెలుస్తుంది.

Warren Buffett, Elon Musk, bill gates
Warren Buffett, Elon Musk, bill gates (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 10:51 AM IST

How To Become Rich : సంపద విషయంలో కొందరు తిరుగులేని రారాజులుగా ఉన్నారు. వ్యాపార, పారిశ్రామిక జగత్తులో వారికి వారే సాటి. వారిలో అగ్రగణ్యులు వారెన్ బఫెట్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్​లు. అయితే ఈ ముగ్గురికి అంత సులువుగా ఏ విజయాలూ లభించలేదు. కార్యదీక్షతో, ఎంతో కష్టపడి తమ జీవిత లక్ష్యాలను సాధించగలిగారు. మరి మీరు కూడా వీరిలానే జీవితంలో పైకి ఎదగాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. వీరు ఇంత విజయవంతంగా వ్యాపారాలు నిర్వహించడానికి ప్రధాన కారణం వారి అలవాట్లే. ఆ అలవాట్లే మనకూ ఉంటే, మనం కూడా కచ్చితంగా కోరుకున్న రంగంలో విజయం సాధించగలుగుతాం.

టెస్లా, ట్విట్టర్, స్పేస్ ఎక్స్ కంపెనీల యజమాని ఎలాన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా వెలుగొందుతున్నాడు. ఇక బెర్క్‌షైర్ హాత్​వే కంపెనీ సీఈవో వారెన్ బఫెట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్‌లో విశ్వ విఖ్యాతిని సంపాదించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిరంతర కృషి, అభ్యాసం, ఆవిష్కరణల ద్వారా ఆయన కీర్తి ప్రతిష్ఠలను సొంతం చేసుకున్నారు. అందుకే ప్రముఖ రచయిత క్రిస్టోఫర్ గ్రోవ్ తన పుస్తకమైన 'ది ఫిలాసఫీ ఆఫ్ సక్సెస్​'లో ఈ ముగ్గురు అభినవ కుబేరుల అలవాట్ల గురించి చక్కగా విశ్లేషణ చేశారు. ఆ వివరాలు మనమూ తెలుసుకుందాం రండి.

1. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం

  • వారెన్ బఫెట్ : ఈయనను ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారుల్లో అగ్రగణ్యులు అని చెప్పుకోవచ్చు. ఈయన ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలని భావిస్తే, ఆ కంపెనీ రానున్న ఐదు నుంచి పదేళ్లలో ఎంతమేర పురోగమిస్తుందనే దానిపై ఒక అంచనాకు వస్తారు. ఇందుకోసం అన్ని కోణాల్లో, అన్ని రకాల అంశాలను నిశితంగా విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణలో సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలు వెలువడితేనే, ఆ కంపెనీల్లో ఆయన పెట్టుబడి పెడతారు. దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశాలు తగ్గి, లాభాలు వస్తాయని ఆయన బలంగా నమ్ముతారు.
  • బిల్ గేట్స్ : కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో, ప్రతీ ఇంటికి కంప్యూటర్‌ను చేర్చాలని బిల్ గేట్స్ కలలు కనేవారు. అందుకు అనుగుణంగానే ఆయన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ల వ్యాపారంలో సాంకేతిక విప్లవం క్రియేట్ చేశారు. ఆ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తెచ్చారు. ఆయనకున్న దీర్ఘకాలిక వ్యూహం వల్లే, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్ తిరుగులేని రారాజుగా వెలుగొందుతోంది.
  • ఎలాన్ మస్క్ : ఎలాన్ మస్క్ ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా వెంటనే సిద్ధమైపోతారు. తన కలలను సాకారం చేసుకునేందుకు ఆయన రిస్క్ తీసుకుంటారు. మార్స్‌పై మనుషులకు స్థావరాలు (కాలనీలు) ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఆయన స్పేస్​ ఎక్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. అంతరిక్షంలోకి టూరిస్టులను తీసుకెళ్లే వ్యూహంతో, ఆయన కంపెనీ స్పేస్ క్రాఫ్ట్‌లను కూడా తయారుచేస్తోంది. దీర్ఘకాలంలో ఫలితాలను ఇచ్చే వ్యాపార వ్యూహమే ఎలాన్ మస్క్‌ను ప్రపంచ కుబేరుడిగా మార్చింది.

2. రిస్క్‌ను అంచనా వేయడం, ఎదుర్కోవడం

  • వారెన్ బఫెట్ : ఏదైనా కంపెనీలో లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వాళ్లు తప్పకుండా రిస్క్, రివార్డ్ నిష్పత్తి ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. మనం చేసే పనికి లేదా పెట్టిన పెట్టుబడికి ఎంత మేరకు లాభం వస్తుందో అంచనా వేస్తుంటాం. కానీ రిస్క్‌ను అంచనా వేయకుండా వదిలేస్తుంటాం. ఇలాంటి పరిస్థితిల్లో పొరపాటున నష్టాలు వస్తే, తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితి ఎదురుకావొద్దంటే, రిస్క్ ఎంత ఉందనేది ముందే మదింపు చేసుకోవాలి.
  • బిల్ గేట్స్ : మీరు మీ జీవితంలో ఏదైనా పెద్దది చేయాలనుకుంటే రిస్క్ తీసుకోవాల్సిందే అని బిల్ గేట్స్ చెబుతుంటారు. గేట్స్ తన కెరీర్‌లో కష్టమైన పనిని త్వరగా, సులభంగా చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలను వెతకడంలో సక్సెస్ అయ్యారు.
  • ఎలాన్ మస్క్ : మస్క్ అంటే రిస్క్‌కు కేరాఫ్ అడ్రస్ అని చాలా మంది వ్యాపార రంగ పరిశీలకులు చెబుతుంటారు. అందుకే ఆయన ప్రపంచంలోని సక్సెస్​ ఫుల్ స్టార్టప్‌లకు ఫౌండర్‌గా నిలిచారు. భారీ ధరకు ట్విట్టర్‌ను కొనడం, స్పేస్ ఎక్స్ వ్యాపారంలో అడుగుపెట్టడం అనేవి ఎలాన్ మస్క్ తీసుకున్న అతిపెద్ద రిస్క్‌లు.

3. వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకోవడం

  • వారెన్ బఫెట్ : వారెన్ బఫెట్ తమ కంపెనీల వాటాదారులకు ప్రతి సంవత్సరం లేఖలు రాస్తుంటారు. పెట్టుబడులు పెట్టే విషయంలో తాను చేసిన తప్పుల వివరాలను ఆయన అందరితో పంచుకుంటూ ఉంటారు. తప్పుడు ధరకు కంపెనీలను కొని నష్టపోయిన సందర్భాలను బఫెట్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కంపెనీల ఆదాయ వృద్ధిపై తప్పుడు అంచనాలను రూపొందించుకొని కుదేలైన చేదు అనుభవాలను ఆయన లేఖల్లో నెమరువేసుకుంటూ ఉంటారు. ఈ తప్పుల నుంచి కొత్త పాఠాలను నేర్చుకుంటూ బఫెట్ ముందుకు సాగుతారు.
  • బిల్ గేట్స్ : విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, వైఫల్యం నుంచి పాఠాలను నేర్చుకోవడం అంతకంటే చాలా ముఖ్యమని బిల్ గేట్స్ చెబుతుంటారు. మైక్రోసాఫ్ట్‌ను ఏర్పాటు చేయడానికి ముందు బిల్ గేట్స్ తన వ్యాపార భాగస్వామి పాల్ అలెన్‌తో కలిసి ట్రాఫ్-ఓ-డేటా అనే కంపెనీని ఏర్పాటు చేశాడు. అయితే ఆ కంపెనీ పెద్దగా సక్సెస్ కాలేదు.
  • ఎలాన్ మస్క్ : 2015 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ కంపెనీని ఎలాన్ మస్క్ ప్రారంభించిన కొత్తలో చాలా వైఫల్యాలు ఎదురయ్యాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాను ప్రారంభించిన కొత్తలో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఇప్పుడు టెస్లా కంపెనీ షేర్ల విలువ టాప్ రేంజులో ఉంది. టెస్లా కార్లకు భారీ గిరాకీ ఉంది.

4. సహనం, నిలకడ

  • వారెన్ బఫెట్ : వారెన్ బఫెట్ దీర్ఘకాలిక పెట్టుబడులకు మారుపేరు. ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెడితే కొన్నేళ్ల పాటు దాన్ని అలాగే కొనసాగించడం ఆయన ప్రత్యేకత. తన నిర్ణయంపై బఫెట్‌కు అంతటి విశ్వాసం ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందే ఆయన చాలా మేధోమథనం చేస్తారు. అందుకే ఆ తర్వాత వెనకడుగు వేయరు.
  • బిల్ గేట్స్ : మైక్రోసాఫ్ట్ కంపెనీని ప్రారంభించిన కొత్తలో బిల్ గేట్స్‌ను ఎవరూ పెద్దగా ఆదరించలేదు. ఆయనకు వ్యాపారపరమైన ఆర్డర్లు కూడా అంతగా రాలేదు. క్రమక్రమంగా తన పరిచయాల సహకారంతో తన నెట్‌వర్క్‌ను బిల్‌గేట్స్ పెంచుకుంటూ పోయారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు భారీ ఎత్తున అమ్ముడుపోతున్నాయి.
  • ఎలాన్ మస్క్ : పెద్ద కలలు కంటే ఒక సాధారణ వ్యక్తి కూడా అసామాన్యుడిగా మారుతాడు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఎలాన్ మస్క్. ఆయన జీవిత ప్రారంభ దశలో అనేక వైఫల్యాలు ఎదురయ్యాయి. అయినా మస్క్ తన కలలను ఎప్పుడూ వదులుకోలేదు. అతని పట్టుదల చివరకు ఫలించింది. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలు సంచలనాత్మక విజయాలను అందుకున్నాయి.

5. నిరంతర అభ్యాసం

  • వారెన్ బఫెట్ : వారెన్ బఫెట్‌కు ఎంతో తెలిసినా, ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు. ఆయన నిత్యం పుస్తకాలు చదువుతుంటారు. తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. అందుకే ఆయన పెట్టుబడి నిర్ణయాలలో అంత కచ్చితత్వం ఉంటుంది.
  • బిల్ గేట్స్ : బిల్ గేట్స్ కూడా పుస్తకాలు బాగా చదువుతారు. తాను చదివిన పుస్తకాల వివరాలను ఆయన నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. మేధో వికాసానికి పుస్తక పఠనం దోహదం చేస్తుందని గేట్స్ నమ్ముతారు.
  • ఎలాన్ మస్క్ : ఎలాన్ మస్క్ కూడా పుస్తకాలు బాగా చదువుతారు. రాకెట్ సైన్స్ నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వరకు వివిధ రంగాల పుస్తకాలను ఆయన తిరగేస్తుంటారు. వాటి నుంచి భవిష్యత్తు ప్రయోగ మిషన్లకు ప్రణాళికలను రెడీ చేస్తుంటారు.

సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారా? ఈ టాప్​-6 టిప్స్ మీ కోసమే! - Business Launch Tips

పన్ను ఎగ్గొట్టాలని చూస్తున్నారా? జర జాగ్రత్త! ఐటీ శాఖ ఈజీగా పసిగట్టేస్తుందిలా? - ITR Filing 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.