ETV Bharat / business

సూపర్ ఫీచర్లతో మార్కెట్​లోకి యాక్టివా 7జీ!- ధరెంతో తెలుసా? - హెండా యాక్టివా 7జీ ఫీచర్స్

Honda activa 7g Features : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టివా​లో కొత్తగా 7జీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది కంపెనీ. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అవకాశాలను అంది పుచ్చుకోవాలన్న లక్ష్యంతో యాక్టివా 7జీ మోడల్​ను విడుదల చేయనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల అవుతుందని సమాచారం.

Honda activa 7g Features
Honda activa 7g Features
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 11:37 AM IST

Honda Activa 7g Features : హోండా యాక్టివా విశ్వసనీయత, మెరుగైన పనితీరు కారణంగా భారతదేశంలో మంచి గుర్తింపు పొందింది. అందుకే చాలామంది హోండా యాక్టివా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే హోండా, ఇప్పుడు భారత మార్కెట్లోకి కొత్తగా యాక్టివా 7జీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త హోండా యాక్టివా 7జీని ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్​లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

హోండా యాక్టివా 7జీ ఫీచర్లు
యాక్టివా 7జీ గురించి ఇప్పటివరకు హోండా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. దానికంటే ముందున్న దానితో పోలిస్తే మెరుగ్గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఫీచర్లను పరిశీలిస్తే హోండా యాక్టివా 7జీ పూర్తి డిజిటల్ సెటప్​తో రాకపోయినా, బ్లూటూత్ కనెక్టివిటీతోపాటు సెమీ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్​తో అమర్చబడి ఉంటుంది. దేశంలోని టూవీలర్ మార్కెట్లో కొనసాగుతున్న ట్రెండ్స్​ను పరిశీలిస్తే యాక్టివా 7జీ కూడా మిగతా వాటిలాగే ఫీచర్స్​ను ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టాండర్డ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్కూటర్​పై ఎల్ఈడీ హెడ్ లైట్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో మార్కెట్లో రానున్నట్లు సమాచారం.

పర్ఫామెన్స్​
పనితీరు పరంగా చూస్తే, హోండా యాక్టివా 7జీ బైకును 109.51 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో రూపొందించింది. ఈ ఇంజిన్ మునుపటి యాక్టివా మోడళ్లతో సమానంగా పనితీరును అందిస్తుంది. ఈ 109.51సీసీ ఇంజిన్ 7.79 బిహెచ్ పి పవర్, 8.84 ఎన్ఎమ్ టార్క్​ను సామర్థ్యంతో రానుంది.

హార్డ్ వేర్
హోండా యాక్టివా 7జీలోని హార్డ్‌వేర్​ను పరిశీలిస్తే, ఇది ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్, బ్యాక్ సైడ్ ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఎలాంటి రోడ్లపై అయినా సరే సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ సస్పెన్షన్​ను డిజైన్ చేశారు. యాక్టివా 7జీ మెరుగైన స్థిరత్వం, బైక్​ కంట్రోల్ కోసం 12-అంగుళాల ఫ్రంట్ వీల్, 10-అంగుళాల వెనుక చక్రంతో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ధర: ప్రస్తుతం హోండా యాక్టివా 6జీ ధర రూ. 76,000-82,000 (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. త్వరలో మార్కెట్లోకి రానున్న యాక్టివా 7జీ ప్రారంభ ధర రూ. 79,000(ఎక్స్-షోరూమ్)ఉంటుందని అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.