ETV Bharat / business

గూగుల్‌ పేలో పేమెంట్‌ హిస్టరీ డిలీట్‌ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - GPay Transaction History Delete - GPAY TRANSACTION HISTORY DELETE

GPay Transaction History Delete : యూపీఐ పేమెంట్స్ కోసం చాలా మంది 'గూగుల్​ పే' (Gpay) యాప్​ను వాడుతుంటారు. అయితే ఈ గూగుల్ పే నుంచి మీరు చేసిన పేమెంట్స్ హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటున్నారా? అదేలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

GPay Transaction History Delete
GPay Transaction History Delete (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 10:22 AM IST

GPay Transaction History Delete : దేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్​ బాగా పెరిగిపోయాయి. ప్రతిదానికీ యూపీఐ పేమెంట్స్​ చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న షాపులు మొదలు, పెద్ద స్థాయిలో నిర్వహించే వ్యాపారాల వరకూ, యూపీఐ పేమెంట్స్​ను సర్వసాధారణం అయిపోయాయి. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ యాప్​ల్లో 'గూగుల్‌ పే' ఒకటిగా ఉంది. కూరగాయలు కొనడం నుంచి రైలు, విమాన టికెట్ బుకింగ్​ల వరకు ఈ యాప్​నే చాలా మంది వినియోగిస్తున్నారు. మనం చేసే ప్రతి చెల్లింపునకు సంబంధించిన వివరాలు ఆ యాప్‌లో నమోదవుతుంది. అయితే ట్రాన్సాక్షన్‌ హిస్టరీలో ఆ వివరాలను కనిపించకుండా చేసేందుకు సదుపాయమూ ఉంది. కింద పేర్కొన్న విధంగా చేస్తే గూగుల్ పే హిస్టరీను డిలీట్​ చేయవచ్చు.

ఎలా డిలీట్ చేయాలంటే!

  • గూగుల్‌ పే యాప్‌లో ప్రొఫైల్‌పై ట్యాప్‌ చేసి 'Settings'లోకి వెళ్లాలి. అక్కడ 'Privacy & Security' ఆప్షన్​పై క్లిక్‌ చేయాలి.
  • అందులో 'Data & Personalization' అనే ఆప్షన్‌ను ఎంచుకొని గూగుల్‌ అకౌంట్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత 'Manage your Google pay experience' పేజ్‌ని కిందకు స్క్రోల్‌ చేస్తే గూగుల్‌ పే లావాదేవీల హిస్టరీ కనిపిస్తుంది.
  • ఆ జాబితాలో మీరు తొలగించాలనుకున్న లావాదేవీని అక్కడి ఆప్షన్‌తో డిలీట్‌ చేయొచ్చు.
  • కావాలంటే టైమ్‌ ఫ్రేమ్‌ను ఎంచుకొని ఆ డేటా మొత్తాన్నీ తొలగించొచ్చు. మొత్తం హిస్టరీని కూడా డిలీట్‌ చేయొచ్చు.

గూగుల్ పే యాప్​నకు క్రెడిట్, డెబిట్ కార్డులు లింక్ చేయడం ఎలా?
గూగుల్ పేతో యూపీఐ పేమెంట్స్​ చేయడమే కాదు. దానికి క్రెడిట్, డెబిట్ కార్డ్​లను కూడా లింక్ చేసుకోవచ్చు. వాటి ద్వారా ఆన్​లైన్, ఆఫ్​లైన్ విధానాల్లోనూ పేమెంట్స్​ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ ఫోన్​లోకి Google Pay యాప్​ను డౌన్​లోడ్ చేసుకుని, ఇన్​స్టాల్ చేయాలి.
  • మీ జీ-మెయిల్​ అకౌంట్​తో గూగుల్​ పే యాప్​లోకి సైన్​-ఇన్​ కావాలి.
  • మీ ఫోన్​లో లాగ్​-ఇన్​ అయిన ఈ-మెయిల్​ అకౌంట్​, గూగుల్ పేలో సైన్-ఇన్ అయిన ఈ-మెయిల్ అకౌంట్ ఒకటే అయ్యుండాలి.
  • ఆ తర్వాత మీ ప్రొఫైల్ పిక్​పై క్లిక్ చేయాలి.
  • Payment Methods ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీకు కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి.
  1. యాడ్ బ్యాంక్ అకౌంట్​
  2. సెట్-అప్​ యూపీఐ లైట్​
  3. యాడ్ క్రెడిట్ లైన్​
  4. యాడ్​ రూపే క్రెడిట్ కార్డ్​ ఆన్ యూపీఐ
  5. అదర్ వేస్​ టు పే
  • ఈ Other ways to pay సెక్షన్​లోకి వెళ్లి, మీ క్రెడిట్, డెబిట్ కార్డ్​లను యాడ్ చేసుకోవచ్చు.
  • ఇందుకోసం Add Cardపై క్లిక్ చేయాలి. మిగతా వివరాలు కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

UPI PIN మర్చిపోయారా? ఈ సింపుల్ స్టెప్స్​తో రీసెట్​ చేయండిలా! - How To Reset UPI Pin

క్రెడిట్ కార్డ్​తో యూపీఐ పేమెంట్స్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - Credit Cards For UPI Payments

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.