ETV Bharat / business

త్వరలో గూగుల్ పే 'సౌండ్​పాడ్'​ లాంఛ్! ధర ఎంతంటే? - Google Pay SoundPod features

Google Pay SoundPod To Launch In India : ప్రపంచ ప్రఖాత టెక్​ కంపెనీ గూగుల్ త్వరలో గూగుల్​పే 'సౌండ్​పాడ్' డివైజ్​ను ఇండియాలో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి, చాలా సులువుగా పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఇది చిన్న, మధ్య తరహా వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది.

Google Pay Introduced SoundPod
Google Pay SoundPod To Launch In India
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 1:38 PM IST

Google Pay SoundPod To Launch In India : టెక్​ దిగ్గజం గూగుల్​ త్వరలో భారతదేశంలో సౌండ్​పాడ్​ డివైజ్​ను లాంఛ్​ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది వ్యాపారులకు చాలా బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది. దీని ద్వారా క్యూఆర్​ కోడ్​ పేమెంట్స్​ చాలా సులువుగా చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Google Pay SoundPod Pilot Project : వాస్తవానికి గూగుల్ కంపెనీ గత ఏడాదే ఈ సౌండ్​పాడ్​ను పైలెట్​ ప్రాజెక్టుగా తీసుకువచ్చింది. దీనికి వ్యాపారుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే త్వరలో దీనిని భారత్​లో ఆఫీషియల్​గా లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రానున్న నెలల్లో భారతదేశమంతటా దీనిని క్రమంగా అందుబాటులోకి తెస్తామని కూడా ప్రకటించింది.

గూగుల్ కంపెనీ భారతదేశంలో డిజిటల్​ పేమెంట్ ల్యాండ్​స్కేప్​ను పెంచడానికి, సులభంగా సురక్షిత లావాదేవీలు నిర్వహించడానికి కృషి చేస్తుందని, గతంలోనే గూగుల్ పే ప్రొడక్ట్​ వైస్​ ప్రెసిడెంట్​ అంబరీష్ కెంఘే చెప్పడం గమనార్హం.

Google Pay SoundPod Features :

  • పేమెంట్ ప్రాసెస్​ : కస్టమర్లు​ గూగుల్ పే ఉపయోగించి క్యూఆర్​ కోడ్ స్కాన్ చేస్తే చాలు. సింపుల్​గా పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది.
  • ఆడియో పేమెంట్ ట్రాకింగ్ : కస్టమర్లు క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి పేమెంట్ చేసిన వెంటనే, ఈ గూగుల్ సౌండ్​పాడ్​ ఆ విషయాన్ని ఆడియో ద్వారా వ్యాపారులకు తెలియజేస్తుంది. కనుక వ్యాపారులు ప్రతీసారి తమ గూగుల్ పే అకౌంట్​లోకి వెళ్లి, పేమెంట్స్​ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం!
'భారతదేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఈ సౌండ్​పాడ్ బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఇప్పటికే 2 కోట్ల మంది వ్యాపారులు పేటీఎం, ఫోన్​పేలకు చెందిన సౌండ్ బాక్స్​లను వాడుతున్నారు. అయితే గూగుల్ సౌండ్​పాడ్​తో వీటికి గట్టి పోటీ ఎదురుకానుంది' అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Google Pay SoundPod Price : ఈ గూగుల్ పే సౌండ్​పాడ్ ధర సుమారుగా 18-20 డాలర్లు ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో అయితే రూ.1494 నుంచి రూ.1660 వరకు ఉండవచ్చు.

ఇన్​స్టాంట్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

కార్​/ బైక్​ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? Add-onలతో అదనపు రక్షణ పొందండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.