ETV Bharat / business

గూగుల్​కు రూ.22వేల కోట్లు పెనాల్టీ- యాపిల్​ రూ.1.19 లక్షల కోట్లు ట్యాక్స్​ కట్టాల్సిందే! - Google EU Court Huge Fine - GOOGLE EU COURT HUGE FINE

Google EU Court Huge Fine : దిగ్గజ టెక్​ సంస్థలు గూగుల్, యాపిల్​కు యూరప్​లో భారీ షాక్​లు​ తగిలాయి. ఈయూ యాంటీట్రస్ట్‌ చట్టాల ఉల్లంఘనల​ కేసులో గూగుల్​ 2.4 బిలియన్​ యూరోల(రూ. 22 వేల కోట్లు(దాదాపు)) ఈయూ కోర్టు తీర్పునిచ్చింది. మరో కేసులో యాపిల్​ 13 బిలియన్​ యూరోలు(రూ.1.19 లక్షల కోట్లు) బ్యాక్​ ట్యాక్స్​ చెల్లించాల్సిందేనని ఈయూ కోర్టు ఆదేశించింది.

Google EU Court Huge Fine
Google EU Court Huge Fine (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 2:04 PM IST

Updated : Sep 10, 2024, 3:14 PM IST

Google EU Court Huge Fine : టెక్​ దిగ్గజాలు గూగుల్​, యాపిల్​కు యూరప్​లో భారీ షాక్​లు తగిలాయి. ఈయూ యాంటీట్రస్ట్‌ చట్టాల ఉల్లంఘనల​ కేసులో రూ.2.4 బిలియన్​ యూరోల(రూ. 22.67 వేల కోట్లు) పెనాల్టీ విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఈయూ కోర్టు సమర్థించింది. దీంతో గూగుల్​ చివరి అప్పీల్​ అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా కోర్టు విధించిన పెనాల్టీని కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. మరో కేసులో యాపిల్​ 13 బిలియన్​ యూరోలు(రూ.1.19 లక్షల కోట్లు) బ్యాక్​ ట్యాక్స్​ చెల్లించాల్సిందేనని ఈయూ కోర్టు ఆదేశించింది.

డిజిటల్‌ ప్రకటనల వ్యాపారంలో గుత్తాధిపత్యం, యాంటీ ట్రస్ట్​ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు గూగుల్​పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ఈయూ కమిషన్​ 2017లో 2.4 బిలియన్ యూరోలు పెనాల్టీ విధించింది. గూగుల్ తన ప్రత్యర్థుల కంటే సొంత షాపింగ్ కంపారిజన్ సర్వీస్‌కే మొగ్గు చూపిందని కమిషన్ ఆ సమయంలో పేర్కొంది. దీనిపై గూగుల్​ యురోపియన్ జనరల్​ కోర్టులో అప్పీల్​ చేసింది. అక్కడ కూడా ఈ టెక్​ దిగ్గజానికి చుక్కెదురైంది. కమిషన్ నిర్ణయంతో జనరల్​ కోర్టు ఏకీభవించింది. దీంతో గూగుల్​, యురోపియన్ కోర్టు ఆఫ్​ జస్టిస్​(ECJ)లో అప్పీల్​ చేసింది. ఈ విషయంపై విచారణ జరిగిన ఈయూ టాప్​ కోర్టు, జనరల్​ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. గూగుల్ 2.4 బిలియన్ యూరోల ఫైన్​ కట్టాలని ఆదేశించింది.

యాపిల్​ రూ.1.19 లక్షల కోట్లు కట్టాల్సిందే!
మరో కేసులో యాపిల్​ రూ.13 బిలియన్​ యూరోలు(రూ.1.19 లక్షల కోట్లు) బ్యాక్​ ట్యాక్స్​ చెల్లించాల్సిందేనని ఈయూ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దిగువ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈయూ సభ్య దేశమైన ఐర్లాండ్​లో యాపిల్​ పన్ను చెల్లింపులపై 2014లో ఈయూ కమిషన్​ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో 2016లో దర్యాప్తు పూర్తి చేసిన ఈయూ కమిషన్, దాదాపు 2 దశాబ్దాలుగా యాపిల్​ సంస్థ, ఐర్లాండ్​ ప్రభుత్వం నుంచి చట్టవిరుద్ధమైన పన్ను ప్రయోజనాలు పొందిందని తేల్చింది. అందుకుగానూ 13 బిలియన్ యూరోలను ఐర్లాండ్​ ప్రభుత్వం రికవర్​ చేసుకోవాల్సిందిగా ఆదేశించింది.

ఈయూ కమిషన్ నిర్ణయాన్ని యాపిల్​, ఐర్లాండ్​ ప్రభుత్వం 2019లో అప్పీల్​ చేశాయి. 2020లో ఈయూ జనరల్ కోర్టు, కమిషన్​ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఐర్లాండ్​ ప్రభుత్వం యాపిల్​ సంస్థకు పన్ను ప్రయోజనాలు చేకూర్చిందనే విషయాన్ని ఈయూ కమిషన్​ నిరూపించలేదని పేర్కొంది. అనంతరం ఈయూ కమిషన్, జనరల్​ కోర్టు తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్​పై విచారణ జరిపిన ఈయూ టాప్​ కోర్టు, 2016లో ఈయూ కమిషన్​ నిర్ణయాన్ని సమర్థించింది. యాపిల్​, ఐర్లాండ్​కు 13 బిలియన్​ యూరోలు బ్యాక్​ ట్యాక్స్​ చెల్లించాలని తీర్పు వెలువరించింది.

యాపిల్​ ఇంటెలిజెన్స్​తో ఐఫోన్​16- టచ్‌ సెన్సిటివ్‌ కెమెరా, న్యూరల్‌ ఇంజిన్‌ చిప్‌- అబ్బో చాలా ఫీచర్లున్నాయ్​! - Apple Iphone 16 Launch

'యూపీఐ సర్కిల్‌'ను లాంఛ్​ చేసిన గూగుల్‌ పే - ఇకపై ఒకే UPI ఐడీని ఐదుగురు వాడుకోవచ్చు! - Google Pay Launches UPI Circle

Last Updated : Sep 10, 2024, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.