Gold Rate Today September 3, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,550 ఉండగా, మంగళవారం నాటికి రూ.65 పెరిగి రూ.73,615కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.84,800 ఉండగా, మంగళవారం నాటికి రూ.282 పెరిగి రూ.85,082కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 3, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,615గా ఉంది. కిలో వెండి ధర రూ.85,082గా ఉంది.
- Gold Price In Vijayawada September 3, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,615గా ఉంది. కిలో వెండి ధర రూ.85,082 ఉంది.
- Gold Price In Vishakhapatnam September 3, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,615గా ఉంది. కిలో వెండి ధర రూ.85,082గా ఉంది.
- Gold Price In Proddatur September 3, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,615గా ఉంది. కిలో వెండి ధర రూ.85,082గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2494 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 2495 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.47 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 3, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,00,601 |
ఇథీరియం | రూ.2,03,473 |
టెథర్ | రూ.77.4 |
బైనాన్స్ కాయిన్ | రూ.40,009 |
సొలోనా | రూ.10,100 |
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today September 3, 2024 : వరుసగా 13 రోజులపాటు లాభాలు పండించిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 82,488 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 25,261 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం, ఐటీసీ, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఎన్టీపీసీ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : బజాజ్ ఫిన్సెర్వ్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్
ఏసియన్ మార్కెట్స్
Global Markets : ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
Rupee Open September 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.94గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices September 3, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices September 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.40 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 77.21 డాలర్లకు చేరింది.