Gold Rate Today June 26, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 73910 ఉండగా, బుధవారం నాటికి రూ.140 తగ్గి రూ.73,770కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.90845 ఉండగా, బుధవారం నాటికి రూ.1513 తగ్గి రూ.89332కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 26, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,770గా ఉంది. కిలో వెండి ధర రూ.89,332 ఉంది.
- Gold Price In Vijayawada June 26, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,770గా ఉంది. కిలో వెండి ధర రూ.89,332గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 26, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,770గా ఉంది. కిలో వెండి ధర రూ.89,332గా ఉంది.
- Gold Price In Proddatur June 26, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,770గా ఉంది. కిలో వెండి ధర రూ.89,332గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2325 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 8 డాలర్లు తగ్గి 2317 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.95 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 26, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,20,155 |
ఇథీరియం | రూ.2,63,000 |
టెథర్ | రూ.79.25 |
బైనాన్స్ కాయిన్ | రూ.48,496 |
సొలోనా | రూ.11,595 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 78,090 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 23,739 దగ్గర కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ :జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టైటన్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, మారుతీ, అదానీ పోర్ట్స్, రిలయన్స్
రూపాయి విలువ
Rupee Open June 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 26, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.