Gold Rate Today July 30, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.71,147 ఉండగా, మంగళవారం నాటికి రూ.408 తగ్గి రూ.70,739కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.84,269 ఉండగా, మంగళవారం నాటికి రూ.438 తగ్గి రూ.83,831కు చేరుకుంది.
- Gold Price In Hyderabad July 30, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.70,739గా ఉంది. కిలో వెండి ధర రూ.83,831గా ఉంది.
- Gold Price In Vijayawada July 30, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.70,739గా ఉంది. కిలో వెండి ధర రూ.83,831గా ఉంది.
- Gold Price In Vishakhapatnam July 30, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.70,739గా ఉంది. కిలో వెండి ధర రూ.83,831గా ఉంది.
- Gold Price In Proddatur July 30, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.70,739గా ఉంది. కిలో వెండి ధర రూ.83,831గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price July 30, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2394 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 9 డాలర్లు తగ్గి 2385 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 27.84 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 30, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.49,18,684 |
ఇథీరియం | రూ.2,25,600 |
టెథర్ | రూ.77.3 |
బైనాన్స్ కాయిన్ | రూ.42,501 |
సొలోనా | రూ.11,105 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today July 30, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఓ వైపు ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తున్నాయి. పైగా ఈ వారంలోనే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 58 పాయింట్లు లాభపడి 81,414 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 28 పాయింట్లు వృద్ధిచెంది 24,864 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనిలివర్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Open July 30, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.73గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices July 30, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices July 30, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.41 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.45 డాలర్లుగా ఉంది.
అప్పులు దొరకట్లేదా? బ్యాంకులు నో అంటున్నాయా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ! - Personal Loan Rejected
ఎలాంటి గొడవలు లేకుండా ఆస్తులు పంచిపెట్టాలా? వీలునామా రాయండిలా! - How To Prepare Will Deed