ETV Bharat / business

గౌతమ్ అదానీకి శాలరీ అంతేనా? కంపెనీ ఉద్యోగుల కన్నా తక్కువా! - Gautam Adani Salary 2024 - GAUTAM ADANI SALARY 2024

Gautam Adani Salary 2024 : సాధారణ ఉద్యోగులు ఏడాదికి రూ.కోట్లలో జీతాన్ని పొందుతుంటారు. ఈ క్రమంలో వ్యాపారవేత్తలు ఎంత జీతం తీసుకుంటారు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ వార్షిక వేతనం ఎంతో తాజాగా తెలిసింది!. అదానీ ఏడాదికి ఎంత శాలరీ తీసుకుంటున్నారంటే?

Gautam Adani Salary 2024
Gautam Adani Salary 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 12:23 PM IST

Updated : Jun 23, 2024, 1:29 PM IST

Gautam Adani Salary 2024 : అదానీ గ్రూప్ ఛైర్మన్, దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ రూ.9.26 కోట్ల జీతం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి( 2023-2024) ఈ జీతాన్ని ఆయన పొందారు. ఈ శాలరీ ఆయన కంపెనీలో పనిచేసే ముఖ్య ఉద్యోగులు, ఇతర వ్యాపారవేత్తలతో పోల్చితే చాలా తక్కువ. పదుల కొద్ది రంగాల్లో కంపెనీలు కలిగిన గౌతమ్ అదానీ, పోర్ట్, ఎనర్జీ రంగాల నుంచి మాత్రమే జీతం తీసుకున్నారు.

ఏయే కంపెనీల నుంచి ఎంత శాలరీ ఎంతంటే?
అదానీ ఎంటర్​ప్రైజెస్ నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గౌతమ్ అదానీ రూ.2.19 కోట్ల వార్షిక వేతనం, రూ.27 లక్షల విలువైన అలవెన్సులు పొందారు. అంటే మొత్తం 2.46 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అదానీ ఎంటర్ ప్రైజెస్ నుంచి గౌతమ్ అదానీ పొందిన శాలరీ 3శాతం ఎక్కువ. అదానీ పోర్ట్స్ నుంచి రూ.6.8 కోట్లను వేతనంగా తీసుకున్నారు.

ఆ వ్యాపారవేత్తలతో పోలిస్తే చాలా తక్కువ శాలరీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొవిడ్ ముగిసిన తర్వాత నుంచి జీతం తీసుకోవడం లేదు. అంతకుముందు ఆయన రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని తీసుకునేవారు. భారతీ ఎంటర్​ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిత్తల్​ 2022లో రూ. 16.7 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. రాజీవ్ బజాజ్ రూ.53.7 కోట్లు, పవన్ ముంజాల్ రూ.80 కోట్లు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణియన్, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఎస్ పరేఖ్ కూడా గౌతమ్ అదానీ కంటే ఎక్కువ వార్షిక వేతనాన్ని తీసుకుంటున్నారు.

గౌతమ్ అదానీ తమ్ముడు, కుమారుడు శాలరీ
గౌతమ్ అదానీ తమ్ముడు రాజేశ్, అదానీ ఎంటర్​ప్రైజెస్ లిమిటెడ్(ఏఈఎల్) నుంచి రూ.8.37 కోట్లు, ఆయన మేనల్లుడు ప్రణవ్ అదానీ రూ.6.46 కోట్ల వార్షిక వేతనాన్ని పొందినట్లు కంపెనీ వార్షిక నివేదికలో తేలింది. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ రూ. 3.9 కోట్ల జీతాన్ని తీసుకున్నారు.

అలాగే అదానీ ఎంటర్​ప్రైజెస్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వినయ్ ప్రకాశ్ రూ.89.37 కోట్ల వార్షిక వేతనాన్ని పొందారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ గ్రూప్ సీఎఫ్ఓ జుగేషీందర్ సింగ్ రూ.9.45 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ వీనీత్ ఎస్ జైన్ రూ.15.25 కోట్లు, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్) సీఈఓ సురేష్ పీ మంగ్లానీ రూ.6.88 కోట్లు, అదానీ విల్మార్ సీఈఓ అంగ్షు మల్లిక్ రూ.5.15 కోట్ల వార్షిక వేతనాన్ని పొందారు.

ముకేశ్ పోటాపోటీ
ఇటీవల విడుదల చేసిన బ్లూమ్‌ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 106 బిలియన్ డాలర్ల సంపదను గౌతమ్ అదానీ కలిగి ఉన్నారు. ఆయన మొదటి స్థానం కోసం ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీతో పోటీ పడుతున్నారు. 2022లో ఆసియాలోనే అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా గౌతమ్ అదానీ నిలిచారు. అయితే అమెరికాకు చెందిన హిండెన్‌ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో కుప్పకూలాయి. దీంతో 150 బిలియన్ల అమెరికా డాలర్ల విలువైన సంపదను అదానీ కోల్పోయారు. మళ్లీ పుంజుకుని ఈ ఏడాది రెండు పర్యాయాలు అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. మళ్లీ ముకేశే అగ్రస్థానాన్ని ఎగరేసుకుపోయారు. 111 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 14వ స్థానంలో నిలిచారు.

డ్రైవింగ్​లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజర్! ఈ రోడ్ సేఫ్టీ టిప్స్ పాటిస్తే హ్యాపీ జర్నీ - Road Safety Tips

ఇక నుంచి ప్రభుత్వ ఆధీనంలో టెలీకమ్యూనికేషన్‌ నెట్​వర్క్​! కొత్త చట్టం అమలు అప్పటినుంచే!

Last Updated : Jun 23, 2024, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.