Asia Richest Person : బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని దాటి ఆయన మొదటి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ మొత్తం ఆస్తుల విలువ 111 బిలియన్ డాలర్లు. ముకేశ్ అంబానీ ఆస్తుల మొత్తం విలువ 109 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రపంచంలోని అత్యంత ధనవంతులు వీరే!
ప్రస్తుతానికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ 11వ స్థానంలో, ముకేశ్ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. ఇంకా ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
- బెర్నార్డ్ ఆర్నాల్ట్ - 207 బిలియన్ డాలర్లు
- ఎలాన్ మస్క్ - 203 బిలియన్ డాలర్లు
- జెఫ్ బెజోస్ - 199 బిలియన్ డాలర్లు
- మార్క్ జుకర్‌బర్గ్ - 166 బిలియన్ డాలర్లు
- లారీ పేజ్ - 153 బిలియన్ డాలర్లు
- బిల్ గేట్స్ - 152 బిలియన్ డాలర్లు
- సెర్గీ బ్రిన్ - 145 బిలియన్ డాలర్లు
- స్టీవ్ బాల్మెర్ - 144 బిలియన్ డాలర్లు
- వారెన్ బఫెట్ - 137 బిలియన్ డాలర్లు
- లారీ ఎలిసన్ - 132 బిలియన్ డాలర్లు
- గౌతమ్ అదానీ - 111 బిలియన్ డాలర్లు
- ముకేశ్ అంబానీ - 109 బిలియన్ డాలర్లు
ముకేశ్ అంబానీని వెనక్కు నెట్టి!
నిన్నటి వరకు ఆసియాలో అత్యంత ఐశ్వర్యవంతుడిగా ముకేశ్ అంబానీ కొనసాగారు. ఆయన వ్యాపారాలు అన్నీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే గౌతమ్ అదానీ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రెక్చర్, లాజిస్టిక్స్ వ్యాపార రంగాల్లో భారీ లాభాలను ఆర్జించారు. అంతేకాదు అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ గణనీయంగా పెరిగాయి. దీనితో ఆయన ముకేశ్ అంబానీని దాటి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.
గౌతమ్ అదానీ వచ్చే పదేళ్లల్లో 90 బిలియన్ డాలర్ల మూలధన వ్యయంతో వ్యాపార విస్తరణ ప్రణాళిక వేస్తున్నారు. దీనితో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా శుక్రవారం జరిగిన ఇంట్రాడేలో అదానీ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.94 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ క్యాపిటలేజేషన్ విలువ రూ.17.51 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.
గతంలో హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్ వ్యాపారంపై అనేక ఆరోపణలు చేసింది. దీనిపై దర్యాప్తు చేయమని సుప్రీంకోర్ట్ ఆదేశించింది కూడా. ఇది గౌతమ్ అదానీకి పెద్ద సవాలుగా మారింది. కానీ ఆయన ఈ అడ్డంకులు అన్నీ దాటుకుంటూ తమ వ్యాపార విస్తరణ చేస్తూనే ఉన్నారు.
మీరు EPF చందాదారులా? ఈ 7రకాల పెన్షన్లు గురించి తెలుసుకోవడం మస్ట్! - Types Of EPFO Pensions
భవిష్యత్‌కు భరోసా కావాలా? ఈ టాప్-5 పెన్షన్ స్కీమ్స్‌పై ఓ లుక్కేయండి! - Top 5 Pension Plans In India