ETV Bharat / business

రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్ కొంటున్నారా? అయితే ఆగండి.. త్వరలో 4 కొత్త మోడల్స్! - UPCOMING ROYAL ENFIELD BIKES

రాయల్ ఎన్​ఫీల్డ్ లవర్స్​కు గుడ్​న్యూస్- త్వరలో మరో నాలుగు కొత్త బైక్​లు!

Royal Enfield
Royal Enfield (Royal Enfield)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 17, 2024, 1:44 PM IST

Upcoming Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బైక్​లు విపరీతమైన డిమాండ్​తో మంచి ప్రాచుర్యం పొందాయి. వీటిలో రాయల్​ ఎన్​ఫీల్డ్ క్లాసిక్​ నుంచి బుల్లెట్ వరకు ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ఈ బైక్స్​కు పెరుగుతున్న ప్రజాదరణ దృష్ట్యా కంపెనీ మరో నాలుగు రాయల్ ఎన్​ఫీల్డ్ బైకులు తీసుకొచ్చేందుకు రెడీ అయింది.

చెన్నైకు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే 350cc, 450cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్లలో విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు 650cc పై ఫోకస్ చేసింది. ఇప్పటికే ఈ విభాగంలోని 'ఇంటర్‌సెప్టర్ 650', 'కాంటినెంటల్ GT 650', 'షాట్‌గన్ 650', ఇటీవలే లాంఛ్ అయిన 'బేర్ 650' వంటి బైక్స్ సేల్స్​లో టాప్​ గేర్​లో దూసుకుపోతున్నాయి. దీంతో కంపెనీ ఈ సెగ్మెంట్​లో ​కనీసం మరో నాలుగు మోటార్ సైకిళ్లను అయినా రిలీజ్ చేయాలని భావిస్తోంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ అప్​కమింగ్ బైక్స్ ఇవే!:

  • రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 650
  • రాయల్ ఎన్​ఫీల్డ్ బుల్లెట్ 650
  • రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 650
  • 2025 రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650

1. Royal Enfield Classic 650: 'క్లాసిక్ 350'' మోటార్​సైకిల్ అత్యధికంగా అమ్ముడవటంతో కంపెనీ ఇప్పుడు క్లాసిక్ 650ని భారత మార్కెట్‌కు పరిచయం చేయాలని యోచిస్తోంది. దీని హార్ట్​వేర్​లను 'షాట్‌గన్ 650' మోడల్​ నుంచి తీసుకున్నారు. కానీ దీని స్టైలింగ్​ను మాత్రం 'క్లాసిక్ 350' నుంచి తీసుకున్నారు. రాయల్​ ఎన్​ఫీల్డ్ 'క్లాసిక్ 350' ఇప్పటి వరకు ఈ బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్.

సమాచారం ప్రకారం.. ఈ అప్​కమింగ్ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650' మోడల్ 648cc ప్యారలల్- ట్విన్ ఇంజిన్ పవర్​ట్రెయిన్​తో వస్తుంది. ఇది గరిష్టంగా 47.4 bhp పవర్​, 52.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కంపెనీ ఈ బైక్​ను 2025 ఫస్ట్ క్వార్టర్​లో ప్రారంభిస్తుందని తెలుస్తోంది.

2. Royal Enfield Bullet 650: ఈ 'బుల్లెట్ 650' మోటార్​ సైకిల్​ను రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. అదిరే ఫీచర్లతో కంపెనీ దీన్ని తీసుకురానుంది. ఇది 'షాట్‌గన్ 650', 'సూపర్ మెటోర్ 650' మాదిరిగానే అదే ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 2025 మధ్యలో మన దేశంలో విడుదల అవుతుంది.

దీని డిజైన్ 'బుల్లెట్ 350', రిలీజ్​కు రెడీగా ఉన్న 'క్లాసిక్ 650' ఆధారంగా ఉంటుంది. ఇది వైర్-స్పోక్ వీల్స్‌పై నడుస్తుంది. కానీ దీనికి అల్లాయ్ వీల్స్ లేవు. ఈ 'రాయల్ ఎన్​ఫీల్డ్ బుల్లెట్ 650' బైక్​లో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, పాపులర్ 648cc ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది.

3. Royal Enfield Himalayan 650: రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి ఓ ఖరీదైన కొత్త బైక్ కొనాలి అనుకునేవారికి 'హిమాలయన్ 650' బెస్ట్ ఆప్షన్. వచ్చే ఏడాది దీన్ని లాంఛ్ చేయొచ్చు. ఇనీషియల్​గా 'R2G' కోడ్ నేమ్​తో ఈ బైక్​ కంపెనీ వచ్చే ఏడాది రిలీజ్ చేసే బిగ్గెస్ట్ బ్రాండ్​ అవుతుంది. ఇది ఇంటర్‌సెప్టర్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 2025 పండుగ సీజన్‌లో (అక్టోబర్ - నవంబర్) ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.

సమాచారం ప్రకారం.. దీనిలో USD ఫ్రంట్ ఫోర్క్స్, స్ప్లిట్-సీట్ సెటప్, స్పోక్-వీల్స్, సైడ్-స్వీప్ట్ ఎగ్జాస్ట్ పైప్ వంటి వివరాలు రిలీల్ అయ్యాయి. దీని స్టైలింగ్ 'హిమాలయన్ 450' నుంచి తీసుకుంటారని తెలుస్తోంది. ఈ బైక్​ అదే 648cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 'హిమాలయన్ 650' దేశంలో విడుదలైన తర్వాత అత్యంత ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్​గా నిలవనుందని సమాచారం.

4. 2025 Royal Enfield Interceptor 650: రాయల్ ఎన్‌ఫీల్డ్.. 'ఇంటర్‌సెప్టర్ 650' బైక్ అప్​డేట్ వెర్షన్​ను సిద్ధం చేస్తోంది. ఈ బైక్ చాలా ఏళ్లుగా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో దీని స్థానాన్ని అలానే నిలుపుకొనేందుకు దీనికి అప్​డేట్ వెర్షన్ తీసుకురావడం అవసరం అని కంపెనీ భావిస్తోంది. '2025 ఇంటర్‌సెప్టర్' బైక్​ను అనేక కాస్మెటిక్ మార్పులతో పాటు సరికొత్త ఫీచర్లను తీసుకురానున్నారు. కంపెనీ దీని కొత్త సస్పెన్షన్ సెటప్, బ్రేక్ యూనిట్లను వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఈ మోడల్​లో ఉన్న అదే 648cc ఇంజిన్​ను ఈ కొత్త బైక్​లో కూడా తీసుకురానున్నారు.

ఎటు చూసినా ఏఐ- స్మార్ట్​ఫోన్ మార్కెట్లోనూ హవా- ఈ ఏడాది లాంఛ్ అయిన టాప్ మోడల్స్ ఇవే!

6000mAh బ్యాటరీ ప్యాక్​తో 5G ​ఫోన్- నీటిలో పడినా ఏం కాదంట.. ధర కూడా రూ.15వేల లోపే!

మెర్సిడెస్​ నుంచి లగ్జరీ 5-సీటర్ బెంజ్ - దేశంలోనే ఏ EVకి లేనంత అతిపెద్ద సెల్ కెపాసిటీతో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.