ETV Bharat / business

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టూ-వీలర్​ నడపాలా? ఈ టాప్​-7 ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఓ లుక్కేయండి! - EV Scooter Without Registration

EV Scooters Without Driving Licence : మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? కానీ టూ-వీలర్ నడపాలని ఆశగా ఉందా? అయితే ఇది మీ కోసమే. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టాప్-7​ ఈ-స్కూటర్లపై ఓ లుక్కేద్దాం రండి.

ev Scooters Without Driving Licence
Electric Scooters Which Ride Without Driving Licence
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 4:12 PM IST

EV Scooters Without Driving Licence : భారతదేశంలో టూ-వీలర్స్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్త్రీ, పురుషులు; చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టూ-వీలర్స్ నడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీటితో మెయిన్​ రోడ్లపైనే కాదు, చిన్నచిన్న సందుల్లోనూ చాలా సులువుగా వెళ్లిపోవచ్చు. కానీ వీటిని డ్రైవ్ చేయాలంటే కచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఎందుకంటే భారత్​లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధం. అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా నడపగలిగే కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్లు ఉన్నాయి.

ఈ ఈవీ స్కూటర్లు తక్కువ ధరకే లభిస్తాయి. పైగా మెయింటెనెన్స్​ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ ఈవీ స్కూటర్ల గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ వరకు ఉంటుంది. కనుక వీటిని డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా నడుపుకోవచ్చు. మరి మీకు కూడా ఇలాంటి స్కూటర్ కొనాలని ఆశగా ఉందా? మరెందుకు ఆలస్యం భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టాప్​-7 ఈవీ స్కూటర్లపై ఓ లుక్కేద్దాం రండి.

1. Komaki XGT KM : కొమాకి ఎక్స్​జీటీ కేఎం అనేది ఒక ఫ్యామిలీ స్కూటర్​. దీనిలో ట్యూబ్​లెస్ టైర్స్​, డిస్క్ బ్రేక్​ ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో డిజిటల్ డిస్​ప్లే సిస్టమ్ ఉంది. కనుక ఈ స్కూటీ చూడడానికి చాలా స్టైలిష్​గా, ట్రెండీగా కనిపిస్తుంది. స్కూటర్​లో 20-30Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంది. దీనిని ఫుల్​ ఛార్జ్ చేస్తే 85 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. మార్కెట్లో ఈ కొమాకి ఎక్స్​జీటీ కేఎం స్కూటర్​ ధర సుమారుగా రూ.56,890 నుంచి రూ.93,045 (ఎక్స్-షోరూం ధర) ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Okinawa R30 : ఈ ఒకినావా ఆర్​30 స్కూటర్​లో 1.25kWh లిథియం ఐయాన్​ బ్యాటరీ ఉంటుంది. దీనికి మూడేళ్ల వారెంటీ ఇస్తారు. దీన్ని ఫుల్​ ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. దీని డ్రైవింగ్ రేంజ్​ 60 కి.మీ ఉంటుంది. దీని టాప్​ స్పీడ్ గంటకు​ 25 కి.మీ. ఈ స్కూటర్​ 5 కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీనికి ముందు వెనుక భాగాల్లో డ్రమ్​ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.61,998 (ఎక్స్-షోరూం ధర) ఉంటుంది.

3. Hero Electric Flash : ఈ హీరో ఎలక్ట్రిక్​ ఫ్లాష్​ స్కూటర్​లో 250 వాట్​ BLDC హబ్​ మోటార్ ఉంది. దీనితో గరిష్ఠంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. దీనిలో 28Ah లెడ్​-అసిటేట్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఫుల్​ ఛార్జ్ చేస్తే 50 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. ఇది రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ స్కూటర్ ధర సుమారుగా రూ.59,640 (ఎక్స్-షోరూం ధర) వరకు ఉంటుంది.

4. Kinetic Zing : ఈ కైనెటిక్ జింగ్​ స్కూటర్​లో 22Ah బ్యాటరీ ఉంటుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్​ వరకు డ్రైవ్ చేయవచ్చు. ఇది మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.71,990 నుంచి రూ.84,990 (ఎక్స్-షోరూం ధర) వరకు ఉంటుంది.

5. Hero Eddy : ఈ హీరో ఎడ్డీ స్కూటర్​లో 30Ah బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. ఈ రైడింగ్ రేంజ్​ 85 కి.మీ. ఈ బైక్​ను రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.72,000 (ఎక్స్-షోరూం ధర) ఉంటుంది.

6. Deltic Drixx : ఈ డెల్టిక్ డ్రిక్స్​ స్కూటర్​లో 1.58 కిలోవాట్స్​ పవర్ ఉన్న బ్యాటరీ ఉంది. దీని డ్రైవింగ్ రేంజ్​ 70 కి.మీ - 100 కి.మీ ఉంటుంది. దీనితో గరిష్ఠంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.58,490 నుంచి రూ.84,990 (ఎక్స్-షోరూం ధర) వరకు ఉంటుంది.

7. Okinawa Lite : ఈ ఒకినావా లైట్​ స్కూటర్​లో 1.25kWh రిమూవబుల్​ లిథియం-ఐయాన్ బ్యాటరీ ఉంది. దీనికి 3 సంవత్సరాల వారెంటీ ఉంటుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. దీని డ్రైవింగ్ రేంజ్​ 60 కి.మీ. ఈ స్కూటర్​ 5 కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.74,999 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

మీ కారు ఇంటీయర్​ను క్లీన్ చేసుకోవాలా? ఈ 5-సింపుల్ టిప్స్​ పాటిస్తే చాలు!

తక్కువ బడ్జెట్లో మంచి డీజిల్ కారు కొనాలా? ఈ టాప్​-10 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.