ETV Bharat / business

EPFO UAN యాక్టివేషన్‌ అలర్ట్​- నెల జీతం ఫ్రీగా రావాలంటే అలా చేయాల్సిందే! - EPFO UAN ACTIVATION

UAN యాక్టివేషన్‌, బ్యాంక్‌ అకౌంట్‌ లింక్​ గడువు పెంపు

EPFO UAN Activation
EPFO UAN Activation (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2024, 2:39 PM IST

EPFO UAN Activation : ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతా ఉన్నవారికి అలర్ట్‌. యూఏఎన్‌ (UAN) యాక్టివేషన్‌, బ్యాంక్‌ అకౌంట్​తో ఆధార్‌ సీడింగ్​​కు సంబంధించిన గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారి యూఏఎన్‌ యాక్టివ్‌గా ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అలాగే ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్(ELI) స్కీమ్ బెనిఫిట్స్ పొందేందుకు యూఏఎన్ యాక్టివ్‌లో ఉంచుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఈఎల్ఐ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈఎల్ఐ పథకం అంటే ఏమిటి?
కేంద్ర బడ్జెట్ 2023-24లో ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఉద్యోగుల ఆధార్​తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్​కు నేరుగా నగదు బదిలీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

నెల వేతనం ప్రోత్సాహకం
ఇటీవల బడ్జెట్‌లో మూడు ఈఎల్‌ఐ పథకాలను కేంద్రం ప్రకటించింది. స్కీం- ఏ లో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారిని ఈపీఎఫ్‌ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి, వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. దీన్ని రూ.15 వేల వరకు మూడు వాయిదాల్లో ఇస్తారు. దీనికి గరిష్ఠంగా నెలకు రూ.లక్షలోపు వేతనం ఉన్నవారే అర్హులు.

ఉద్యోగి, కంపెనీకి ప్రయోజనం
అలాగే, స్కీం-బీలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి, యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరేవారికి, వారి యజమానులకు కూడా తొలి నాలుగేళ్లపాటు నిర్ధరిత వేతన స్కేళ్లలో ఈపీఎఫ్‌లో చందాలను ప్రోత్సాహకంగా అందిస్తారు. ఉద్యోగంలో చేరిన రెండో ఏడాది 24 శాతం వేతనం, మూడో ఏడాది 16 శాతం, నాలుగో ఏడాది 8 శాతం వేతనాన్ని ప్రోత్సహకంగా ఇస్తారు.

కంపెనీలకు ప్రోత్సాహకం
ఇక స్కీమ్-సీని ఎక్కువగా కంపెనీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అన్ని రకాల సెక్టార్లలో ఉద్యోగాల కల్పనకు కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. రెండు సంవత్సరాల వరకు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ కంట్రిబ్యూషన్​ను ప్రభుత్వమే చెల్లించనుంది. దీన్ని నెలకు మూడు వేల రూపాయలకు పరిమితి చేశారు.

యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి!
ఈఎల్ఐ పథకం ప్రయోజనాలు పొందేందుకు ఈఫీఎఫ్ఓ చందాదారులు తమ యూఏఎన్​ను యాక్టివేట్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈఎల్ఐ స్కీమ్ అమలు తేదీ ఇంకా కచ్చితంగా తెలియకపోవడం వల్ల ఇంకా పోర్టల్ ఏర్పాటు కాలేదని చెప్పుకొచ్చారు.

అర్హులైన ఈపీఎఫ్ఓ చందాదారులు యూఏఎన్‌ యాక్టివేషన్‌, బ్యాంక్‌ అకౌంట్‌తో ఆధార్‌ సీడింగ్‌ చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు ఏవైనా సందేహాలు వస్తే యాజమాన్యంతో మాట్లాడాలని పేర్కొన్నారు. అలాగే ఈపీఎఫ్ఓ ​​కార్యాలయాన్ని సందర్శించవచ్చని తెలిపారు.

ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- EPFO గరిష్ఠ వేతన పరిమితి రూ.21 వేలకు!

మీ పీఫ్ అకౌంట్​లో డబ్బు ఎంత ఉందో తెలుసుకోవాలా?- ఒక్క క్లిక్​తో చెక్ చేసుకోండిలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.