ETV Bharat / business

ఆ ఎక్స్ యూజర్స్​కు ఎలాన్​ మస్క్ బంపర్​ ఆఫర్​-​ ప్రీమియం ఫీచర్లన్నీ ఫ్రీ! - elon musk - ELON MUSK

Elon Musk Announcement : 2500+ సబ్​స్క్రైబర్స్​ను కలిగిన ఎక్స్​ క్రియేటర్స్​కు బంపర్​ ఆఫర్​ ప్రకటించారు ఆ సంస్థ అధినేత ఎలాన్​ మస్క్​. 2500కుపైగా వెరిఫైడ్​ సబ్​స్క్రైబర్స్​ ఉన్న క్రియేటర్లు ఇక నుంచి ఉచితంగానే ప్రీమియం ఫీచర్స్​ను వాడుకోవచ్చని తెలిపారు.

Elon Musk Announcement
Elon Musk Announcement
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 11:32 AM IST

Updated : Mar 28, 2024, 12:49 PM IST

Elon Musk Announcement : టెస్లా, ఎక్స్​ (ట్విట్టర్​) అధినేత ఎలాన్​ మస్క్ ఎక్స్​ యూజర్లకు​ గుడ్​న్యూస్​ చెప్పారు. 2500+ సబ్​స్క్రైబర్స్​ను కలిగి ఉన్న ఎక్స్​ క్రియేటర్స్​ ఇక నుంచి ప్రీమియం ఫీచర్స్​ను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా​లో ఓ పోస్టు పెట్టారు. దీని ప్రకారం 2500 కంటే ఎక్కువ మంది వెరిఫైడ్​ సబ్​స్క్రైబర్స్​ ఉన్న ఎక్స్​ క్రియేటర్లు ఎటువంటి ఫీజులు చెల్లించకుండానే ఈ ప్రీమియం ఫీచర్స్​ను వాడుకోవచ్చు. అంతేకాకుండా 5వేలకుపైగా ఫాలోవర్స్​ను కలిగి ఉన్న యూజర్స్​కు ప్రీమియం+ ఫీచర్స్​ను ఫ్రీగా అందిచనున్నట్లు ప్రకటించారు.

అధిక సబ్​స్క్రైబర్లు, ఫాలోవర్లు కలిగిన ఎక్స్​ వినియోగదారులు మంచి కంటెంట్​ను తమ ఖాతాల్లో అందించే విధంగా ఈ తాజా ప్రకటన దోహదం చేస్తుందని టెక్​ నిపుణులు అంటున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకే ఎలాన్​ మస్క్​ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఎక్స్​లో విస్తృతమైన ప్రీమియం, ప్రీమియం+ ఫీచర్స్​ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వాడాలనుకునే క్రియేటర్స్​ ఇంతకుముందు సంస్థ నిర్దేశించిన కొంత రుసుమును చెల్లించి వినియోగించుకోవాల్సి వచ్చేది.

ప్రీమియం ఫీచర్స్​ వివరాలివీ!

  • ఈ ప్రీమియం టూల్స్​ను ఎక్స్​ క్రియేటర్స్​, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, యూజర్‌లు​ కంటెంట్​ క్రియేషన్​, మానిటైజేషన్​ కోసమే కాకుండా మెరుగైన కమ్యునికేషన్​ కోసం కూడా వాడతారు.
  • ఎక్స్​లోని ప్రీమియం టైర్​ ఫీచర్​ ఎడిట్​ పోస్ట్​ లాంటి​ వెసులుబాటును కల్పిస్తుంది. ఈ ఫీచర్​ సాయంతో తాము అప్లోడ్​ చేసిన కంటెంట్​ను ఎడిట్​ చేయాలనుకునే క్రియేటర్లు గంటలోపే దానిలో పరిమితంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఈ ఫీచర్ల ద్వారా సబ్‌స్క్రైబర్‌లు ట్రెడిష్నల్​ క్యారెక్టర్​ లిమిట్​ను పెంచుకోవచ్చు. 25,000 క్యారెక్టర్లతో కూడిన సుదీర్ఘ పోస్టును క్రియేట్​ చేసుకోవచ్చు. వివరణాత్మకమైన కంటెంట్​ను యూజర్స్​కు అందించేందుకు వీలుగా ఈ ఫీచర్​ ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ప్రీమియం యూజర్లు సుదీర్ఘమైన వీడియోలను అప్‌లోడ్​ చేసేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడతాయి. దాదాపు మూడు గంటల వ్యవధి, 8GB సైజ్​ కలిగిన కంటెంట్​ను పోస్ట్​ చేయవచ్చు.
  • ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు ఎక్స్​లో ప్రత్యేక కమ్యునిటీలను క్రియేట్​ చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు. ఒకేవిధమైన ఆలోచనలు, వైఖరిని కలిగిన వ్యక్తులను వీరు తమ కమ్యునిటీలో జాయిన్​ చేసుకోవచ్చు.
  • ఇవే కాకుండా బ్లూ చెక్​మార్క్​ వెరిఫికేషన్​, అథెంటిసిటీ సైనిఫైయింగ్​, క్రెడిబిలిటీ సహా మరెన్నో ప్రత్యేక ప్రయోజనాలను ఈ ప్రీమియం, ప్రీమియం+ ఫీచర్స్​ ద్వారా పొందవచ్చు.

యూట్యూబ్​కు పోటీగా X వీడియోస్​ - నో సెన్సార్ - వారికి మాత్రమే ప్రత్యేకం!

గుడ్​ న్యూస్​ - 'X' ప్రీమియం యూజర్లకు​ త్వరలోనే 'గ్రోక్'​ ఏఐ యాక్సెస్​! - Grok AI For All X Premium Users

Last Updated : Mar 28, 2024, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.