Credit Card Terms To Be Aware Of : మీరు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తుంటే, ప్రతి నెలా దాని ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్ వస్తుంది. దానిలో చాలా వివరాలు ఉంటాయి. అయితే ఈ స్టేట్మెంట్లోని టెర్మినాలజీ చాలా మందికి అర్థం కాదు. మరికొందరు ఉంటారు - వారికి క్రెడిట్ కార్డ్ నిబంధనలు, షరతులపై కూడా సరైన అవగాహన ఉండదు. దీని వల్ల కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. అందుకే ఈ ఆర్టికల్‌లో క్రెడిట్ కార్డ్ టెర్మ్స్ అండ్ కండిషన్స్, ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లోని టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం.
Important Credit Card Terms :
- వార్షిక రుసుము (Annual Fee) - క్రెడిట్ కార్డుల్ని వాడాలంటే జాయినింగ్ ఫీజుతో పాటు, రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడినా, వాడకపోయినా ఏడాదికొకసారి వార్షిక రుసుములు చెల్లించాల్సిందే.
- లైఫ్ టైమ్ ఫ్రీ - లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌లపై ఎలాంటి వార్షిక రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- ఫీజు మినహాయింపు (Fee Waiver ) - బ్యాంకులు ప్రమోషనల్ క్యాంపైన్స్ చేసేటప్పుడు, తమ కార్డ్ హోల్డర్లకు కొంత కాలం పాటు వార్షిక రుసుములు లేకుండా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. దీనినే (ఫీ వేవర్) అంటారు.
- యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (APR) - క్రెడిట్ కార్డ్‌పై మీరు తీసుకున్న అప్పుకు విధించేదే వార్షిక వడ్డీ రేటు. క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు విధించే అదనపు రుసుములు లేదా ఛార్జీలు కూడా ఇందులో ఉంటాయి.
- వడ్డీ రేటు - క్రెడిట్ కార్డ్ బకాయిలపై ఈ వడ్డీ రేటును వసూలు చేస్తారు.
- క్రెడిట్ లిమిట్ - బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు జారీ చేసిన క్రెడిట్ కార్డ్‌పై నిర్దష్ఠ మొత్తం పరిమితిని విధిస్తాయి. మీరు అంత వరకు మాత్రమే వాడుకోగలుగుతారు. దీనినే క్రెడిట్ కార్డ్ లిమిట్ అంటారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ లిమిడ్ రూ.50,000 ఉంటే, మీరు అంత వరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు. స్థిరమైన ముందస్తు చెల్లింపుల కారణంగా మీ క్రెడిట్ స్కోరు మెరుగుపడినప్పుడు కార్డు జారీ సంస్థ మీ క్రెడిట్ పరిమితిని పెంచొచ్చు. ఇది మీకు ఎక్కువ ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. కార్డును గతం కంటే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. క్యాష్ లిమిట్ కూడా పెరుగుతుంది. ప్రీ అప్రూవ్ రుణాలు వేగంగా లభిస్తాయి.
- అందుబాటులో ఉన్న క్రెడిట్ (Available Credit) - ప్రతి క్రెడిట్ కార్డుకూ గరిష్ఠ వినియోగ పరిమితి ఉంటుంది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఆ మేరకే దాన్ని వినియోగించేందుకు వీలవుతుంది. ఉదాహరణకు మీరు మొత్తం రూ.5 లక్షల క్రెడిట్ పరిమితిని కలిగి ఉన్నారు. అందులో మీరు మీ బిల్లింగ్ సైకిల్ మొదటి రెండు వారాల్లో రూ.2 లక్షలను వాడారు. మిగిలిన బిల్లింగ్ సైకిల్ కోసం బిల్లు జనరేట్ అయ్యే వరకు మీ కార్డులో రూ.3 లక్షలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
- బిల్లు గడువు తేదీ (Payment Due Date) - గడువు తేదీ లోపే మీ క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించాలి. లేదంటే ఫైన్ లేదా అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అందుకే గడువు తేదీ లోపే క్రెడిట్ కార్డు బిల్లలు చెల్లించడం బెటర్.
- బకాయి ఉన్న కనీస మొత్తం (MAD) - బిల్లు చెల్లింపు సమయంలో కనీస చెల్లింపు చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది బిల్లు మొత్తంలో 5శాతం వరకు ఉంటుంది.
- ఆలస్య చెల్లింపు రుసుము (Late Payment Fee) - మీరు ఇచ్చిన గడువులోగా మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేకపోతే, కార్డును జారీ చేసే సంస్థలు ఆలస్య చెల్లింపు రుసుమును విధిస్తాయి.
- రివార్డ్స్ - క్రెడిట్ కార్డులతో లావాదేవీ జరిపినట్లయితే కొద్ది కాలం వరకు బిల్లు చెల్లించడానికి గడువుండడమే కాకుండా రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి. ఎన్ని పాయింట్లు వస్తాయనేది మనం చేసే లావాదేవీలపై ఆధారపడి ఉంటుంది.
- ట్రాన్సాక్షన్ డేట్ - ఇది మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి పేమెంట్ చేసిన తేదీని ట్రాన్సాక్షన్ డేట్ అంటారు.
- ట్రాన్సాక్షన్ డిస్క్రిప్షన్ - ఇందులో మీ క్రెడిట్ కార్డుపై జరిపిన లావాదేవీల వివరాలు ఉంటాయి. మర్చెంట్ పేరు, లొకేషన్, టైమ్, ఆర్థిక లావాదేవీల విలువ మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.
- గ్రేస్ పీరియడ్ - బిల్లింగ్ సైకిల్ ముగింపు తేదీకి, బకాయి చెల్లించడానికి ఉన్న గడువుకు మధ్య ఉన్న కాలమే గ్రేస్ పీరియడ్. ఈ సమయంలో మీరు వాడుకున్న క్రెడిట్‌పై ఎలాంటి వడ్డీ పడదు. అలాగే ఈ సమయంలో మీ బకాయి మొత్తం తీర్చేస్తే, కొత్తగా కొనుగోలు చేసిన వాటిపై కూడా వడ్డీ పడదు.
రూ.1లక్ష బడ్జెట్లో మంచి స్కూటర్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Scooters Under 1 Lakh