Cars Under 10 Lakhs : ప్రస్తుత కాలంలో ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! ఎందుకంటే బైక్‌పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లలేరు. ఈ క్రమంలో ఇండియా మార్కెట్లో రూ.10 లక్షల బడ్జెట్లో మంచి కార్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. Tata Nexon :
- మైలేజ్- 17.01 kmpl
- ఇంజిన్- 1199 సీసీ
- ఫ్యూయల్ టైప్- పెట్రోల్, డీజిల్, సీఎన్ జీ
- ట్రాన్స్మిషన్- మాన్యువల్ & ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ- 5
- Tata Nexon కార్ల ఎక్స్ షోరూమ్ ధర- రూ. 8.15- 15.80 లక్షలు
- ఫీచర్లు : టాటా నెక్సాన్ మోడల్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఈ కారుకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. స్ట్రాంగ్ మిడ్ రేంజ్, హై స్పీడ్ స్టెబిలిటీ, ఫ్లెక్సిబుల్ గేర్‌బాక్స్ ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Maruti Brezza :
- మైలేజ్- 19.05 kmpl
- ఇంజిన్- 1462 సీసీ
- ఫ్యూయల్ టైప్- పెట్రోల్, సీఎన్ జీ
- ట్రాన్స్ మిషన్- మాన్యువల్ & ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ- 5
- Maruti Brezza ఎక్స్ షోరూమ్ ధర-రూ. 8.34 - 14.14 లక్షలు
- Maruti Brezza ఫీచర్లు : ఇంటీరియర్ బాగుంటుంది. సామాన్లు పెట్టుకోవడానికి తగిన ప్లేస్ ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Maruti Ertiga :
- మైలేజ్- 20.3 kmpl
- ఇంజిన్- 1462 సీసీ
- ఫ్యూయల్ టైప్- పెట్రోల్, సీఎన్ జీ
- ట్రాన్స్ మిషన్- మాన్యువల్ & ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ- 7
- Maruti Ertiga ఎక్స్ షోరూమ్ ధర- రూ.8.69 - 13.03 లక్షలు
- Maruti Ertiga ఫీచర్లు : పెద్ద, సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ ఎక్కువ. ఈ కారుకు 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Mahindra Bolero :
- మైలేజ్- 15.83 kmpl
- ఇంజిన్- 1493 సీసీ
- ఫ్యూయల్ టైప్- డీజిల్
- ట్రాన్స్ మిషన్- మాన్యువల్
- సీటింగ్ కెపాసిటీ- 7
- Mahindra Bolero ఎక్స్ షోరూమ్ ధర- రూ.9.90 - 10.91 లక్షలు
- Mahindra Bolero ఫీచర్లు : ఇప్పటికే ఈ మోడల్ సక్సెస్ అయింది. సీటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Hyundai i20 N Line :
- మైలేజ్- 14.6 kmpl
- ఇంజిన్- 998 సీసీ
- ఫ్యూయల్ టైప్- పెట్రోల్
- ట్రాన్స్ మిషన్- మాన్యువల్, ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ- 5
- Hyundai i20 N Line ఎక్స్ షోరూమ్ ధర- రూ. 9.99 - 12.52 లక్షలు
- Hyundai i20 N Line ఫీచర్లు : ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. కారు చూడడానికి స్టైలిష్ లుక్‌లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అదిరే ఫీచర్స్‌తో - 2024-25లో లాంఛ్ కానున్న మారుతి కార్స్ ఇవే! ధర ఎంతంటే?
అతి త్వరలో లాంఛ్ కానున్న టాప్-5 SUV కార్స్ ఇవే! ధర ఎంతంటే?