Car Reverse Driving will Affect Engine? : కారులో రివర్స్ గేర్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన నాలుగు గేర్లూ కారును ముందుకు నడిపిస్తాయి. కానీ.. ఐదో గేర్ మాత్రమే వెనక్కు నడిపిస్తుంది. మరి.. ఈ గేరును తరచూ వాడం మంచిదేనా? అనే ప్రశ్నకు డ్రైవింగ్‌లో చాలా అనుభవం ఉన్నవారు సైతం బలంగా "అవును" అని చెప్పలేరని అంటారు మోటార్ నిపుణులు. మరి.. నిజంగా ఏం జరుగుతుంది? రివర్స్ డ్రైవింగ్ కారుకు మంచిదా? కాదా??
రివర్స్ గేరులో కారును నడిపిస్తున్నప్పుడు.. చాలా స్లోగా వెనక్కి కదులుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఫస్ట్ గేర్‌తో సమానం. ఫస్ట్ గేర్‌లో కారు ముందుకు చాలా తక్కువ వేగంతోనే వెళ్తుంది. రివర్స్ గేర్‌లో కూడా ఇదేవిధంగా తక్కువ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. మరి.. ఈ గేర్ ఎక్కువగా వినియోగిస్తే కారు ఇంజిన్‌కు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని ప్రశ్నిస్తే.. నేరుగా దానిపై పెద్దగా ప్రభావం ఏమీ పడదని నిపుణులు చెబుతున్నారు. కానీ.. ఇతర సమస్యలు తలెత్తి, అవి పరోక్షంగా ఇంజిన్‌పై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు.
ముందుకు ఎంత వేగంగా వెళ్లినా..
కారు గేర్లలోని మొదటి నాలుగూ.. వాహనాన్ని ముందుకు నడిపిస్తాయి. ప్రతి గేరూ వాహనం మరింత స్మూత్‌గా పరిగెత్తేందుకు సహకరిస్తాయి. వివిధ రకాల రోడ్లకు అనుగుణంగా ఇంజన్ నుండి వచ్చే అధిక పవర్‌ను బైఫర్కేట్ చేసి.. ఆయా గేర్ల ద్వారా పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైన పవర్‌ను చక్రాలకు పంపిస్తాయి. కానీ.. రివర్స్ గేర్ టార్గెట్ కారును వెనక్కి నడపడం. ఈ సమయంలో ఇంజన్ నుండి వచ్చే అధిక పవర్, టార్క్‌ను కొంతమేర మాత్రమే చక్రాలకు సరఫరా అవుతుంది.
కాబట్టి.. అవసరం లేనిచోట కూడా పదే పదే రివర్స్ గేర్ ఉపయోగిస్తే.. క్లచ్ ప్లేట్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉందట. ఇక రివర్స్ గేర్‌లో కారు నెమ్మదిగా కదులుతుంది కాబట్టి.. నార్మల్ టైమ్లోకన్నా ఎక్కువగా ఇంజన్ హీట్ అవుతుందట. ఈ పరిస్థితి కారు ఇంజన్‌కు మంచిది కాదని చెబుతున్నారు.
గాలి ప్రవాహం..
కారు ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు.. గాలి ప్రవాహం దానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అందువల్ల ఇంజన్ వేడి ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. కానీ.. రివర్స్ గేర్‌లో వాహనం వెనక్కి ప్రయాణిస్తుంది కాబట్టి.. ఇంజన్ వైపునకు ఎయిర్ ఫ్లో ఉండదు. ఫలితంగా.. ఇంజన్ RPM ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇంజన్ ఓవర్ హీట్ అయిపోతుంది. ఇలా.. తరచూ ఇంజన్ వేడెక్కడం వల్ల ఇంజన్ లోపల పిస్టన్ రింగ్స్, పిస్టన్ పిన్, ఇంకా క్యామ్ షాప్ట్ వంటి పార్ట్స్ దెబ్బతింటాయని చెబుతున్నారు.
సో.. ఏ విధంగా చూసినా కారు ముందుకు వెళ్లేటప్పుడు ఇంజిన్‌పై పడే ఒత్తిడి కన్నా.. వెనక్కు వెళ్లేటప్పుడు పడే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల వీలైనంత వరకూ రివర్స్ గేర్ వాడకుండా చూసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా రివర్స్ గేర్ వాడకుండానే ముందుకు వెళ్లి కారు తిప్పుకుని వచ్చేలా చూసుకుంటే ఇంజన్ పదికాలాలపాటు హెల్దీగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.