ETV Bharat / business

మీ కారు మైలేజ్ పెరగాలా? ఈ టాప్​-8 టిప్స్ మీ కోసమే! - How To Imporve Car Mileage

Car Mileage Increasing Tips : పెట్రోల్, డీజిల్ ధరలు వివరీతంగా పెరుగుతున్నాయి. అందుకే చాలా మంది తమ కారు మైలేజ్ ఇంకొంచెం పెరిగితే బాగుంటుందని ఆశిస్తూ ఉంటారు. అందుకే ఈ ఆర్టికల్​లో కార్ మైలేజ్ పెంచే టాప్​-8 టిప్స్​ గురించి తెలుసుకుందాం.

How to imporve car mileage
Car Mileage Increasing Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 3:52 PM IST

Car Mileage Increasing Tips : పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న ఈ కాలంలో, మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనుగోలు చేయడం చాలా మంచిది. కొనాల‌నుకుంటాం. బ‌డ్జెట్ కాస్త ఎక్కువైనా మంచి ఇంధ‌న సామ‌ర్థ్యం క‌లిగిన వాహ‌నం కొనుగోలు చేయడమే బెటర్​గా ఉంటుంది. అంతేకాదు కారు డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్​ పాటిస్తే చాలు, మీ కారు మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. స్టడీ స్పీడ్​ కొనసాగించాలి!
చాలా మంది కార్లో విపరీతమైన వేగంతో వెళ‌్తుంటారు. మరికొందరు చాలా స్లోగా వెళ్తుంటారు. కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల ఎక్కువగా ఇంధ‌నం ఖ‌ర్చ‌వుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేట‌ప్పుడు ఒక స్థిర‌మైన వేగాన్ని పాటించాలి. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, ఓపెన్ రోడ్లపై వెళుతున్నప్పుడు, వీలైన‌ప్పుడల్లా క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించాలి.

2. అద‌న‌పు బ‌రువు తొల‌గించాలి!
అద‌న‌పు బ‌రువు ఇంధ‌న వినియోగాన్ని పెంచుతుంది. కాబ‌ట్టి మీరు ప్ర‌యాణం చేసేటప్పుడు, మీ వాహ‌నంలో ఏవైనా బ‌రువైన, అవ‌స‌రం లేని వ‌స్తువులుంటే, వాటిని తీసేయాలి. హైవేల‌పై వెళ్లేట‌ప్పుడు అవ‌స‌రం లేకపోతే విండోస్, రూఫ్​టాప్​ల‌ను క్లోజ్ చేయాలి.

3. టైర్లలో స‌రిప‌డా గాలి ఉండేలా చూసుకోవాలి!
టైర్ల‌లో ఎప్పుడూ స‌రిపడా గాలి ఉండేలా చూసుకోవాలి. త‌క్కువ గాలి ఉంటే ఘర్షణ ఎక్కువగా ఉండి, టైర్ వేగంగా తిరగదు. దీని వల్ల కారు న‌డ‌వడానికి అధిక ఇంధ‌నం కావాల్సి వస్తుంది. కనుక ఎప్పటిక‌ప్పుడు మీ కారు టైర్ల ప్రెజర్​ను చెక్ చేసుకుంటూ ఉండాలి. కంపెనీ సిఫార్సుల మేర‌కు టైర్లలో ఎయిర్​ ప్రెజర్​ను మెయింటెన్ చేయాలి.

4. ఇంజిన్ ఆఫ్ చేయాలి
కారు పార్కింగ్​లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్​లో వెయిట్ చేస్తున్నప్పుడు ఇంజిన్​ను ఆఫ్ చేసుకోవాలి. ఇంజిన్​ ఆన్​లో ఉంచుకోవడం వల్ల అనవసరంగా ఫ్యూయెల్ ఖర్చయిపోతుంది. పైగా కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి.

5. దగ్గర రూట్లో వెళ్లాలి!
మీరు వెళ్లాలని అనుకుంటున్న ప్రదేశానికి దగ్గర దారిలో వెళ్లాలి. ఇందుకోసం అధునాతన నావిగేషన్ యాప్స్, వెబ్​సైట్స్​​ వాడాలి. దీని వల్ల ట్రాఫిక్​లో ఇరుక్కోకుండా ఉంటాం. పైగా పెట్రోల్, డీజిల్​ లాంటి ఫ్యూయెల్స్ బాగా ఆదా అవుతాయి.

6. ఓవర్ స్పీడ్​లో వెళ్లకూడదు!
అతివేగంగా బండి నడపడం వల్ల, ఎయిరోడైనమిక్ డ్రాగ్ కారణంగా, ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంతేకాదు అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి. కనుక పరిమిత వేగంలో వెళ్లడమే చాలా మంచిది.

7. సరైన మోటార్ ఆయిల్‌ని ఉపయోగించాలి!
కారు మాన్యువల్‌లో పేర్కొన్న మోటార్ ఆయిల్​నే ఉపయోగించడం మంచిది. మంచి నాణ్యమైన ఆయిల్ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు వాహనంలో ఎప్పటికప్పుడు ఆయిల్ ఛేంజ్ చేయాలి. ఎయిర్ ఫిల్టర్స్ రిప్లేస్​ చేయాలి. ఇలా కారును సరిగ్గా మెయింటైన్ చేస్తే, కచ్చితంగా ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ పెరుగుతుంది.

8. అవసరంగా బ్రేక్స్​ వేయకూడదు!
తరచూ అనవసరంగా బ్రేక్స్​ వేయకూడదు. బ్రేక్ వేయడం వల్ల కూడా ఇంధనం ఖర్చు అవుతుంది. కనుక ట్రాఫిక్​లో ఉన్నప్పుడు ఇతర వాహనాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పుడే సడెన్​ బ్రేక్స్ వేయకుండా ఉండగలుగుతాం. చూశారుగా, ఈ టిప్స్​ అన్నీ పాటిస్తే కారు మైలేజ్ పెరగడం గ్యారెంటీ!

ముకేశ్​ అంబానీ కార్ కలెక్షన్ చూశారా? చూస్తే మ‌తిపోవాల్సిందే! - Mukesh Ambani Car Collection

ఫ్లిప్​కార్ట్​ 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌' సేల్‌ - భారీ ఆఫర్స్​ & డీల్స్​ - ఎప్పటి నుంచి అంటే? - Flipkart Big Saving Days 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.