ETV Bharat / business

మీ కారు తరచూ ట్రబుల్​ ఇస్తోందా? ఇలా మెయింటెన్​ చేస్తే ఫుల్​ కండీషన్​లో పెట్టొచ్చు! - Car Maintenance Checklist - CAR MAINTENANCE CHECKLIST

Car Maintenance Checklist : కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న కారును సాధ్యమైనంత ఎక్కువ కాలం మన్నికగా ఉండాలని అందరూ భావిస్తుంటారు. కారుతో మనిషికి ఎమోషనల్ అటాచ్​మెంట్ ఉంటుంది. ఈ క్రమంలో కారు మెయింటెనెన్స్ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Car Maintenance Checklist
Car Maintenance Checklist (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 2:09 PM IST

Car Maintenance Checklist : కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కారు కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే, దానిని మంచి కండీషన్​లో ఉంచుకోవడం మరో సవాలని చెప్పాలి. అయితే ఆ కారు ఎక్కువ కాలం మన్నిక రావాలంటే చాలా జాగ్రతగా మెయింటెన్ చేయాలి. అందుకోసం షార్ట్​టర్మ్​, లాంగ్​టర్మ్​, సీజనల్ చెకింగ్స్​ చేయాలి.

కారు భాగాల్లో కొన్నింటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సి ఉంటుంది. మరికొన్ని దీర్ఘకాలంలో చెక్ చేస్తే సరిపోతుంది. కారును మీరు సరిగ్గా మెయింటెన్ చేస్తే కండీషన్​లో ఉంటుంది. అప్పుడు దాని రీసేల్​ వ్యాల్యూ కూడా బాగుటుంది. అయితే కారు కండీషన్ తప్పడం, బోర్​కు రావడం వల్ల భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

షార్ట్​టర్మ్​ చెకప్

  • ఎయిర్ ఫిల్టర్ : కారు ఇంజిన్​లో ఉండే ఎయిర్ ఫిల్టర్ చాలా ముఖ్యం. ఇది మీ ఇంజిన్​లోకి వచ్చే గాలిని నియంత్రిస్తుంది. ధుమ్ము, ధూళి ఇంజిన్​లోకి చొచ్చుపోకుండా కాపాడుతుంది. ఎయిర్ ఫిల్టర్ సక్రమంగా పనిచేస్తే కారు మంచి మైలేజ్ ఇస్తుంది. ఇంజిన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. కారు ఎయిర్ ఫిల్టర్ సరిగ్గా ఉందో లేదో ఇంట్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
  • టైర్ ప్రెషర్ : కారును ఎక్కువగా వాడితే ప్రధానంగా ఆ భారమంతా పడేది టైర్లపైనే. అందుకే టైర్లను మంచిగా ఉండేలా చూసుకోవాలి. అందుకే నెలకు ఒకసారైనా టైర్లలో గాలిని చెక్ చేసుకోవాలి. టైర్లలో గాలి ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి మీ దగ్గర టైర్ గేజ్​ను ఉంచుకోవాలి. గాలి తక్కువగా ఉన్నా డ్రైవింగ్ చేస్తే టైర్ల లైఫ్ టైమ్ వేగంగా తగ్గిపోతుంది.
  • కూలెంట్ లెవెల్స్ : ప్రతి నెలకొకసారి కారు ఇంజిన్, కూలెంట్ స్థాయిలను తనిఖీ చేయాలి. ముఖ్యంగా ట్రిప్స్​కు వెళ్లే ముందు కారులో ఆయిల్​, కూలెంట్​ లెవెల్స్​ను చెక్​ చేసుకోవాలి. లేదంటే కారు దెబ్బతినే ప్రమాదం ఉంది.
  • హెడ్‌, పార్కింగ్ లైట్లు, టర్న్ సిగ్నల్స్ : ఏ వావాహనికైనా లైట్లు చాలా ముఖ్యం. లైట్లు సరిగ్గా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే కనీసం నెలకొకసారి హెడ్, పార్కింగ్ లైట్లు, టర్నింగ్ సిగ్నల్స్​ లైట్స్​ను తనిఖీ చేసుకోండి.
  • ఆయిల్ అండ్ ఫిల్టర్ : ఏ వాహనానికికైనా క్రమం తప్పకుండా ఇంజిన్ ఆయిల్​ను మార్చాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కారు బాగా పనిచేస్తుంది. అలాగే మంచి మైలేజ్​ను ఇస్తుంది. ఇంజిన్ ఆయిల్ కారు ఇంజిన్​ను చల్లబరుస్తుంది. ఇంజిన్ తుప్పు పట్టకండా నిరోధిస్తుంది. ప్రతి 3 నెలలకు లేదా 3000 మైళ్లకు ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్​ను మార్చాల్సి రావచ్చు. అలాగే మీ వాహనాన్ని కడిగిన తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి వ్యాక్స్ చేయడం మంచిది. అలా చేయడం వల్ల మీ కారు కాంతివంతంగా మెరుస్తుంటుంది. అలాగే తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. వ్యాక్సింగ్​తో కారు పెయింట్ పాడవకుండా ఉంటుంది.

లాంగ్-టర్మ్ చెకప్​లు

  • ట్రాన్స్ మిషన్ ఫ్లూయిడ్ : మీ ఇంజిన్‌ ఆయిల్ లాగానే, ట్రాన్స్​మిషన్ ఫ్లూయిడ్ కూడా ట్రాన్స్​మిషన్​లో ఉన్న అన్ని భాగాలు పని చేసేలా చేస్తుంది. మీరు ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​, మాన్యువల్ ట్రాన్స్​మిషన్​లో కారును నడుపుతున్నా, ఈ ఫ్లూయిడ్​ ఉందో లేదో చెక్​ చేసుకోవాలి.
  • ఇవీ ముఖ్యమే : కారు రోడ్డుపై ఉన్న గుంతల మీదుగా వెళ్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కారు షాక్స్, స్ట్రట్స్ పనిచేస్తాయి. వీటిని ప్రతి 50,000 మైళ్లకు ఒకసారి మెకానిక్​తో తనిఖీ చేయించాలి.
  • రేడియేటర్ : కారులోని రేడియేటర్ ఇంజిన్​ను చల్లగా ఉంచుతుంది. అలాగే ఇంజిన్ బాగా పనిచేయడంలో సాయపడుతుంది. అందుకే రేడియేటర్ క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి.
  • స్పార్క్ ప్లగ్ : కారు ఇంజిన్ స్టార్ట్ అయ్యేందుకు స్పార్క్ ప్ల‌గ్ కీల‌క‌మైంది. ఇందులో ఏదైనా స‌మ‌స్య ఉంటే కారు స్టార్ట్ అవ్వడంలో అంతారాయం కలుగుతుంది. అందుకే దానిపై దృష్టిని పెట్టాలి. అలాగే సర్పెంటైన్ బెల్ట్ (SERPENTINE BELT) సరిగ్గా పనిచేసుందో లేదో చూసుకోవాలి.

సీజనల్ చెకింగ్స్

  • విండ్‌ షీల్డ్ వైపర్లు : విండ్‌ షీల్డ్ వైపర్లను సంవత్సరానికి ఒకసారి మార్చాలి. శీతాకాలంలో వింటర్ వైపర్ బ్లేడ్​లను ఇన్​స్టాల్ చేయడం మంచిది.
  • బ్యాటరీ పెర్ఫార్మెన్స్ : కారులో బ్యాట‌రీని స‌రైన కండీష‌న్​లో ఉంచాలి. బ్యాట‌రీ జీవిత కాలాన్ని పెంచాలంటే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయాలి. అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీ పనితీరును ప్రభావితం చేస్తాయి.
  • టైర్లు మార్చండి : టైర్లను మీరు నివాసం ఉండే ప్రదేశాన్ని బట్టి ఎంచుకోండి. అలాగే కారు రేడియేటర్, ఇంజిన్ భాగాలు శీతాకాలంలో గడ్డకట్టకుండా ఉంచడానికి యాంటీఫ్రీజ్ స్థాయిలను తనిఖీ చేయండి. ఇలా కారు మెయింటెనెన్స్ గురించి మాన్యువల్ చదివి తెలుసుకోవచ్చు. మరికొన్నింటికి మెకానిక్ దగ్గరకి వెళ్లి కారును చెక్ చేసుకోవచ్చు.

మీ కార్​ విండ్​షీల్డ్ లోపలి భాగాన్ని క్లీన్ చేయాలా?​​ ఈ టిప్స్​ ఫాలో అవ్వండి! - How To

ఈ 5 టూల్స్ మీ కారులో ఉంటే చాలు - షోరూమ్​ బండిలా ఉంటుంది! Windshield Inside

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.