Luggage Storage Tips in Car : కారు కొనడం ఒకెత్తు.. దాన్ని మెయింటెయిన్ చేయడం మరో ఎత్తు. ఈ మెయింటెనెన్స్‌లో లగేజ్ అరేంజ్ చేసుకోవడం కూడా ఉంటుంది. ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు అనివార్యంగా ఎక్కువ లగేజీ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇందుకోసం అందరూ కారు బూట్ స్పేస్‌పైనే ఆధారపడతారు. కాబట్టి.. కారు కొనుగోలు చేస్తున్నప్పుడే బూట్ స్పేస్ ఎంత ఉందన్నది చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నార్మల్ కార్లకన్నా.. CNG కార్లలో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. CNG సిలిండర్ కారు బూట్ స్పేస్ ప్రాంతంలోనే ఉంటుంది. దాంతో ఆ ప్రాంతంలో ఎక్కువ లగేజీ పెట్టుకోవడానికి తగినంత ప్లేస్ ఉండదు. కొన్ని ఇతర కార్లలోనూ బూట్ స్పేస్ ఎక్కువగా ఉండదు. కాబట్టి.. కారు వెనుక భాగాన్ని సమర్థవంతంగా ఎలా యూజ్ చేసుకోవాలనే దానిపై అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవగాహన ఉంటే.. తక్కువ ప్లేస్‌లో కూడా ఎక్కువ వస్తువులను స్టోర్ చేసుకోవచ్చంటున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆటో మేకర్లు కారు బూట్ స్పేస్‌ను.. లీటర్ల సామర్థ్యంలో కొలుస్తారు. ఉదాహరణకు.. 400 లీటర్లు, 450 లీటర్లు, 500 లీటర్లు ఇలా బూట్ కెపాసిటీని కొలుస్తారు. ఈ వివరాలన్నీ కారు వివరాల్లో ప్రచురిస్తారు కూడా. కాబట్టి.. మీ కారుకు సంబంధించిన బూట్ కెపాసిటీ ఎంతో మీరు కొనుగోలు చేస్తున్నప్పుడే తెలుసుకోవచ్చు. తద్వారా.. మీ వాహనంలో ఎంత లగేజీని అమర్చగలమనే దానిపై ఒక అవగాహన రావచ్చు అంటున్నారు నిపుణులు.
ఇక, కారులో లగేజీ స్టోర్ చేస్తున్నప్పుడు కీలకమైన విషయాలు గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. కారు బూట్ స్పేస్‌లో సామాను ఉంచినప్పుడు వెనక డోర్ మిర్రర్ కింద ఎత్తు మించకుండా లగేజీ సర్దుకోవాలి. లేదా వెనుక సీటు ఎత్తుకు సమానంగా లగేజీని సర్దుకొని వెళ్లవచ్చు. అంతకన్నా ఎత్తులో లగేజీని సర్దితే.. డ్రైవర్‌కు రియర్ వ్యూ గ్లాస్ ద్వారా బయటి ప్రదేశం పూర్తిగా కనిపించదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
మీ కారు మైలేజ్ పెరగాలా? ఈ టాప్-8 టిప్స్ మీ కోసమే! - How To Improve Car Mileage
దీనివల్ల ఒక్కోసారి కారు భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. మీరు కారు వెనుక సీటు ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తున లగేజీ నింపితే.. కారు స్పీడ్‌గా వెళ్లినప్పుడు లగేజీ వస్తువులన్నీ వెనుక సీట్లో కూర్చున్నవారి మీద పడే అవకాశం కూడా ఉంటుందంటున్నారు.
కాబట్టి.. ఇకపై మీరు ఎక్కడికైనా కారులో ఎక్కువ లగేజీ తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు.. కారు బూట్ ప్రాంతంలో సరిపోయేలా మాత్రమే సామాన్లు స్టోర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిమితికి మించి లగేజీ కారులో కుక్కడం వల్ల రోడ్డు భద్రతకూ ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు
కారు ఇంజిన్‌లో ఎలుకలు దూరి అంతా పాడు చేస్తున్నాయా? - ఈ టిప్స్‌తో అవి పరార్!