ETV Bharat / business

కార్​ లోన్​ కావాలా? 2024లో బ్యాంకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Car Loan Interest Rates In India 2024 : మీరు లోన్ తీసుకుని కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. కారు కొనేటప్పుడు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకుల వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. అందుకే ఈ ఆర్టికల్​లో కారు లోన్స్​పై బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల వివరాలు​ తెలుసుకుందాం.

Car Loan Interest Rates 2024
Car Loan Interest Rates In India 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 11:03 AM IST

Car Loan Interest Rates In India 2024 : నేడు భారతదేశంలో కార్లు కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2024 జనవరి నెలలో దేశవ్యాప్తంగా దాదాపుగా 3.94 లక్షల కార్లు సేల్ అయ్యాయని గణాంకాల ద్వారా స్పష్టం అవుతోంది. దేశంలోని మధ్య తరగతి ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు నేడు చాలా బ్యాంకులు వాహనాల కొనుగోలుకు విరివిగా రుణాలు అందిస్తున్నాయి. దీనితో చేతిలో డబ్బులు లేకపోయినా, వాహనాల కొనుగోలు సులభం అయిపోయింది.

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే చాలు
Credit Score For Car Loan : క్రెడిట్‌ స్కోర్‌ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. సాధారణంగా చాలా బ్యాంకులు కారు ఆన్‌-రోడ్ ధ‌ర‌లో 80 శాతం నుంచి 90 శాతం వ‌ర‌కు రుణాన్ని ఇస్తున్నాయి. అయితే ఇలాంటి వాహన రుణాలు తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్ ఛార్జీలు, ఇతర రుసుములు గురించి కూడా ఆరా తీయాలి. అన్నింటికంటే ముఖ్యంగా బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మీపై అధిక రుణభారం పడకుండా ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్​లో వివిధ బ్యాంకులు కారు రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు గురించి తెలుసుకుందాం.

Bank Interest Rates On Car Loans :

బ్యాంకు పేరువడ్డీ రేటు (సంవత్సరానికి)
కెనరా బ్యాంక్8.70%
యూనియన్ బ్యాంక్8.70%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా8.75%
పంజాబ్​ నేషనల్ బ్యాంక్8.75%
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.75%
బ్యాంక్ ఆఫ్ బరోడా8.80%
ఐడీబీఐ బ్యాంక్8.80%
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్8.85%
ఫెడరల్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా8.85%
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్8.95%
కర్ణాటక బ్యాంక్8.98%
ఐసీఐసీఐ బ్యాంక్9.10%
యాక్సిస్ బ్యాంక్9.20%
సౌత్ ఇండియన్ బ్యాంక్9.27%
కరూర్ వైశ్యా బ్యాంక్9.55%
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్​10.70%

మఖ్య గ‌మ‌నిక : ఈ ఆర్టికల్​లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు వసూలు చేస్తున్న అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. మీ లోన్ మొత్తం, క్రెడిట్ స్కోర్​, వృత్తి/ ఉద్యోగం, బ్యాంకు షరతులు/ నిబంధ‌న‌ల ఆధారంగా మీకు వర్తించే వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు.

ఉద్యోగం మారుతున్నారా? మీ PF​ ఖాతాను సింపుల్​గా ట్రాన్స్​ఫర్​ చేసుకోండిలా!

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టూ-వీలర్​ నడపాలా? ఈ టాప్​-7 ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.