Upcoming Cars In 2024 : భారతదేశంలో కార్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ, తమ లేటెస్ట్ కార్లను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
జనవరి నెలలో ఏకంగా 18 న్యూ ఎడిషన్ కార్లు భారత్‌లో లాంఛ్ అయ్యాయి. వీటికి విశేష ఆదరణ కూడా లభించింది. ఈ ఫిబ్రవరి నెలలో కూడా టాటా, మారుతి, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్, లెక్సస్ లాంటి టాప్ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Tata Tiago, Tigor AMT CNG : టాటా మోటార్స్ ఇప్పటికే టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కార్ల టీజర్లను విడుదల చేసింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వస్తున్న ఫస్ట్ సీఎన్జీ పవర్డ్ ఆటోమేటిక్ వేరియంట్స్ కావడం గమనార్హం. వీటిని ఈ ఫిబ్రవరి నెలలోనే లాంఛ్ చేసే అవకాశం ఉంది.
Tata Tiago Price : టాటా టియాగో ఏఎంటీ సీఎన్జీ ధర సుమారుగా రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉండవచ్చని అంచనా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Tata Tigor Price : టాటా టిగోర్ ఏఎంటీ సీఎన్జీ ధర సుమారుగా రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండవచ్చని అంచనా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Mahindra XUV300 : దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఈ ఫిబ్రవరిలోనే XUV300 కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. టాటా నెక్సాన్, కియా సోనెట్‌లకు పోటీగా తెస్తున్న ఎస్యూవీ కారు ఇది. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారులో అనేక ఫీచర్లు, స్పెక్స్ మోడిఫై చేసినట్లు సమాచారం.
Mahindra XUV300 Price : ఈ మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ కారు ధర సుమారుగా రూ.9.31 లక్షల నుంచి రూ.13.16 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉండవచ్చని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Hyundai Creta N Line : హ్యుందాయ్ కంపెనీ స్పోర్టీ వెర్షన్ 'క్రెటా'ను త్వరలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ థర్డ్ ఎన్ లైన్ మోడల్ కారులో అనేక ఫీచర్స్ & స్పెసిఫికేషన్స్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది.
Hyundai Creta N Line Price : ఈ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు ధర సుమారుగా రూ.20 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండవచ్చని తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Maruti Swift : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి త్వరలోనే ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిని హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌కు పోటీగా తీసుకువస్తున్నట్లు సమాచారం.
Maruti Swift Price : ఈ ఫోర్త్ జనరేషన్ మారుతి స్విఫ్ట్ కారు ధర ప్రస్తుత మోడల్స్ కంటే కాస్త ఎక్కువగానే ఉండవచ్చని తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Tata Nexon iCNG : దిగ్గజ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో నెక్సాన్ ఐసీఎన్జీ కారును ప్రదర్శించింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కారును త్వరలోనే ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెక్సాన్ ఐసీఎన్జీ కారు కనుక లాంఛ్ అయితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ లాంటి అన్ని వేరియంట్లలో లభిస్తున్న ఏకైక వాహనం ఇదే అవుతుంది.
Tata Nexon iCNG Price : మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ ఐసీఎన్జీ కారు ధర సుమారుగా రూ.8.15 లక్షల నుంచి రూ.13.60 లక్షల వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Tata Curvv EV : టాటా కర్వ్ ఈవీ కారు ఈ ఏడాదిలోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లోనే ఈ టాటా కర్వ్ కారును ప్రదర్శించారు. అయితే ఇది డీజిల్ వేరియంట్ కావడం గమనార్హం.
టాటా కర్వ్ ఈవీ విడుదలైతే ఎంజీ జీఎస్ ఈవీ, మారుతి eVX సహా, అప్‌కమింగ్ హ్యుందాయ్ క్రెటా ఈవీకి గట్టిపోటీ ఎదురుకానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Mercedes GLB Facelift : 7-సీటర్ ఎస్యూవీ కారు అయిన మెర్సిడెస్ జీఎల్బీ ఫేస్‌లిఫ్ట్ ఈ ఫిబ్రవరి- మార్చి నెలల్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో మెకానికల్ ఛేంజెస్ చేయకపోయినప్పటికీ, చాలా ఇంటీరియర్ అప్డేట్స్ చేసినట్లు సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. Toyota TAISOR : టయోటా టైసర్ కారు బహుశా ఈ ఫిబ్రవరి నెలలోనే లాంఛ్ కావచ్చు. కానీ కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Toyota TAISOR Price : ఈ టయోటా టైసర్ కారు ధర సుమారుగా రూ.7.60 లక్షల నుంచి రూ.13.50 లక్షలు ఉండవచ్చని అంచనా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. Lexus UX300E : లెక్సస్ యూఎస్300ఈ కారు కూడా ఈ ఫిబ్రవరి 2024లోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని మార్కెట్ ధర సుమారుగా రూ.65 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండే అవకాశం ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">