ETV Bharat / business

బిట్​కాయిన్ జోష్- తొలిసారి 95 వేల డాలర్ల మార్క్​ను క్రాస్ చేసిన క్రిప్టోకరెన్సీ - BITCOIN RECORD

తొలిసారిగా 95వేల డాలర్లకు మార్క్​ను దాటిన బిట్​కాయిన్

Bitcoin Record
Bitcoin Record (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 4:30 PM IST

Bitcoin Record : అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన తర్వాత క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చరిత్రలోనే తొలిసారి గురువారం 95 వేల డాలర్ల మార్క్​ను దాటింది. త్వరలోనే లక్ష డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకరెన్సీకి సంబంధించిన అనుకూలమైన విధానాలను తీసుకొస్తారనే నమ్మకంతోనే బిట్​కాయిన్ విలువ రికార్డ్ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అమెరికాను క్రిప్టోకరెన్సీ రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించిన దగ్గర నుంచి వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బిట్​కాయిన్ విలువ సుమారు 40శాతం మేర పెరిగింది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుతం బిట్​కాయిన్​తో మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.82,00,010
ఇథీరియంరూ.2,61,492
ఇథీరియంరూ.84.50
బైనాన్స్ కాయిన్రూ.20,151
యూఎస్​డీ కాయిన్రూ.94.30

బిట్​కాయిన్​ గురించి కీలక విషయాలు
బిట్​కాయిన్​ను 2008లో రూపొందించారు. అయితే దీని సృష్టికర్త ఎవరు అనేది ఇంతవరకు స్పష్టత లేదు. 2009 సతోషి నకమోటో పేరుతో చలామణిలోకి తీసుకొచ్చారు. దీంతో సతోషి నకమోటోనే సృష్టికర్తగా అందరూ భావిస్తున్నారు. అయితే వ్యక్తి లేదా గ్రూపు అనేది అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 'మనీ ఎలక్ట్రిక్‌: బిట్‌కాయిన్‌ మిస్టరీ' పేరిట హెచ్​బీఓ ఓ డ్యాకుమెంటరీ తీసింది. దానిలో కెనడాకు చెందిన పీటర్ టోడ్డ్​ అనే సాఫ్ట్​వేర్ తొలిసారిగా దీనిని తయారు చేసినట్లు చూపించారు.

2018 ఆగస్టు 18న bitcoin.org అనే డొమైన్​తో రిజిస్టర్​ అయింది. 2009 జనవరి 3న బిట్​కాయిన్ నెట్​ వర్క్​ను రూపొందించి మైనింగ్​ను ప్రారంభించారు. హెరాల్డ్ థామస్​ ఫినే అనే సాఫ్ట్​వేర్ డెవలపర్ ద్వారా​ మొట్టమొదటిగా 10 బిట్​ కాయిన్ల లావాదేవీలు జరిగాయి. 2012లో వెయ్యి మందికి పైగా వ్యాపారులు బిట్‌కాయిన్‌ను పేమెంట్‌గా అంగీకరిస్తున్నట్లు బిట్‌కాయిన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడ్ బిట్ పే తెలిపింది. 2013లో ఒకే నెలలో 1 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ.7.25 కోట్లు) విలువైన లావాదేవీలు జరిగాయి.

  • 2009-10 మధ్య బిట్ కాయిన్ విలువ పూర్తిగా శూన్యం. 2010లో దీని విలువ 0.01 డాలర్లుగా(సుమారు 73 పైసలు) ఉండేది.
  • 2011 ఫిబ్రవరిలో అది ఒక డాలరుకు(సుమారు రూ.72 రూపాయలు) చేరుకుంది.
  • 2013లో 1,200 డాలర్ల మార్కును దాటినా 2014లో తిరిగి 340 డాలర్లకు పడింది.
  • 2017 మేలో మొదటిసారి 2,000 డాలర్ల(సుమారు రూ.1.44 లక్షలు) స్థాయికి చేరుకున్న బిట్ కాయిన్ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సెప్టెంబర్ నాటికి 5000 డాలర్లకు(సుమారు రూ.3.6 లక్షలు) దూసుకుపోయింది.
  • అదే సంవత్సరం డిసెంబర్ నాటికి ఏకంగా 19 వేల డాలర్లకు(సుమారు రూ.13.8 లక్షలు) చేరుకుంది.
  • 2018 డిసెంబర్ నాటికి 3,300 డాలర్లకు(సుమారు రూ.2.2 లక్షలు) బిట్ కాయిన్ విలువ పడిపోయింది.
  • ఆ తర్వాత 2020 మార్చి నాటికి 5000 డాలర్లకు చేరుకుంది.
  • 2020 డిసెంబర్ నాటికి 1.85 కోట్ల బిట్ కాయిన్లు మైన్ చేశారు.
  • 2024లో ఫిబ్రవరిలో 57 వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ - నవంబర్​లో అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత 90 వేల డాలర్లకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.