ETV Bharat / business

బెస్ట్​ సన్​రూఫ్ కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Sunroof Cars Under 10 Lakh - BEST SUNROOF CARS UNDER 10 LAKH

Best Sunroof Cars Under 10 Lakh : మీరు మంచి ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఉన్న కారు కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.10 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో మీ బడ్జెట్లోనే సన్​రూఫ్​తో వస్తున్న టాప్​-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Cars Under 10 Lakh
Best Sunroof Cars Under 10 Lakh
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 12:16 PM IST

Best Sunroof Cars Under 10 Lakh : ఇటీవలి కాలంలో సన్​రూఫ్ ఉన్న కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే ఈ ఫీచర్​ ఉండేది. కానీ నేడు అఫర్డబుల్ కార్లలోనూ సన్​రూఫ్​ ఉంటోంది. మరి మీరు కూడా మంచి ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఉన్న కారు కొనాలని ఆశిస్తున్నారా? అయితే మరెందుకు ఆలస్యం, ఈ ఆర్టికల్​లో రూ.10 లక్షల బడ్జెట్లోపు లభిస్తున్న టాప్​-5 ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం రండి.

1. Tata Nexon : టాటా నెక్సాన్​ అనేది ఒక సబ్​కాంపాక్ట్ ఎస్​యూవీ. దీని ప్రారంభ ధర రూ.8.15 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది. దీనిలో వాయిస్​-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఉంటుంది. అలాగే దీనిలో 6-ఎయిర్​ బ్యాగ్స్​, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్​ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కారులోపల 17.78 సెం.మీ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్​ ఉంది. ఈ కారులో ఆటో హెడ్​ల్యాప్స్​, రెయిన్-సెన్సింగ్​ వైపర్స్​ ఉన్నాయి. ఈ టాటా నెక్సాన్ కారుకు గ్లోబల్​ ఎన్​సీఏపీ 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. కనుక సేఫ్టీ పరంగా చూస్తే, ఇది నంబర్ 1 కారు అని చెప్పుకోవచ్చు.

2. Hyundai Exter : ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్ అనేది ఒక ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీ. దీని ఎక్స్​-షోరూం ధర రూ.6 లక్షల నుంచి రూ.10.15 లక్షల వరకు ఉంటుంది. దీనిలో వాయిస్​-ఎనేబుల్డ్​ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఉంది. ఇంకా ఈ కారులో 8-అంగుళాల టచ్​స్క్రీన్​, మల్టిపుల్ ఛార్జింగ్ ఆప్షన్స్​, వైర్​లెస్ ఛార్జింగ్​, ఏసీ వెంట్స్​ ఉన్నాయి. ఈ హ్యుందాయ్​ కారు 19.2 kmpl నుంచి 27.1 kmpl మైలేజ్ ఇస్తుంది.

3. Tata Punch : ఇండియాలోని టాప్​-సెల్లింగ్ కార్లలో టాటా పంచ్ ఒకటి. ఇది మంచి స్పోర్టీ డైనమిక్స్​తో, టచ్ యుటిలిటీతో వస్తుంది. మార్కెట్లో ఈ టాటా పంచ్​ ధర రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల (ఎక్స్​-షోరూం) ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది. ఈ టాటా పంచ్​ కారులో వాయిస్​-అసిస్టెడ్​ సన్​రూఫ్ ఉంది. ఈ ఎస్​యూవీ కారులో 7-అంగుళాల టచ్​స్క్రీన్​ ఉంటుంది. దీనిలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే, క్లైమేట్ కంట్రోల్​ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ కారులో 7-అంగుళాల సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. టాటా పంచ్​ కారులో రెయిన్-సెన్సింగ్​ వైపర్స్​, ఆటో హెడ్​ల్యాంప్స్​ ఉంటాయి. మైలేజ్ విషయానికి వస్తే, టాటా పంచ్ 18.8 kmpl నుంచి 26.99 kmpl మైలేజ్ ఇస్తుంది.

4. Hyundai i20 N Line Facelift : ఈ హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ ఫేస్​లిఫ్ట్​ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది. ఈ కారులో 1.0 టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో న్యూ-ఏజ్ టెక్నాలజీస్ అయిన ఎలక్ట్రిక్ సన్​రూఫ్​, 26.03 సెం.మీ హెచ్​డీ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్​ & నావిగేషన్ సిస్టమ్, ఆటోమేటిక్​ హెడ్​ల్యాప్స్​, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్​ (ESS) ఉన్నాయి.

5. Mahindra XUV300 : ఈ మహీంద్రా ఎక్స్​యూవీ 300 ప్రారంభ ధర సుమారుగా రూ.7.99 లక్షలు ఉంటుంది. ఈ 5 సీటర్​ కారు 6 రంగుల్లో లభిస్తుంది. అయితే కొన్ని సెలక్టెడ్​ వేరియంట్లలో మాత్రమే సన్​రూఫ్ ఉంటుంది. ముఖ్యంగా W4 పెట్రోల్​, W4 డీజిల్​, W4 టీజీడీఐ పెట్రోల్​, W6 పెట్రోల్​, W6 డీజిల్ కార్లలో మాత్రమే సన్​రూఫ్​ ఉంటుంది.

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్​ కొనాలా? టాప్​-10 పవర్​ఫుల్​ మోడల్స్​ ఇవే! - Best Bikes Under 1 Lakh

స్టన్నింగ్ ఫీచర్స్​తో టయోటా టైజర్ లాంఛ్​ - ధర ఎంతంటే? - Toyota Taisor Launch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.