Best Selling Cars Of All Time : నేడు ఆటోమొబైల్ రంగం చాలా అభివృద్ధి చెందింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని భారీ సంఖ్యలో బుకింగ్స్ నమోదు చేసుకుని, బెస్ట్ సెల్లింగ్ కార్స్‌గా నిలుస్తున్నాయి. మరి మీరు ఎప్పుడైనా వింటేజ్ కార్ల గురించి ఆలోచించారా? అప్పట్లో ఆల్-టైమ్ బెస్ట్ సెల్లింగ్ కార్లుగా ఏమున్నాయో తెలుసుకోవాలనుకున్నారా? అయితే ఇది మీ కోసమే. పాత కాలం నాటి టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10. Bugatti Type 40A : బుగట్టి - టైప్ 40ఏ కారును ఒక ఇంజినీరింగ్ మాస్టర్ పీస్‌గా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇది ఒక టూ-సీటర్ స్పోర్ట్స్ కార్. ఇది గంటకు 120 కి.మీ వేగంతో పయనిస్తుంది. ఆ రోజుల్లో అత్యంత వేగంతో ప్రయాణించే కార్లలో ఇదొకటి కావడం విశేషం. ఈ స్టన్నింగ్ కారు 1926 -1931 వరకు కార్ లవర్స్ అందరినీ ఉర్రూతలూగించింది.
ఈ బుగట్టి కారు స్లీక్, ఎయిరోడైనమిక్ డిజైన్‌తో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో 1.5 లీటర్ ఇన్లైన్-ఎయిట్ ఇంజిన్ అమర్చారు. ఇది 75 హార్స్‌పవర్‌ను డెలివరీ చేసేది. దీని సస్పెన్షన్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి గతుకుల రోడ్లపై అయినా చాలా హాయిగా ప్రయాణించడానికి వీలవుతుంది. అప్పట్లోనే ఈ బుగట్టి కారు 807 యూనిట్లు అమ్ముడుపోయి, ఆల్-టైమ్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.
Bugatti Type 40A Price : 2024 ఏప్రిల్‌లో జరిగిన ఓ వేలంలో (Auction) ఈ బుగట్టి టైప్ 40ఏ కారు ఏకంగా 3,02,000 డాలర్లకు అమ్ముడుపోయింది.
9. Morgan 4/4 : ఈ మోర్గాన్ 4/4 అనే బ్రిటీష్ కారు ఆటోమోటివ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలంపాటు కొనసాగిన కారుగా నిలిచింది. ఇది 1936 నుంచి 2018 వరకు దాదాపు 10,000 యూనిట్ల వరకు సేల్ అయ్యింది. ఇది బ్లెండ్ లుక్స్, పెర్ఫార్మెన్స్, రగ్గడ్ యూజబిలిటీతో కార్ లవర్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే 2020లో దీని స్థానంలో కొత్త 'ప్లస్ ఫోర్' కారును కంపెనీ తీసుకువచ్చింది.
ఈ మోర్గాన్ 4/4 కారులో ఫోర్డ్ సిగ్మా 1600 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6000 rpm వద్ద 110 bhp పవర్, 131 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ వింటేజ్ కారు గంటకు 188 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సైజ్ 55 లీటర్లు ఉంటుంది.
Morgan 4/4 Price : ప్రస్తుతం ఇది మార్కెట్లో అందుబాటులో లేదు. వేలంపాటలో బహుశా 46,900 యూరోస్ పలకవచ్చని అంచనా.
8. Ferrari 458 : ఫెరారీ-458 ఏకంగా 24,000 యూనిట్లు అమ్ముడుపోయి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అయితే ఈ కార్లో మూడు రకాల వేరియంట్స్ ఉన్నాయి. అవి: ఇటాలియాస్ (15,000 యూనిట్లు), స్పెషలెస్ (3,000 యూనిట్లు), స్పైడర్స్ (6,000 యూనిట్లు) ఉన్నాయి.
ఫెరారీ 458 ఇటాలియాలో 4497 సీసీ ఇంజిన్ ఉంది. ఇది 561.9 bhp పవర్, 540 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని సిటీ మైలేజ్ 4 కి.మీ/లీటర్. పైగా దీని సీటింగ్ కెపాసిటీ-2.
Ferrari 458 Price : మార్కెట్లో ఈ ఫెరారీ 458 కారు ధర సుమారుగా రూ.3.87 కోట్లు ఉంటుంది.
7. Lamborghini Urus : వింటేజ్ కార్లలో 25000 యూనిట్లకుపైగా అమ్ముడుపోయి, బెస్ట్ సెల్లింగ్ కారుగా లంబొర్గినీ ఉరుస్ నిలిచింది. ప్రపంచంలోని మొదటి సూపర్ స్పోర్ట్ యుటిలిటీ కారు ఇది. ఈ ఎస్‌యూవీలో 4.0 లీటర్ ట్విన్ వీ8 ఇంజిన్ అమర్చారు. దీని డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్, పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటాయి.
Lamborghini Urus Price : మార్కెట్లో ఈ లంబొర్గినీ ఉరుస్ కారు ధర సుమారుగా రూ.4.98 కోట్లు ఉంటుంది.
6. Rolls-Royce Silver Shadow : రోల్స్ రాయిస్ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ కార్లలో 'సిల్వర్ షాడో' ఒకటి. ఇది 1965 నుంచి 1980 మధ్యలో మోస్ట్ పాపులర్ కారుగా ఉంది. ఇది మొత్తంగా 29,030 యూనిట్లు అమ్ముడుపోయింది.
ఈ రోల్స్ రాయిస్ కారులో V8, 6.75 లీటర్, నేచురల్లీ ఆస్పైర్డ్ ఇంజిన్ ఉంది. ఇది 4000 rpm వద్ద 189 హోర్స్పవర్ జనరేట్ చేస్తుంది. ఇది 3-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 26.4 గ్యాలెన్స్. ఇది గంటకు 118 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
Rolls-Royce Silver Shadow Price : దీనిలో అనేక వేరియంట్లు ఉన్నాయి. వీటి ధర 12,850 యూరోల నుంచి 35,000 యూరోల రేంజ్లో ఉంటుంది.
5. Bentley Continental GT : బెంట్లీ కాంటినెంటల్ జీటీ 90,000 యూనిట్లకు పైగా సేల్ అయ్యి ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.
ఈ బెంట్లీ కారులో 5950 సీసీ 12 సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 650 bhp పవర్, 900 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెట్ ట్యాంక్ కెపాసిటీ 90 లీటర్స్. దీని మైలేజ్ 12.9 కి.మీ/లీటర్.
Bentley Continental GT Price : మార్కెట్లో ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు ధర సుమారుగా రూ.7.44 కోట్ల నుంచి రూ.9.71 కోట్ల వరకు ఉంటుంది.
4. Triumph Herald : ట్రయంఫ్ హెరాల్డ్ ఏకంగా 4,64,238 యూనిట్లు అమ్ముడుపోయింది. అంటే బయ్యర్లకు ఇది అంటే ఎంత మోజో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 1959 నుంచి 1970ల మధ్యలో ఇది ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపింది.
ఈ ట్రయంఫ్ కారులో 4 సిలిండర్ 948 సీసీ ఇంజిన్ ఉంది. అయితే దీనిలో సింగిల్ కార్బ్, ట్విన్ కార్బ్ అనే రెండు వెర్షన్లు ఉన్నాయి. సింగిల్ కార్బ్ వెర్షన్ 4500 rpm వద్ద 34.5 bhp పవర్, 2750 rpm వద్ద 49 టార్క్ జనరేట్ చేస్తుంది.
Triumph Herald Price : ఈ ట్రయంఫ్ హెరాల్డ్ కారు ధర యావరేజ్‌గా 13,080 డాలర్లు ఉంటుంది.
3. Jaguar XJ : వన్ మిలియన్ యూనిట్లు సేల్ అయ్యి జాగ్వర్ XJ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ వింటేజ్ కారుగా ప్రసిద్ధి చెందింది. 1968లో లాంఛ్ అయిన ఈ కారు 2019 వరకు తన ప్రస్థానాన్ని కొనసాగిచింది.
ఈ జాగ్వార్ కారులో 2993 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 301.73 bhp పవర్, 689 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్ 14.47 కి.మీ/ లీటర్. అయితే ఇది డీజిల్‌తో నడుస్తుంది.
Jaguar XJ Price : జాగ్వర్ ఎక్స్‌జే కారు ధర సుమారుగా రూ.99.56 లక్షల నుంచి రూ.1.97 కోట్లు వరకు ఉంటుంది.
2. Porsche 911 : జర్మనీకి చెందిన ఈ పోర్స్చే 911 స్పోర్ట్స్ కారు ఏకంగా 1.2 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి, ది బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. 1963లో లాంఛ్ అయిన ఈ కారు ఇప్పటికీ, బయ్యర్లకు అందుబాటులో ఉంది. అంటే ఇది ఎంత సక్సెస్ఫుల్ కారో అర్థం చేసుకోవచ్చు. ఈ పోర్స్చే 911 కారులో 3996 సీసీ ఇంజిన్ ఉంది. ఇది 379.50 bhp పవర్, 465 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్ 10.64 కి.మీ/ లీటర్.
Porsche 911 Price : మార్కెట్లో ఈ పోర్స్చే 911 కారు ధర సుమారుగా రూ.1.86 కోట్లు నుంచి రూ.4.26 కోట్లు వరకు ఉంటుంది.
1. Plymouth Fury : 1956లో మార్కెట్లోకి వచ్చిన ప్లైమౌత్ ఫ్యూరీ ఏకంగా 3.68 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది. దీనిలో సలూన్, వేగన్, కూపే, కన్వర్టిబుల్ మోడల్స్ ఉన్నాయి.
Plymouth Fury Price : మార్కెట్లో ఈ ప్లైమౌత్ ఫ్యూరీ కారు ధర సుమారుగా 32,089 డాలర్లు ఉంటుంది.
నోట్ : ఇక్కడ తెలిపినవి ఆయా ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన బెస్ట్ సెల్లింగ్ కార్స్ మాత్రమే. ఇంకా చాలా బెస్ట్ సెల్లింగ్ కార్స్ మార్కెట్లో ఉంటాయి. వాటి గురించి తరువాత ఆర్టికల్స్‌లో తెలుసుకుందాం.
గతుకుల రోడ్లపై కూడా దూసుకుపోవాలా? ఈ టాప్-10 బైక్స్‌పై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes