Best Scooters For Working Women And College Students : వర్కింగ్ ఉమెన్ ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసి, ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కాలేజీ అమ్మాయిలు సమయానికి క్లాస్‌లకు వెళ్లకతప్పదు. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయాలంటే, విపరీతమైన రద్దీగా ఉంటుంది. ఒక్కోసారి వాటి వల్ల ఆఫీసుకు, కాలేజీలకు వెళ్లడం ఆలస్యం అవుతుంది. దీనితో బాస్‌తో, టీచర్లతో తిట్లు తినాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మహిళలు మంచి టూ-వీలర్ కొనాలని ఆశపడుతూ ఉంటారు. అందుకే ఈ ఆర్టికల్‌లో కాలేజీ అమ్మాయిలకు, ఉద్యోగం చేసే మహిళలకు ఉపయోగపడే టాప్-10 స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
1. Honda Activa 6G Features : ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్లో 109.50 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 7.68 PS పవర్, 5250 rpm వద్ద 8.79 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కూటర్లలో హోండా యాక్టివా 6జీ కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్‌కు బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.
Honda Activa 6G Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్ ధర సుమారుగా రూ.63,912 నుంచి రూ.65,412 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Yamaha Fascino 125 Features : ఈ యమహా ఫాసినో 125 స్కూటర్లో 125 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 6500 rpm వద్ద 8.2 PS పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 58 కి.మీ మైలేజ్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలని అనుకునే వర్కింగ్ ఉమెన్‌కు, కాలేజీ అమ్మాయిలకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Yamaha Fascino 125 Price : మార్కెట్లో ఈ యమహా ఫాసినో స్కూటర్ ధర సుమారుగా రూ.66,430 నుంచి రూ.68,930 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Suzuki Access 125 Features : ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లో 125 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 6750 rpm వద్ద 8.6 PS పవర్, 5500 rpm వద్ద 10 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 53 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు, కాలేజీ అమ్మాయిలకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.64,800 నుంచి రూ.69,500 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. TVS Jupiter Features : ఈ టీవీఎస్ జూపిటర్ స్కూటర్లో 109.7 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 7.89 PS పవర్, 5500 rpm వద్ద 8.4 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రూ.70 వేలు బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలని అనుకునే మహిళలకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
TVS Jupiter Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర రూ.61,449 నుంచి రూ.67,911 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Piaggio Vespa Features : ఈ పియాజియో వెస్పా స్కూటర్లో 125 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 7250 rpm వద్ద 9.52 PS పవర్, 6250 rpm వద్ద 9.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్ ఈ స్కూటర్‌పై ఓ లుక్కేయవచ్చు.
Piaggio Vespa Price : మార్కెట్లో ఈ పియాజియో వెస్పా స్కూటర్ ధర రూ.74,831 నుంచి రూ.1,07,781 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Aprilia SR 125 Features : ఈ అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్లో 124.7 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 7250 rpm వద్ద 9.52 PS పవర్, 6250 rpm వద్ద 9.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 6.5 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 48 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ అప్రిలియా స్కూటర్లో అనేక వేరియంట్లు ఉన్నాయి. వాటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవచ్చు.
Aprilia SR 125 Price : మార్కెట్లో ఈ అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్ ధర రూ.68,277 నుంచి 94,641 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Ather 450X Features : ఈ ఏథర్ 450 ఎక్స్ అనేది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిలో 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 8.2 PS పవర్, 8.2 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్ రీఛార్జ్ చేస్తే 85 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌తో గరిష్ఠంగా గంటకు 80 కి.మీ వేగంతో వెళ్లవచ్చు.
Ather 450X Price : మార్కెట్లో ఈ ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ ధర రూ.1,49,000 నుంచి రూ.1,59,000 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. Hero Pleasure Plus Features : ఈ హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్లో 110.9 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 8 PS పవర్, 5500 rpm వద్ద 8.70 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 4.8 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 53 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రూ.50 వేలు బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలని ఆశించే మహిళలకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Hero Pleasure Plus Price : మార్కెట్లో ఈ హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ ధర రూ.48,500 నుంచి రూ.50,500 రేంజ్లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. OLA S1 Pro Features : ఈ ఓలా ఎస్1 ప్రో అనేది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. దీని బ్యాటరీ కెపాసిటీ 3.7 కిలోవాట్స్. ఇది 11.4 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్ రీఛార్జ్ చేస్తే 181 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.
OLA S1 Pro Price : మార్కెట్లో ఈ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారుగా రూ.1,24,999 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10. Suzuki Avenis 125 Features : ఈ సుజుకి అవెనిస్ 125 స్కూటర్లో 124 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 6750 rpm వద్ద 8.7 PS పవర్, 5500 rpm వద్ద 10 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 49 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రూ.1 లక్ష బడ్జెట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్కూటర్లలో ఇది ఒకటి.
Suzuki Avenis 125 Price : మార్కెట్లో ఈ సుజుకి అవెనిస్ 125 స్కూటర్ ధర రూ.87,800 నుంచి రూ.92,300 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2024లో లాంఛ్ అయిన టాప్-10 బైక్స్ & స్కూటర్స్ ఇవే!
రూ.8 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే!