ETV Bharat / business

మంచి జీప్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే - కొండలు, వాగుల్లోనూ రయ్​మని దూసుకుపోవచ్చు! - Best Jeeps In India - BEST JEEPS IN INDIA

Best Jeeps In India : మీరు మంచి జీప్​ కొనాలని అనుకుంటున్నారా? ధర ఎంతైనా ఫర్వాలేదా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ జీప్స్ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

TOP 5 JEEP SUVs in India
Best Jeep CARS In India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 3:18 PM IST

Best Jeeps In India : కార్లు సాధారణంగా చిన్నగా ఉంటాయి. ఇవి వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబం మొత్తం ప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. వీటిలో సెడాన్​, హ్యాచ్​బ్యాక్​, ఎస్​యూవీ లాంటి వేరియంట్లు ఉంటాయి. వీటి స్టైల్​, డిజైన్ కూడా భిన్నంగా ఉంటాయి. ఇక జీప్స్ విషయానికి వస్తే, ఇవి చూడడానికి చాలా పెద్దగా, స్ట్రాంగ్​గా ఉంటాయి. ఇవి రోడ్లపైనే కాదు, ఆఫ్​-రోడ్లపై కూడా డ్రైవ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈ ఆర్టికల్​లో ఇండియాలోని బెస్ట్ జీప్స్​ గురించి తెలుసుకుందాం.

1. Mahindra Thar : మహీంద్రా థార్​ను మొదటిసారిగా 2010లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. దీనిలో ఎన్నో అప్డేటెడ్ వెర్షన్స్​ వచ్చినప్పటికీ, డిజైన్​లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. ఈ జీప్​ గుండ్రని హెచ్​ల్యాంప్స్​తో, ఫ్రంట్​ గ్రిల్​తో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ఇంటీరియర్​ను చాలా విశాలంగా, ఫంక్షనల్​ డిజైన్​తో రూపొందించారు. ఈ థార్​ జీప్​ టైర్లు చాలా పెద్దగా ఉంటాయి. మంచి గ్రౌండ్ క్లియరెన్స్​, ఫోర్​-వీల్​-డ్రైవ్​ సెటప్​తో వచ్చే ఈ జీప్​ ఆఫ్​-రోడ్ డ్రైవ్​కు చాలా అనువుగా ఉంటుంది. మార్కెట్లో ఈ మహీంద్రా థార్​ ధర సుమారుగా రూ.11.35 లక్షలు నుంచి రూ.17.60 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

  • ఇంజిన్ - 2184 సీసీ - 4 సిలిండర్స్​
  • మ్యాక్స్ పవర్​ - 130.07 bhp@3750 rpm
  • మ్యాక్స్​ టార్క్ - 300 Nm@1600-2800 rpm
  • ట్రాన్స్​మిషన్​ - ఆటోమేటిక్​
  • సిటీ మైలేజ్ - 9 కి.మీ/ గంట
  • ఫ్యూయెల్ టైప్ - డీజిల్​
  • ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 57 లీటర్స్
  • గ్రౌండ్ క్లియరెన్స్ - 226 mm​
  • సీటింగ్ కెపాసిటీ - 4
  • బాడీ ఫిలాసఫీ - ఎస్​యూవీ

2. Jeep Wrangler : అమెరికాకు చెందిన మోస్ట్ పాపులర్​ జీప్ రాంగ్లర్​. విల్లీస్​ జీప్​ సక్సెసర్​గా ఇది మార్కెట్లోకి వచ్చింది. దీనిలో సిగ్నేచర్ వర్టికల్ ఫ్రంట్​ గ్రిల్​, ట్విన్ హెడ్​ల్యాంప్స్​, పెద్ద వీల్ ఆర్చ్​లు ఉంటాయి. ఈ జీప్​ చాలా స్ట్రాంగ్​ బాడీ కలిగి ఉంటుంది. దీనిని ప్రధానంగా ఆఫ్​-రోడ్​ డ్రైవింగ్ కోసం రూపొందించారు. అందువల్ల ఎలాంటి గతుకుల రోడ్లపై అయినా, బురదలో అయినా చాలా ఈజీగా దీనిని డ్రైవ్ చేయవచ్చు. ఈ గో-ఎనీవేర్​-జీప్​ ధర మార్కెట్లో రూ.67.65 లక్షల నుంచి రూ.71.65 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

  • ఇంజిన్ - 1995 సీసీ - 4 సిలిండర్స్​
  • మ్యాక్స్ పవర్​ - 268.20 bhp@5250 rpm
  • మ్యాక్స్​ టార్క్ - 400 Nm@3000 rpm
  • ట్రాన్స్​మిషన్​ - ఆటోమేటిక్​
  • ARAI మైలేజ్ - 10.6 కి.మీ/ గంట
  • ఫ్యూయెల్ టైప్ - పెట్రోల్​
  • గ్రౌండ్ క్లియరెన్స్ - 237 mm​
  • సీటింగ్ కెపాసిటీ - 5
  • బాడీ ఫిలాసఫీ - ఎస్​యూవీ

3. Mahindra Bolero : ఇండియాలోని మోస్ట్ పాపులర్ జీప్​ల్లో మహీంద్రా బొలెరో ఒకటి. దాదాపు ఒక దశాబ్ధం కిందట దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ జీప్ చాలా దృఢంగా, మినిమలిస్టిక్ ఇంటీరియర్​తో​, విశాలమైన క్యాబిన్​ స్పేస్​తో, ఫంక్షనల్​ డిజైన్​ను కలిగి ఉంటుంది. ఈ మహీంద్రా బొలెరో ఫ్రంట్​ గ్రిల్​తో, మస్కులర్ డిజైన్​తో చూడడానికి చాలా బాగుంటుంది. స్టాండ్-అవుట్ వీల్స్, మంచి గ్రౌండ్​ క్లియరెన్స్, బెస్ట్​ సస్పెన్షన్ సెటప్ ఉండడం వల్ల కఠినమైన రోడ్లపై కూడా చాలా హాయిగా దీనిని డ్రైవ్ చేయవచ్చు. తక్కువ ధరలో మంచి జీప్ కొనాలని ఆశించేవారికి ఈ మహీంద్రా బొలెరో మంచి ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.9.98 లక్షల నుంచి రూ.10.91 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

  • ఇంజిన్ - 1493 సీసీ - 3 సిలిండర్స్​
  • మ్యాక్స్ పవర్​ - 74.96 bhp@3600 rpm
  • మ్యాక్స్​ టార్క్ - 210 Nm@1600-2200 rpm
  • ట్రాన్స్​మిషన్​ - మాన్యువల్​
  • ARAI మైలేజ్ - 16 కి.మీ/ గంట
  • సిటీ మైలేజ్ - 14 కి.మీ/ గంట
  • ఫ్యూయెల్ టైప్ - డీజిల్​
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 60 లీటర్స్
  • గ్రౌండ్ క్లియరెన్స్ - 180 mm​
  • సీటింగ్ కెపాసిటీ - 7
  • బాడీ టైప్​ - ఎస్​యూవీ

4. Mahindra Scorpio : మహీంద్రా కంపెనీ విడుదల చేసిన బెస్ట్ సెల్లింగ్ జీప్​ల్లో 'స్కార్పియో' ఒకటి. ఇది ఒక పెద్ద ఎస్​యూవీ. పెద్దపెద్ద చక్రాలు, హై గ్రౌండ్ క్లియరెన్స్​, మస్కులర్ డిజైన్​తో ఇది వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ స్కార్పియోలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్ ఉంది. కనుక దీని రైడింగ్ ఎక్స్​పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. లేటెస్ట్ మోడల్​లో అత్యంత అధునాతన ఫీచర్లను కూడా పొందుపరిచారు. మార్కెట్లో ఈ మహీంద్రా స్కార్పియో ధర సుమారుగా రూ.13.59 లక్షలు నుంచి రూ.17.35 లక్షలు ఉంటుంది.

  • ఇంజిన్ - 1493 సీసీ - 4 సిలిండర్స్​
  • మ్యాక్స్ పవర్​ - 130 bhp@3750 rpm

  • సీటింగ్ కెపాసిటీ - 7,9
  • బాడీ టైప్​ - ఎస్​యూవీ

5. Force Motors Gurkha : ఫోర్స్​ మోటార్స్ గూర్ఖా అనేది ఒక మంచి ఫంక్షనల్​ యుటిలిటీ వెహికల్​. ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్​తో, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. దీనిలో ఎనిమిది మంది ప్రయాణికులు చాలా హాయిగా ప్రయాణించవచ్చు. ఇది మినిమలస్టిక్​ ఇంటీరియర్, ఎక్స్​టీరియర్​ డిజైన్​తో వస్తుంది. మార్కెట్లో ఈ ఫోర్స్ మోటార్స్ గూర్ఖా జీపు ధర సుమారుగా రూ.16.75 లక్షల నుంచి రూ.18 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

  • ఇంజిన్ - 2596 సీసీ - 4 సిలిండర్స్​
  • మ్యాక్స్ పవర్​ - 89.84 bhp@3200 rpm
  • మ్యాక్స్​ టార్క్ - 250 Nm@1400-2400 rpm
  • ట్రాన్స్​మిషన్​ - మాన్యువల్​
  • ఫ్యూయెల్ టైప్ - డీజిల్​
  • ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 63 లీటర్స్
  • సీటింగ్ కెపాసిటీ - 4
  • బాడీ టైప్​ - ఎస్​యూవీ

మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Mileage Scooters

మంచి ఎలక్ట్రిక్ కార్ కొనాలా? టాప్​-5 మోస్ట్ అఫర్డబుల్ e-SUVలు ఇవే! - Most Affordable Electric Cars

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.