Best Fuel Efficient Bike In India : ఇండియాలో ద్విచక్రవాహనాలకు గిరాకీ ఎక్కువే. కుర్రకారు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రతి ఒక్కరూ బైకు కలిగి ఉండాలని ఆశపడుతుంటారు. ఈ కాలంలో అనేక రకాల బైకులు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వేరియంట్ వరరు చాలా రకాలు దొరుకుతున్నాయి. అయితే చాలా మంది మంచి ఇంధన సామర్థ్యం కలిగిన బైకులను కొనాలని అనుకుంటున్నారా? అయితే వీటీపై ఓ లుక్కేయండి.
1.Hero Splendor Plus Xtec Features : Hero Splendor Plus Xtec బైక్ 97.2సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 8.02 PS పవర్, 8 నాటికల్ మైల్ టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాక్ సామర్థ్యం 9.8 లీటర్లు. ఈ బైక్ ధర సుమారు రూ.78,251 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఈ హీరో స్ల్పెండర్ బైక్ లీటర్ పెట్రోల్‌కు 83.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2.Hero Splendor Plus specs : హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ 97.2సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 8.02PS పవర్, 8.05Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాక్ సామర్థ్యం 9.8 లీటర్లు. ఈ బైక్ ధర సుమారు రూ.73,481 నుంచి రూ.74,801 ( ఎక్స్ షోరూమ్ ధర) ఉంటుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 80.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3.Hero HF Deluxe : హీరో హెచ్ఎఫ్ డ్యూలెక్స్ బైక్ 97.2సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 8.02 PS పవర్, 8nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ హీరో హెచ్ఎఫ్ డ్యూలెక్స్ ధర రూ. 59,998 నుంచి రూ. 68,768 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4.TVS Rider : టీవీఎస్ రైడర్: ఈ బైక్ 124.8సీసీ సామర్థ్యం కలిగిన ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 11.38PS పవర్, 11nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 67 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ టీవీఎస్ రైడర్ ధర రూ. 95,219 నుంచి రూ.1.03 లక్షలు వరకు ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5.Bajaj Pulsar NS125 : యూత్ లో బాగా క్రేజ్ ఉన్న అతి తక్కువ బైకుల్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 ఒకటి. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 99,571. 124.45 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. 12 హార్స్ పవర్ శక్తి, 11 నాటికల్ మైల్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజీ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్‌కు 65 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొత్త ఇంజిన్- 13రంగులు- మారుతి స్విఫ్ట్ నయా మోడల్ ఫీచర్లు అదుర్స్!
హీరో మేవ్రిక్ 440 బైక్ లాంఛ్ - ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతంటే?