Best Bikes Under 2 Lakh : రూ.2 లక్షలలోపు ధరలో మంచి బైక్స్, స్కూటర్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ కోసం చాలా కంపెనీల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైనవి మేం మీకు పరిచయం చేస్తున్నాం. వీటి స్పెసిఫికేషన్ల ఆధారంగా ఏ బైక్/స్కూటర్ మోడల్ మీ బడ్జెట్‌కు, అవసరాలకు సరితూగుతుందో ఒక అంచనాకు రండి. ప్రత్యేకించి మైలేజీ, ఇంజిన్ కెపాసిటీ వంటి అంశాలను కూడా తప్పకుండా దృష్టిలో ఉంచుకోండి. కొనుగోలుకు సంబంధించిన తుది నిర్ణయానికి వచ్చే ముందు ఇప్పటికే ఆయా ఆటోమొబైల్ కంపెనీల బైక్స్, స్కూటర్స్ నడుపుతున్న వారి ఫీడ్‌బ్యాక్‌ను కూడా తీసుకోవడం బెటర్.
1. KTM 200 Duke : స్టైలిష్ లుక్‌కు కేటీఎం 200 డ్యూక్ పెట్టింది పేరు. ఆకట్టుకునే సొగసైన రంగుల్లో ఇది లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.1,96,876 ఉంటుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 199.5 సీసీ
- స్పెసిఫికేషన్లు : డిస్క్ బ్రేకులు, అలాయ్ వీల్స్
- మైలేజ్ : లీటరుకు 34 కి.మీ
- బరువు : 159 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 13.4 లీటర్లు
- సీటు ఎత్తు : 822 మి.మీ
2. Suzuki Gixxer SF 250 : సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 అనేది 4 వేరియంట్లు, 3 రంగులలో లభించే స్పోర్ట్స్ బైక్. గిక్సర్ ఎస్ఎఫ్ 250 రేస్ ఎడిషన్ ధర రూ.1,97,773. గిక్సర్ ఎస్ఎఫ్ 250 రైడ్ కనెక్ట్ ధర రూ.2,08,133, గిక్సర్ ఎస్ఎఫ్ 250 రేస్ ఎడిషన్ రైడ్ కనెక్ట్ ధర రూ.2,08,508. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.
- ధర : రూ.1,94,640
- బరువు : 161 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 12 లీటర్లు
- స్పెసిఫికేషన్లు : డిస్క్ బ్రేకులు, అలాయ్ వీల్స్
- ఇంజిన్ కెపాసిటీ : 249 సీసీ
- మైలేజీ - లీటరుకు 35 కి.మీ
- సీటు ఎత్తు : 800 మి.మీ
3. Hero Mavrick 440 : హీరో మావ్రిక్ 440 - ఇప్పటివరకు హీరో కంపెనీ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్ ఇదే. దీన్ని హార్లే-డేవిడ్‌సన్ X440 మోడల్ ఆధారంగా రూపొందించారు. బేస్, మిడ్ (రూ.2,14,001), టాప్ (రూ.2,24,001) అనే మూడు వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ఇది 5 రంగులలో అందుబాటులో ఉంది.
- ధర : రూ.1,99,001 (హీరో మావ్రిక్ 440 - బేస్ వేరియంట్)
- స్పెసిఫికేషన్లు : డిస్క్ బ్రేకులు, స్పోక్ వీల్స్
- ఇంజిన్ కెపాసిటీ : 440 సీసీ
- బరువు : 191 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 13.5 లీటర్లు
- సీటు ఎత్తు : 803 మి.మీ
4. Royal Enfield Classic 350 : రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 క్రూయిజర్ బైక్ 6 వేరియంట్లు, 15 రంగులలో అందుబాటులో ఉంది. క్లాసిక్ 350 రెడిచ్ ధర రూ.1,93,080; క్లాసిక్ 350 హల్క్ యాన్ -సింగిల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.1,95,919; క్లాసిక్ 350 హల్క్ యాన్ -డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.2,01,984; క్లాసిక్ 350 క్లాసిక్ సిగ్నల్స్ - డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.2,13,852; క్లాసిక్ 350 క్లాసిక్ డార్క్ - డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.2,20,991; క్లాసిక్ 350 క్లాసిక్ క్రోమ్ - డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.2,24,755 ఉన్నాయి.
- ఇంజిన్ : 349సీసీ, BS6 స్టాండర్డ్, 27 Nm టార్క్
- బరువు : 195 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 13 లీటర్లు
- మైలేజీ - లీటరుకు 32 కి.మీ
- సీటు ఎత్తు : 805 మి.మీ
- రంగులు : 15 రంగుల్లో లభ్యం
- డిజిటల్ ఫీచర్స్ : యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, గడియారం, ఇంధన గేజ్‌ను చూపే ఎల్‌సీడీ స్క్రీన్, అనలాగ్ స్పీడోమీటర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్
5. Yamaha R15 V4 : యమహా R15 V4 అనేది 5 వేరియంట్లు, 7 రంగులలో లభ్యమయ్యే స్పోర్ట్స్ బైక్. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో పాటు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇది వస్తుంది. వేరియంట్ల వారీగా చూస్తే R15 V4 మెటాలిక్ రెడ్ వేరియంట్ ధర రూ.1,83,155; R15 V4 డార్క్ నైట్ ధర రూ.1,84,155; R15 V4 రేసింగ్ బ్లూ ధర రూ.1,88,155; R15 V4 M ధర రూ.1,97,355; R15 V4 MotoGP ధర రూ.1,98,532 మేర ఉన్నాయి.
- ధర: రూ.1,83,155
- ఇంజిన్ : 155 సీసీ, BS6 ఇంజిన్
- బ్రేక్స్ : ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లు, యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
- బరువు : 141 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 11 లీటర్లు
- మైలేజీ : లీటరుకు 51.4 కి.మీ
- సీటు ఎత్తు : 815 మి.మీ
6. Bajaj Dominar 250 : బజాజ్ డోమినార్ 250 అనేది సింగిల్ వేరియంట్ బైక్. ఇది 3 రంగులలో అందుబాటులో ఉంది. అవి: సిట్రస్ రష్, రేసింగ్ రెడ్, స్పార్క్లింగ్ బ్లాక్. దీని బాడీ వర్క్ అంతటా గ్రాఫిక్‌లు ఉంటాయి.
- ధర : రూ.1,79,746
- ఇంజిన్ : 248.8 సీసీ, BS6
- బరువు : 180 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 13 లీటర్లు
- స్పెసిఫికేషన్లు : డిస్క్ బ్రేకులు, అల్లాయ్ వీల్స్
- మైలేజీ : లీటరుకు 32 కి.మీ
- సీటు ఎత్తు : 800 మి.మీ, స్ప్లిట్ సీట్లు
- డిజిటల్ ఫీచర్స్ : బైక్ స్ప్లిట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. రైడ్ సంబంధిత సమాచారం ప్రైమరీ డిస్‌ప్లేలో ప్రదర్శించబడుతుంది. ఇంధన ట్యాంక్ వద్ద సెకండరీ డిస్‌ప్లే అందుబాటులో ఉంటుంది.
7. Simple Energy One : సింపుల్ ఎనర్జీ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 రంగులలో అందుబాటులో ఉంది. ఇది సింగిల్ వేరియంట్లో మాత్రమే విడుదలైంది. దీనిలో ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేకులు ఉంటాయి. సింపుల్ వన్ కంపెనీ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
- ధర : రూ.1,65,999
- సింగిల్ ఛార్జింగ్‌తో రైడింగ్ రేంజ్ : 212 కి.మీ
- గరిష్ఠ వేగం : గంటకు 105 కి.మీ
- బరువు : 137 కిలోలు
- బ్యాటరీ ఛార్జింగ్ సమయం (0-100%) : 4 గంటలు
- బ్యాటరీ సామర్థ్యం : 4500 W
- సీటు ఎత్తు : 796 మి.మీ
- డిజిటల్ ఫీచర్స్ : ఏడు అంగుళాల TFT టచ్‌స్క్రీన్ ఉంది. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ సైతం ఉంది. దీన్ని కనెక్ట్ చేసుకొని కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సంగీతం వినొచ్చు. డాక్యుమెంట్ స్టోరేజ్ చేసుకోవచ్చు.
- ప్రధాన పోటీదారులు : ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్ ప్రో ప్యాక్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, బజాజ్ చేతక్
8. Ferrato Disruptor : ఫెర్రాటో డిస్‌రప్టర్ అనేది ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్. ఇది సింగిల్ వేరియంట్లో మాత్రమే విడుదలైంది. 3 రంగులలో అందుబాటులో ఉంది. దీనిలో ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
- ధర : రూ.1,69,999
- ఒక్క ఛార్జింగ్‌తో రైడింగ్ రేంజ్ : 129 కి.మీ
- గరిష్ఠ వేగం : గంటకు 95 కి.మీ
- బరువు : 164 కిలోలు
- బ్యాటరీ ఛార్జింగ్ సమయం (0-100%) : 5 గంటలు
- బ్యాటరీ కెపాసిటీ : 3300 W
- సీటు ఎత్తు : 700 మి.మీ
9. Bajaj Pulsar N250 : బజాజ్ పల్సర్ N250 బైక్ 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. పల్సర్ N250 డ్యూయల్ ఛానల్ ABS ప్రారంభ ధర రూ.1,50,613. పల్సర్ N250 డ్యూయల్ ఛానల్ ABS [2024] మోడల్ ధర రూ.1,51,361. ఈ బైక్ 3 రంగులలో లభిస్తుంది. అవి: గ్లోసీ మెటాలిక్ రెడ్, పెర్ల్ మెటాలిక్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో పాటు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి.
- ధర : రూ.1,50,613
- ఇంజిన్ కెపాసిటీ : 249 సీసీ
- మైలేజీ : లీటరుకు 44 కి.మీ
- బరువు : 162 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 14 లీటర్లు
- సీటు ఎత్తు : 795 మి.మీ
10. TVS Star City Plus : టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ధర 3 వేరియంట్లలో లభిస్తుంది. స్టార్ సిటీ ప్లస్ మోనో టోన్ ప్రారంభ ధర రూ.74,373, స్టార్ సిటీ ప్లస్ డ్యూయల్ టోన్ ధర రూ.74,905; స్టార్ సిటీ ప్లస్ డిస్క్ ధర రూ.78,436. దీని డిజైన్ చూడచక్కగా ఉంటుంది. 9 రంగులలో ఇది లభిస్తుంది.
- ధర : రూ. 74,373
- ఇంజిన్ కెపాసిటీ : 109.7 సీసీ
- మైలేజీ : లీటరుకు 67 కి.మీ
- బరువు : 115 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 10 లీటర్లు
- సీటు ఎత్తు : 785 మి.మీ