Best 7 Seater Cars In India : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీలది ప్రత్యేక స్థానం. ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణించాలంటే ఈ 7 సీటర్ కార్ తప్పనిసరి. అందుకే వీటిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అంతే కాకుండా లాంగ్ జర్నీలకు ఇవి చాలా ఉపయోగకరం. వీటిలో ఎంత దూరం ప్రయాణం చేసినా అంతగా అలసట ఉండదు. అందుకే రాజకీయ నాయకులు సైతం ఎక్కువగా ఎస్‌యూవీలను వాడుతుంటారు. అయితే భారత్‌లో ప్రస్తుతమున్న టాప్-5 మోడల్ ఎస్‌యూవీలు, వాటి మైలేజ్, ధర తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.
1.Maruti Suzuki Ertiga price : 7 సీటర్ కెపాసిటీ కలిగిన మారుతీ సుజుకీ ఎర్టిగా కారు రూ.8.69 లక్షలు-రూ.13.03 లక్షలు ప్రైస్ రేంజ్లో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 20.3 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 20.3 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ఈ వెహికల్ ప్రస్తుతం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 7 కలర్ వేరియంట్లలో లభిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2.Mahindra Bolero Price : 7 సీటర్ కెపాసిటీ కలిగిన ఈ మహింద్రా బొలెరో కారు ప్రారంభ రూ.9.89 లక్షల నుంచి రూ.10.90 లక్షల ప్రైస్ రేంజ్లో లభిస్తోంది. ఈ కారు సీటింగ్ కెపాసిటీ 7. ఇది 1.5లీటర్ల డీజిల్‌తో నడిచే ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ వాహనం లీటరు డీజిల్‌కు 16 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో 1499సీసీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది ప్రస్తుతం అత్యధికంగా 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 3 కలర్స్‌లో ఈ కారు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3.Mahindra xuv700 Price : ఆరుగురు ప్రయాణించే సౌకర్యం కలిగిన ఈ మహీంద్ర ఎక్స్‌యూవీ రూ.13.29 లక్షలు-రూ.26.98లక్షల ప్రైస్ రేంజ్లో లభిస్తుంది. ఈ వెహికల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌పై 13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. డీజిల్ ఇంజిన్ లీటర్‌కు 17కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఈ కారు 37 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు 5 కలర్స్‌లో లభిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4.Innova Crysta Price : ఎనిమిది మంది ప్రయాణించే సౌకర్యం కలిగిన ఈ ఇన్నోవా క్రిస్టా ఎంయూవీ కారు రూ.19.99లక్షలు-రూ.26.30లక్షల ప్రైస్ రేంజ్లో లభిస్తోంది. ఈ వాహనం ఇంజన్ సామర్థ్యం 2393సీసీ ఉంది. ఈ కారు 3400ఆర్పీఎం పవర్ వద్ద 147.51బీహెచ్పీని విడుదల చేస్తుంది. ఈ వాహనం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5.Toyota fortuner : ఏడుగురు ప్రయాణించే సౌకర్యం ఉన్న ఈ ఎస్యూవీ రూ.33.43లక్షల నుంచి రూ.51.44లక్షల ప్రైస్ రేంజ్లో లభిస్తోంది. లీటర్ పెట్రోల్‌కు 10 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుండగా డీజిల్ ట్యాంక్‌పై 10 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారు 7 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 7 కలర్స్‌లో ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రూ.10 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే!
రూ.6 లక్షల బడ్జెట్లోనే కొత్త కారు కొనాలా? ఫేమస్ మోడల్స్ ఏవో తెలుసా?